డీజిల్ వాహనాల నిషేధం పరిష్కారం కాదు
Published Wed, Jun 22 2016 7:28 PM | Last Updated on Fri, Sep 28 2018 3:18 PM
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఢిల్లీ రోడ్లపై డీజిల్ వాహనాలను నిషేధిస్తూ తీర్పును ఇవ్వడం సరైంది కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఇది దురదృష్టకరమైన నిర్ణయమని అన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నిర్ణయం కొత్త టెక్నాలజీతో తయారయ్యే వాహనాలపై పడుతుందని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్యనిర్వాహక శాఖ చేస్తున్నకృషిని న్యాయశాఖ అభినందిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. చట్టాలు రూపొందిచడం కార్యానిర్వాహక శాఖ పని అని దానిలో లోపాలుంటే చెప్పడం న్యాయశాఖ విధి అని జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు భారీ డీజిల్ వాహనాలను న్యాయస్థానం గతేడాది డిసెంబర్ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement