భారీ మొత్తంలో ఫోక్స్ వాగన్ నష్టపరిహారం | Volkswagen reaches $14.7 billion emissions settlement | Sakshi
Sakshi News home page

భారీ మొత్తంలో ఫోక్స్ వాగన్ నష్టపరిహారం

Published Tue, Jun 28 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

భారీ మొత్తంలో ఫోక్స్ వాగన్ నష్టపరిహారం

భారీ మొత్తంలో ఫోక్స్ వాగన్ నష్టపరిహారం

శాన్ ఫ్రాన్సిస్కో : కర్బన ఉద్గారాల స్కాంకు పాల్పడినందుకు జర్మన్ కార్ల తయారీదారు ఫోక్స్ వాగన్ భారీ మొత్తంలో సెటిల్ మెంట్ కుదుర్చుకుంది.  ఈ దావా కేసులో నష్టపరిహారంగా 1500 కోట్ల డాలర్లును నగదు రూపంలో చెల్లించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాలుష్యానికి పాల్పడిన డీజిల్ వాహనాలను బాగుచేయడం కాని, బై బ్యాక్  చేయడం కాని చేస్తామని ఒప్పుకున్నట్టు ఒప్పంద చర్చల ఓ అధికారి చెప్పారు. స్కాంకు పాల్పడిన కార్లు కొన్న ప్రతి యజమానికి 1500 కోట్ల డాలర్ల కింద 10వేల డాలర్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది.  అమెరికా ఆటో స్కాండల్ సెటిల్ మెంట్ లో ఇదే అతిపెద్ద మొత్తమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సెటిల్ మెంట్ ను కంపెనీ మంగళవారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ, ఫోక్స్ వాగన్ స్పందించడానికి తిరస్కరించాయి. .


1000 కోట్ల డాలర్లను యజమానులకు బైబ్యాక్ ఆఫర్ ను ప్రకటిస్తుండగా.. దాదాపు 500 కోట్ల డాలర్లను కర్బన ఉద్గారాలకు నష్టపరిహారంగా.. జీరో ఉద్గారాలకు తెచ్చుకోవడానికి ఫండ్స్ చెల్లిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.అయితే ఈ సెటిల్ మెంట్ వ్యవహారంలో మరో వెర్షన్ చీటింగ్ పాల్పడిన 3 లీటర్ల ఫోక్స్ వాగన్ డీజిల్ వాహనాలకు వర్తించదని తెలుస్తోంది. ఇప్పటికే ఫోక్స్ వాగన్ జరిమానాల మీద జరిమానాలు భరించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. 2.0 లీటర్ డీజిల్ ఫోక్స్ వాగన్ 2009-15 కార్ల యజమానులు సెప్టెంబర్ నాటి అంచనా విలువతోపాటు కనీసం 5,100 డాలర్లను నష్టపరిహారంగా పొందుతారని అధికారులు చెబుతున్నారు.

కొంతమంది ఓనర్లు 10వేల డాలర్లను నష్టపరిహారంగా పొందచ్చని, కారు విలువను బట్టి నష్టపరిహారం ఉంటుందని పేర్కొంటున్నారు. 2015 సెప్టెంబర్ 18న ఈ స్కాం బయటికి పొక్కింది. స్కాండల్ మొదలైనప్పటినుంచి ఫోక్స్ వాగన్ డీజిల్ సగటు విలువ 19 శాతం పడిపోయింది. జడ్జి అనుమతితో ఈ సెటిల్ మెంట్ అమల్లోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement