జర్మన్ ఆటోమోబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఉద్గారాల నిబంధనల ఉల్లంఘన కింద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 500 కోట్ల జరిమానా విధించింది. ఫోక్స్‌వ్యాగన్ డీజిల్ కార్ల వల్ల దేశంలో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని ఆ సంస్థపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఈ పెనాల్టీ విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా నగదును జమచేయాలని ఎన్‌జీటీ అధ్యక్షుడు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీచేశారు. ట్రైబ్యూనల్ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సెంట్రల్ పొల్యూషన్ బోర్డు) వద్ద రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది.
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో ట్రిబ్యునల్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చేసిన ఈ పని వల్ల పర్యావరణానికి కలిగిన అసలు నష్టాన్ని అంచనా వేయడానికి పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో ఓ కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఎన్‌జీటీ ఈ ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment