ఫోక్స్‌వ్యాగన్‌కు ఎన్‌జీటీ షాక్‌ | NGT Slaps Rs 100 Crores Fine On Volkswagen | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్‌కు ఎన్‌జీటీ షాక్‌

Published Thu, Jan 17 2019 2:23 PM | Last Updated on Thu, Jan 17 2019 6:27 PM

NGT Slaps Rs 100 Crores Fine On Volkswagen - Sakshi

జర్మన్ కార్ల తయారీ సంస్థ  ఫోక్స్‌వ్యాగన్‌కు ఊహించని షాక్ తగిలింది.. తప్పుడు డీజిల్ మీటర్లతో వినియోగదారులను మోసం చేశారంటూ దాఖలైన కేసుకు సంబంధించి న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) రూ.100కోట్లు చెల్లించాలని సూచించింది. ఒక్క 2006 ఏడాదిలోనే దాదాపు 3.17లక్షల వాహనాల ద్వారా వాస్తవానికంటే 40రెట్లు  నైట్రస్ ఆక్సైడ్స్ (NOx) విడుదల చేసిందన్న ఫిర్యాదుపై 24 గంటలలోగా సెంట్రల్ కాలుష్య నియంత్రణ బోర్డుకు జరిమానా సొమ్మును డిపాజిట్‌ చేయాలని నేడు (జనవరి 17) ఆదేశించింది. లేని పక్షంలో సంస్థ భారత్‌ విభాగం ఎండీని అరెస్టు చేయడంతోపాటు సంస్థకు చెందిన ఆస్తులను సీజ్‌ చేస్తామని  హెచ్చరించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్  మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా  కాలుష్య ఉద్గారాలపై , అనేక కేసులను ఎదుర్కొంటున్న ఫోక్స్ వ్యాగన్‌ ఇండియా  భారతదేశంలో కూడా వాహనాల్లో నైట్రస్ ఆక్సైడ్ను అనుమతించదగిన పరిమితులను అధిగమించి వాడిందని, తద్వారా ఢిల్లీ నగరంలో అటు పర్యావరణానికి ఇటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించిందని తెలిపింది. 

కాగా ఈ కేసులో  171.34 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా గత ఏడాది నవంబరు 16న ఆదేశించింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోపణలను సమర్ధించిన కమిటీ జరిమానా విధించాలని  సిఫార్సు చేసింది. కానీ సంస్థ జరిమానా సొమ్మునుజమలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన100కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తమ వాహానాలు దేశంలో స్టేజ్4 నిర్దేశించిన ఉద్గార నిబంధనలకు  అనుగుణంగానే ఉన్నాయని ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా  పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement