సాక్షి, ముంబై: ప్రమాదకర వాయు కాలుష్య కారకాలను వెదజల్లుతున్న కంపెనీలకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) భారీ షాకిచ్చింది. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్నారంటూ హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సహా నాలుగు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. తమ ఇళ్లకు కేవలం మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన యూనిట్, కాలుష్యంపై 2014 లో మహుల్, అంబపాడ గ్రామాల నివాసితులు దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఎన్‌జీటీ ఈ తీర్పు నిచ్చింది
ముంబైలోని మహుల్, అంబపాడ, చెంబూర్ ప్రాంతాలలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని, గ్యాస్ చాంబర్ లాంటి పరిస్థితి ఏర్పడిందని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో రానున్న ఐదేళ్లలో గాలి నాణ్యతను పునరుద్ధరించేలా 286 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఈ కంపెనీలను కోరింది. హెచ్‌పీసీఎల్‌కు 76.5 కోట్లు, బీపీసీఎల్‌కు 7.5 కోట్లు, ఏఇజిఐఎస్ 142 కోట్లు, ఎస్‌ఎల్‌సిఎల్‌కు 2 0.2 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీపీబీ),సంబంధిత కంపెనీల డేటా ఆధారంగా ఉద్గారాల విలువలను అంచనా వేసినట్లు గ్రీన్ ప్యానెల్ తెలిపింది. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు పది మంది సభ్యులతో కూడిన ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్‌జీటీ అధ్యక్షుడు జస్టిస్ఏకే గోయల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment