
న్యూఢిల్లీ: కాంపాక్ట్ సెడాన్ కారు టిగోర్ కొత్త వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.5.20లక్షలు–6.65 లక్షలు కాగా, ఇందులో 1.2 లీటర్ల ఇంజిన్ అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు–7.38 లక్షలుగా నిర్ణయించామని, 1.05 లీటర్ల ఇంజిన్‌తో ఈ సెడాన్ అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గుంటెర్ బుషెక్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రీమియం కస్టమర్ల విభాగంలో కాంపాక్ట్ సెడాన్ అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ విలువైన, ఆకర్షణీయమైన ఈ వెర్షన్‌ను మార్కెట్‌లో విడుదల చేశాం’ అని అన్నారయన.
Comments
Please login to add a commentAdd a comment