న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన అత్యున్నత శ్రేణి కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూలోని డీజిల్ వాహనాల్లో సమస్యలు తలెత్తుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షలకు పైగా కార్లను వెనక్కి రప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీఎండబ్ల్యూ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘కొన్ని డిజిల్ వాహనాల్లో గ్లైకాల్ కూలింగ్ ఫ్లూయిడ్ లీక్ అవుతోంది. ఎక్జాస్టింగ్ సిస్టమ్‌లో (వాహనాల్లో పొగను రీసైక్లింగ్ చేసి బయటకు పంపే యూనిట్) ప్రాబ్లం ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోంది. దీని వల్ల అగ్రి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్లను వెనక్కి రప్పించాలని భావిస్తున్నాము’ అని తెలిపారు.
అంతేకాక ‘ఇప్పటికే ఈ విషయం గురించి కార్ ఓనర్లకు కూడా సమాచారం ఇచ్చాము. ఈ వాహనాల్లోని ఎక్జాస్ట్ రిసర్క్యూలేషన్ మాడ్యూల్‌ని చెక్ చేస్తాము. ఏదైనా సమస్య ఉంటే ఆయా భాగాలను మారుస్తాము’ అని వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా ఇదే సమస్య తలెత్తడంతో దక్షిణ కొరియాలో 30 కార్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ ఇందుకు క్షమాపణలు చెప్పడమే కాకా యూరోప్, ఆసియా దేశాల్లో ఉన్న 4, 80, 000 డీజిల్ కార్లను వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment