బీజింగ్ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ కి చైనాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చైనా లో తమ ఇంపోర్టెడ్ మినీ సిరీస్ వాహనాలు భారీ సంఖ్యలో వెనక్కి తీసుకుంటున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా 6,109 వాహనాలు రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 8 నుంచి తమ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. ఫ్యూయల్ పంపింగ్ ప్రక్రియలో సమస్య ముందని.. దీని మూలంగా ఇంజీన్ పాడయ్యే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ ల విభాగం ఒక ప్రకటన ఈ విషయాన్ని తెలియజేసింది. గత ఏడాది జూన్ 12 నుంచి నవంబరు19 మధ్య తయారైనవని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. రీకాల్ చేసిన కార్ల సమస్యలను బిఎమ్‌డబ్ల్యూ చైనా ఆటోమోటివ్ ట్రేడింగ్ కంపెనీ ఉచితంగా పరిష్కరించనున్నట్టు తెలిపింది.
6వేల బిఎమ్‌డబ్ల్యూ కార్లు వెనక్కి
Published Mon, Mar 21 2016 4:03 PM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM
Advertisement