
ప్రముఖ వాహన తయారీ సంస్థ.. కియా మోటార్స్ (Kia Motors) తన 'ఈవీ6' (EV6) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన మొత్తం 1,380 యూనిట్లలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది.
కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లలో.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో 12వీ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే లోపం కారణంగా రీకాల్ పరకటించింది. ఈ సమస్య కారణంగా.. 2024లో కూడా కంపెనీ 1138 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు రీకాల్ జారీచేసింది.
ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ 12వీ బ్యాటరీ ఛార్జింగ్.. పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కారులోని లైట్స్, వైపర్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటికి శక్తిని ఇస్తుంది. కార్లలో ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. అయితే సంబంధిత వాహనాల యజమానులను నేరుగా సంప్రదించి వాటిని అప్‌డేట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రభావిత వాహనాల కస్టమర్లు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి.. సంబంధిత కియా డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు, లేదా ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చు. కియా రీకాల్ గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కు కూడా సమాచారం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment