జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సుమారు 7,20,796 యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఈ రీకాల్ ఎంధుకు ప్రకటించింది. దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ కంపెనీ తన కార్లలో వాటర్ పంప్‌లో ఒక లోపభూయిష్ట సీల్‌తో కూడిన సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. ఈ లోపం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రీకాల్ జెడ్4 కన్వర్టిబుల్‌తో సహా 2012 నుంచి 2018 మోడల్ సంవత్సరాల వరకు 12 మోడళ్లను ప్రకటించింది. ఇందులో 2,3,4,5 సిరీస్ కార్లు మాత్రమే కాకుండా ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5 కార్లు ఉన్నాయి.
ఈ 'రీకాల్'కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే డీలర్‌లకు తెలియజేసింది. కస్టమర్లకు అక్టోబర్ ప్రారంభం నుంచి వెల్లడించే అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించడానికి కస్టమర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే మొత్తం ఖర్చును కంపెనీ భరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment