జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన | Maruti Suzuki Jimny Recall Check The Reason | Sakshi
Sakshi News home page

జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన

Published Sat, Dec 7 2024 4:42 PM | Last Updated on Sat, Dec 7 2024 5:39 PM

Maruti Suzuki Jimny Recall Check The Reason

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్-రోడర్ కారుకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన అన్ని వేరియంట్లు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.

మారుతి సుజుకి జిమ్నీ కారు 80 కిమీ వేగంతో వెళ్తున్న సమయంలో బ్రేక్ వేస్తే వైబ్రేషన్స్ వస్తున్నట్లు, వేగం 60 కిమీకి తగ్గితే ఈ వైబ్రేషన్ పోతుందని చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించుడనికి రీకాల్ ప్రకటించింది. కారులో సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది.

మారుతి సుజుకి దేశీయ విఫణిలో.. ఆఫ్-రోడ్ విభాగంలో కూడా తన హవాను చాటుకోవడానికి, 'మహీంద్రా థార్'కు ప్రత్యర్థిగా నిలువడానికి జిమ్నీ ఎస్యూవీని లాంచ్ చేసింది. ప్రారంభంలో ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందినప్పటికీ.. క్రమంగా అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కారు కొంత చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే కూడా ధర కొంత ఎక్కువగా ఉండటం అనే తెలుస్తోంది.

ఇదీ చదవండి: జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..

మారుతి జిమ్నీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్.. 104.8 పీఎస్ పవర్, 134.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement