ఏప్రిల్ 2023లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం 17 నెలల్లో రెండు లక్షల అమ్మకాలను చేరుకుంది. మార్కెట్లో అడుగుపెట్టిన మొదటి 10 నెలల్లో 100000 యూనిట్లు.. మరో నాలుగు నెలల్లో 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 14 నెలల్లోనే 1.50 లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.
1.50 లక్షల సేల్స్ సాధించిన తరువాత.. మరో మూడు నెలల్లో 50వేల విక్రయాలను పొందింది. అంటే మొత్తం 17 నెలల్లో రెండు లక్షలమంది కస్టమర్లను ఆకర్శించి అమ్మకాల్లో అరుదైన ఘనతను సాధించింది.
ఇదీ చదవండి: కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయం
మారుతి ఫ్రాంక్స్
ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న మారుతి ఫ్రాంక్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (ఓ), జీటా, ఆల్ఫా అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ CNG, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment