భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకి) 2,555 యూనిట్ల ఆల్టో కే10 కార్లకు రీకాల్ ప్రకటించచింది. స్టీరింగ్ గేర్ బాక్స్‌లో లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
స్టీరింగ్ గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్య వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కంపెనీ భావిస్తోంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేసేవరకు వాహనదారులు కార్లను డ్రైవ్ చేయవద్దని సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బాధిత వాహన యజమానులను మారుతి సుజుకి అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వెల్లడించింది.
మారుతి సుజుకి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో & 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్‌లను మార్చిలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు ఆల్టో కే10 కోసం రీకాల్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment