
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఏప్రిల్ 2025 నుంచి తన వాహనాల ధరలను 4 శాతం పెంచే ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలు, నిర్వహణ ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
మోడల్‌ను బట్టి ధరల పెంపు జరుగుతుంది. అయితే కొత్త ధరలు వచ్చే నెలలో అధికారికంగా వెల్లడవుతాయి. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి.. వినియోగదారులపై ప్రభావాన్ని పరిమితం చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. కొన్ని తప్పని పరిస్థితులలో పెరుగుతున్న ధరల ప్రభావం కొంత వినియోగదారులపై కూడా పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
మారుతి సుజుకి తమ వాహన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడల్ ధరలను రూ. 1500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈ సారి కూడా ఈ స్థాయిలోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. పెరిగిన ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment