Alto K10
-
ఆల్టో కే10 కార్లకు రీకాల్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకి) 2,555 యూనిట్ల ఆల్టో కే10 కార్లకు రీకాల్ ప్రకటించచింది. స్టీరింగ్ గేర్ బాక్స్‌లో లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.స్టీరింగ్ గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్య వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కంపెనీ భావిస్తోంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేసేవరకు వాహనదారులు కార్లను డ్రైవ్ చేయవద్దని సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బాధిత వాహన యజమానులను మారుతి సుజుకి అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో & 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్లను మార్చిలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు ఆల్టో కే10 కోసం రీకాల్ ప్రకటించింది. -
కారు కొనాలనుకుంటున్నారా? మారుతి కార్లపై భారీ డిస్కౌంట్
ఆటో దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్ట్ నెలకు సంబంధించి కార్ల కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దాదాపు రూ. 57 వేల తగ్గింపు దాకా అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి మారుతి సుజుకి పై రూ. 57 వేల దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వేరియంట్ల ఆధారంగా కస్టమర్లు ఈ తగ్గింపును పొందవచ్చు. ఆల్టో కే10పై రూ. 57 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో 56,000 వరకు తగ్గింపు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెట్రోల్, CNG-ఆధారిత మారుతి సుజుకి S ప్రెస్సో అన్ని వేరియంట్లు రూ. 56,000 వరకు మొత్తం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన వేరియంట్లు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు) మారుతీ సుజుకీ ఇగ్నిస్, బాలెనో, డిజైర్, వ్యాగన్ ఆర్ మోడల్స్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. వేరియంట్లు, డీలర్షిప్ ఏజెన్సీల ఆధారంగా ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. కాగా మారుతి సుజుకి ఈ ఏడాది క్యూ1లో మెరుగైన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్తోముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 145శాతం పుంజుకుని రూ. 2,485 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 45 లక్షల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
మారుతి కార్లలో లోపాలు: రీప్లేస్ చేసేదాకా దయచేసి వాడకండి!
సాక్షి, ముంబై: భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8, 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి బుధవారం తెలిపింది.ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో , గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఈరోజు విడుదల చేసింది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్టు వెల్లడించింది. ఈ లోపం కారణంగా వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది. ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత కార్ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది. కాగా గత డిసెంబరులో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా,ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా మోడల్స్ 9,125 యూనిట్లను ఫ్రంట్‌లైన్ సీట్ బెల్ట్‌లలోని లోపాలను సరిచేయడానికి రీకాల్ చేసింది. -
ఆల్టోకే10 సీఎన్జీ కారు వచ్చేసింది... అందుబాటు ధరలో
సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్జీ మోడల్న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ ద్వారా తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది. సీఎన్జీ వర్షెన్ ధర రూ. రూ.5,94,500 ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. వీఎక్స్ఐ అనే ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 సీఎన్జీ అందుబాటులోకి ఇచ్చింది. ఇటీవల తమ మోడల్స్‌లో మరిన్ని సీఎన్జీ వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఎస్- సీఎన్జీ వాహనాలను విక్రయించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఆల్టో కే10 సీఎన్జీ ఇంజీన్ డ్యూయల్ జెట్ , డ్యూయల్ VVTతో 1.0లీటర్ ఇంజీన్ అందిస్తోంది.5300 RPM వద్ద 56 hp ,3400 RPM వద్ద 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ 33.85కి.మీ/కేజీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. డిజైన్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా థర్డ్-జెన్ ఆల్టో కే 10 మాదిరి డిజైన్‌ను కలిగి ఉంది. అయితే కొత్త పవర్ ట్రెయిన్‌కు అనుగుణంగా రైడ్ నాణ్యత, సౌకర్యం, భద్రతకు అనుగుణంగా క్యాలిబ్రేట్ చేసిందని పేర్కొంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ ఫిల్టర్స్ హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్తోపాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన SmartPlay డాక్, ఫ్యూయల్ అలర్ట్, డోర్ అజార్ వార్నింగ్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం పోర్ట్‌ఫోలియోలో 13 ఎస్- సీఎన్సీ మోడళ్లను కలిగి ఉంది. వీటిలో ఆల్టో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్ఎల్6, సూపర్ క్యారీ,టూర్ ఎస్ ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ క్విడ్‌కి గట్టిగా పోటీ ఇచ్చిన ఆల్టో కే10 సీఎన్జీ వెర్షన్ మరింత పోటీగా నిలవనుంది.రెనాల్ట్ క్విడ్‌లో ఇంకా సీఎన్జీ వేరియంట్ రాలేదు. -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్‌పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్‌తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!) -
ఆల్టో K10 లవర్స్‌కు గుడ్ న్యూస్! రూ. 11 వేలతో...
సాక్షి,ముంబై: మారుతి సుజుకి సరికొత్త ఆల్టో కె10 కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త ఆల్టో K10 బుకింగ్‌లను మారుతి సుజుకి బుధవారం ప్రారంభించింది. మారుతి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ తాజా వెర్షన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్న కొత్త ఆల్టో కె-10 కస్టమర్లను ఆకట్టుకోనుంది. రూ. 11 వేలు చెల్లించి ఆల్టో కె10ని ప్రీ-బుక్ చేయవచ్చు. మారుతి అరేనా షోరూంలో, లేదా ఆన్లైన్లో గానీ ఈ కారును బుక్ చేసుకోవచ్చు. (సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?) మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 4.32 మిలియన్లకు పైగా కస్టమర్లతో, ఆల్టో దేశంలో అత్యంత ప్రభావవంతమైన కార్ బ్రాండ్‌గా ఉందని చెప్పారు.. ఆల్టో కుటుంబాలు విపరీతంగా ఇష్టపడే, లెజెండరీ ఆల్టో యువ భారతదేశం ఆకాంక్షలతో అభివృద్ధి చెందిన దిగ్గజ బ్రాండ్‌కు నిదర్శనం. 22 సంవత్సరాల బలమైన బ్రాండ్ వారసత్వంతో, ఆల్టో గౌరవానికి విశ్వసనీయతకు చిహ్నం మాత్రమేకాదు తమకు చాలా విజయ వంతమైన బ్రాండ్ అన్నారు. దేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పునర్నిర్వచించేలా, కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా కొత్త ఆల్-న్యూ ఆల్టో K10 తీర్చి దిద్దామని మారుతి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ అన్నారు. ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్, సాంకేతికతతో నడిచే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. (వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!) ఫీచర్లు, ధరపై అంచనాలు ఆల్టో K10 సరికొత్త డిజైన్, ప్లాట్‌ఫారమ్, ఇంటీరియర్ లేఅవుట్, ఫీచర్ లిస్ట్‌తో రానుంది. కార్ టెక్ కనెక్ట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మెరుగైన పనితీరు కోసం హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌తో రానుంది. 1,000 cc పెట్రోల్ ఇంజీన్‌తో రానుందని భావిస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ఎస్-ప్రెస్సో ధర రూ. 4.25 లక్షల కంటే తక్కవనేగా ఉండనుందని అంచనా. కొత్త ఆల్టో కె10 ఆగస్టు 18 న అధికారికంగా లాంచ్ కానుంది. ఇదికూడా చదవండి : జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్ -
ఆల్టో కె10 కొత్త వెర్షన్ లాంచ్ చేసిన ధోనీ
మినీ కారు సెగ్మెంట్లో తన మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునే లక్ష్యంతో మారుతి సుజుకీ ఆల్టో కె10 మోడల్లో సరికొత్త వెర్షన్‌ను హైదరాబాద్ లో లాంచ్ చేసింది. ప్రముఖ క్రికెటర్ , కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేతులు మీదుగా గ్రాండ్ గా విడుదలైంది. కొత్తగా ముస్తాబైన సరికొత్త ఆల్టో కె10 ధర2. 5 లక్షల రూపాయల నుంచి 4.5 లక్షల రూపాయల వరకు ఉండనుందని కంపెనీ ప్రకటించింది. కరెంట్ మోడల్ తో పోలిస్తే ఇది కొంచెం ధర ఎక్కువని తెలిపింది. ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ సదుపాయంతో, 7 సీట్లతో కొత్తగా లాంచ్ అయిన ఈ 'కూల్ ఆల్టో కె10' తమకు కీలకమైన ఉత్పత్తి కంపెనీ వెల్లడించింది. సరికొత్త టెక్నాలజీ, విలువకు తగిన కారు కావాలనుకునే కస్టమర్లను ఇది ఆకట్టుకోనుందని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కల్సి తెలిపారు. ఈ సందర్భంగా ధోనీ తన బయోపిక్ ముచ్చట్లను పంచుకున్నారు. మరో వైపు ముత్యాల నగరం హైదరాబాద్ లో ధోనీ తమ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని కంపెనీ ట్వీట్ చేసింది. M.S. Dhoni @msdhoni has joined us at the venue in the City of Pearls, Hyderabad, to unveil the big surprise. @DhoniBiopic #DrivenByPassion — Alto 800 (@Alto_800) September 24, 2016