సాక్షి,ముంబై: మారుతి సుజుకి సరికొత్త ఆల్టో కె10 కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త ఆల్టో K10 బుకింగ్‌లను మారుతి సుజుకి బుధవారం ప్రారంభించింది. మారుతి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ తాజా వెర్షన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్న కొత్త ఆల్టో కె-10 కస్టమర్లను ఆకట్టుకోనుంది. రూ. 11 వేలు చెల్లించి ఆల్టో కె10ని ప్రీ-బుక్ చేయవచ్చు. మారుతి అరేనా షోరూంలో, లేదా ఆన్‌లైన్‌లో గానీ ఈ కారును బుక్ చేసుకోవచ్చు. (సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?)
మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 4.32 మిలియన్లకు పైగా కస్టమర్లతో, ఆల్టో దేశంలో అత్యంత ప్రభావవంతమైన కార్ బ్రాండ్‌గా ఉందని చెప్పారు.. ఆల్టో కుటుంబాలు విపరీతంగా ఇష్టపడే, లెజెండరీ ఆల్టో యువ భారతదేశం ఆకాంక్షలతో అభివృద్ధి చెందిన దిగ్గజ బ్రాండ్‌కు నిదర్శనం. 22 సంవత్సరాల బలమైన బ్రాండ్ వారసత్వంతో, ఆల్టో గౌరవానికి విశ్వసనీయతకు చిహ్నం మాత్రమేకాదు తమకు చాలా విజయ వంతమైన బ్రాండ్ అన్నారు. దేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో పునర్నిర్వచించేలా, కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా కొత్త ఆల్-న్యూ ఆల్టో K10 తీర్చి దిద్దామని మారుతి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ అన్నారు. ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్, సాంకేతికతతో నడిచే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. (వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!)
ఫీచర్లు, ధరపై అంచనాలు
ఆల్టో K10 సరికొత్త డిజైన్, ప్లాట్‌ఫారమ్, ఇంటీరియర్ లేఅవుట్, ఫీచర్ లిస్ట్‌తో రానుంది. కార్ టెక్ కనెక్ట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మెరుగైన పనితీరు కోసం హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌తో రానుంది. 1,000 cc పెట్రోల్ ఇంజీన్‌తో రానుందని భావిస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ఎస్-ప్రెస్సో ధర రూ. 4.25 లక్షల కంటే తక్కవనేగా ఉండనుందని అంచనా. కొత్త ఆల్టో కె10 ఆగస్టు 18 న అధికారికంగా లాంచ్ కానుంది.
ఇదికూడా చదవండి : జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్
Comments
Please login to add a commentAdd a comment