new generation
-
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్‌కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్‌ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్‌లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
9/11: చేదు జ్ఞాపకాలే అయినా పదిలంగా ఉంచేందుకు..
9/11 Attacks: సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ.బాధితులకు జ్జాపకార్థంగా ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో) ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 11న ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు, వారి పిల్లలు, బంధువులు నివాళులు అర్పిస్తారు. అయితే ఇలా నివాళులు అర్పించటం వారసత్వంగా కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి నేటికి(బుధవారం) నాటికి 23 ఏళ్లు. స్మారక భవనం వద్ద ప్రతీ ఏడాది బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతి చెందినవారి పేర్లు చదువుతూ నివాళి అర్పిస్తారు. మృతి చెందినవారి వారసులు, వారి పిల్లలు.. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమవారి పేర్లు చదివి స్మరించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. 23 ఏళ్లు గడుస్తున్నా.. దాడుల తర్వాత బాధితుల వారసులు వాళ్ల తాత, అమ్మమ్మ, నానమ్మలు పేర్లు స్మరించుకుంటూ నివాళులు అర్పించటం పెరుగుతోంది. అయితే గతేడాది సుమారు మొత్తం 140 మంది వారసులు దాడుల్లో మృతి చెందినవారికి నివాళులు అర్పించగా.. అందులో దాడులు జరిగిన అనంతరం పుట్టిన యువతీయువకులు 28 మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆ యువతీయువకులు తమవారికోసం నివాళులు అర్పించడానికి ఎదురు చూస్తున్నారు. బాధితులకు సంబంధించిన వారసులు అధికంగా వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వారి వద్ద మృతి చెందినవారి కథలు, ఫొటోలు, జ్ఞాపకాలు ఉన్నాయి.9/11 దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితులతో అనుబంధం ఉన్నవారి సంఖ్య తగ్గినా స్మరించుకోవటం తరతరాలకు కొనసాగుతుందని 13 ఏళ్ల అలన్ ఆల్డిక్కీ అంటున్నాడు. గత రెండేళ్లుగా తన తాత, అనేక మంది వ్యక్తుల పేర్లను చదివి నివాళులు అర్పించాను. ఇవాళ (బుధవారం) బాధితుల పేర్లు చదివి నివాళులు అర్పిస్తానని అన్నాడు. ట్విన్ టవర్స్ దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన తన తాత అల్లన్ తారాసివిచ్ జ్ఞాపకాలను తన గదిలో భద్రపర్చుకున్నానని తెలిపాడు. దాడుల్లో మృతిచెందిన న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది క్రిస్టోఫర్ మైఖేల్ మోజిల్లో సోదరి పమేలా యారోస్జ్, ఆమె కుమార్తె కాప్రీ.. మెజిల్లో ఫొటోను చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం వీరు ఆయన పేరు చదివి నివాళులు అర్పించడానికి సిద్ధం ఉన్నారు. పమేలా యారోస్జ్ తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ విధంగా నాటి దాడులు, బాధితులకు సంబంధించిన జ్ఞాపకాలు రేపటి తరాలకు సజీవంగా కొనసాగనున్నాయి.సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని అల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశారు ఉగ్రదాడులు. -
మరమనిషి, తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ గురించి మీరెప్పుడైనా విన్నారా?
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రకరకాల రోబోలను రకరకాల పనుల కోసం రూపొందించారు. అవన్నీ మనుషుల ఆదేశాలకు అనుగుణంగా యాంత్రికంగా పనిచేసుకుపోయేవే తప్ప వాటికంటూ ప్రత్యేకంగా భావోద్వేగాలేవీ ఉండవు. అవి ఉత్త మరమనుషులు, అంతే! అయితే, చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా మనసున్న మరమనిషిని రూపొందించారు. ఈ రోబో పేరు ‘పెప్పర్’. మనుషుల మాది1రిగానే ఈ రోబో కూడా ప్రేమ, సంతోషం, బాధ, కోపం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు.ఎదుటనున్న మనుషుల భావోద్వేగాలను గ్రహించి, అందుకు అనుగుణంగా నడుచుకోగలదు. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోను రూపొందించారు. పూర్తిగా మనిషంత పరిమాణంలో 5.4 అడుగుల ఎత్తు, 62 కిలోల బరువుతో వారు తయారు చేసిన ఈ రోబో తన భావోద్వేగాలను ముఖంలో పలికించగలదు. షాంఘైలో జూలై 4 నుంచి 6 వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్–2024’లో ఈ రోబో పనితీరును ప్రదర్శించారు. పెద్దలను స్నేహపూర్వకంగా పలకరించడం, చిన్నపిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వంటి చేష్టలతో ఈ మనసున్న మరమనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధుల బాగోగులను చూసుకునేలా, వారి ఆరోగ్య అవసరాలను కనిపెట్టుకుని, వేళకు మందులు అందించడం వంటి సేవలు చేసేలా దీనిని రూపొందించారు.తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ..హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది. విమానాలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘జోబీ ఏవియేషన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎగిరే కార్లను రూపొందించాయి. ‘జోబీ ఏవియేషన్స్’ ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎటువంటి ఉపరితలం పైనుంచి అయినా, ఉన్న చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. ఇటీవల కాలిఫోర్నియాలో పరీక్షాత్మకంగా దీని ప్రయాణాన్ని నిర్వహించినప్పుడు, హైడ్రోజన్ ఇంధనంతో ఇది ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇదివరకటి ఫ్లైయింగ్ కార్ల రికార్డులను బద్దలు కొట్టింది.దీని గరిష్ఠ వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ రూపకల్పన కోసం అమెరికన్ సైన్యం కొంతవరకు నిధులు సమకూర్చినట్లు ‘జోబీ ఏవియేషన్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకుపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా, దేశాల మధ్య కూడా ఇది ప్రయాణించగలదని, దాదాపు 900 కిలోమీటర్ల వరకు దీనికి ఇంధనం నింపాల్సిన అసరం ఉండదని బెవిర్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఉత్పత్తిని 2050 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు. -
ఇదీ.. లగ్గం లాగిన్!
నాంపల్లి: పెళ్లి కార్డుతో వివాహ వేడుక ఆరంభమై.. మూడు ముళ్ల బంధంతో ముడివేసుకుని సంపూర్ణ దాంపత్యంతో ముగుస్తుంది. ఈ మధ్యలో జరిగే తంతువునే ‘లగ్గం’ అని పిలుస్తారు. ఒక లగ్గం జరగాలంటే వధువు, వరుడు ఇద్దరూ ఉండాలి. ఒకప్పుడు వివాహం చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్. ప్రపంచీకరణ నేపథ్యంలో తరాలు చూడటానికి ముందే ఆన్లైన్లోనే పరిచయమైపోతున్నారు. ఒకరికొకరు నచ్చితే అందులోనే పెళ్లికి ఒప్పేసుకుంటున్నారు..ఆస్తులు, అంతస్తుల కంటే మనసులు నచ్చితే చాలంటూ పెద్దలను ఒప్పిస్తున్నారు. ఒకప్పుడు ఒక పెళ్లి చేయాలంటే మంచి సంబంధం దొరకాలనే వారు. అందుకోసం ఏళ్ళకు ఏళ్లు వేచి చూసేవారు. ఇందుకోసం పెళ్లిళ్ల పేరయ్యలను ఆశ్రయించేవారు. ప్రస్తుతం వారి స్థానంలో మ్యాట్రిమోనీ సంస్థలు పుట్టుకొచ్చాయి. కులాలు, మతాలు, గోత్రాలతో పాటు వధువు వరుల చిత్రాలను మ్యాట్రిమోనీ సంస్థల్లోనే వెతుకుతున్నారు. మార్కెట్లో మ్యాట్రిమోనీ సంస్థలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు ‘లగ్గం’ అనే ప్రాజెక్టును రూపొందించారు.బి–డిజైన్ విద్యార్థుల ప్రాజెక్టు..బి–డిజైన్‌లో నాలుగు సంవత్సరాల కాల వ్యవధి కలిగిన విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులు తమ ప్రాయోగిక పరీక్షల్లో భాగంగా పెళ్లికి సంబంధించిన పలు అంశాలపై లోతైన అధ్యయనం చేసి మార్కెట్‌కు సరికొత్త ప్రాజెక్టును పరిచయం చేస్తున్నారు. లగ్గం పేరిట లాగిన్ అంటూ సరికొత్త మ్యాట్రిమోనీ ప్రాజెక్టు ద్వారా వధువరుల ముందుకు వచ్చేశారు.సంబంధాలను కుదర్చడంతో పాటు, మార్కెట్లో హోదాకు తగ్గట్టు పెళ్లి వేడుకకు రూపకల్పన చేయడం, పెళ్లికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చడం చేస్తున్నారు. ప్రాయోగిక పరీక్షల్లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుని తమ ఉపాధికి కూడా బాటలు వేసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. బి–డిజైన్ కోర్సులో ఫ్యాకల్టీ నేరి్పంచే సాంకేతిక నైపుణ్యాలను పుణికి పుచ్చుకుని కార్పొరేట్ సంస్థలకు తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అక్కడా ఉద్యోగాలు దక్కకుంటే సొంతంగా మ్యాట్రిమోనీ సంస్థను ఏర్పాటు చేసుకుంటామనే స్థాయిలో స్కిల్స్‌ను నేర్చుకుంటున్నారు.తొందరగా ప్లేస్‌మెంట్స్..బి–డిజైన్‌లోని విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరితే తొందరగా ప్లేస్మెంట్ దొరుకుతుందని చేరాను. ప్లేస్మెంట్ లేకున్నా ఉపాధి కల్పనకు ఈ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. మంచి ఫ్యాకలీ్టతో బోధనలు జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని ఒక టాస్్కలాగా తీసుకుని చదువుతున్నాం. కోర్సు పూర్తయితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. – క్యూటీ, మూడో సంవత్సరం విద్యార్థి, సూర్యాపేటప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడమే లక్ష్యం.. విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అభ్యసించేందుకు కామారెడ్డి నుంచి వచ్చాను. తెలుగు వర్శిటీలో మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సు ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవుతాను. ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని ఉంది. లేదంటే మంచి స్టూడియోను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతాను. – శ్రీధర్, మూడో సంవత్సరం విద్యార్థి, కామారెడ్డి -
‘డిజైన్డ్’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!
కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్‌గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్‌గా కొనసాగే వారూ ఉన్నారు.ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్ గేట్ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్‌గేట్ ప్లే రిలేషన్ షిప్ మీటర్’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్ రిలేషన్ షిప్స్‌కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరోశాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్ రిలేషన్ షిప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్ రిలేషన్ షిప్లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్ షిప్లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్..ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు. కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్ సెక్స్‌కి చెందిన క్లోజ్ ఫ్రెండ్‌ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.ఎంపికలో కీలకం ఇవే..భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్‌కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్ షిప్‌లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.బ్రేకప్.. వాట్ నెక్ట్స్?అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్‌గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్‌ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని 33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.తారా పథంలో..ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్ రిలేషన్íÙప్ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్లో బ్రాడ్‌పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్‌దత్‌లతో పాటు కరీనా–సైఫ్ అలీఖాన్ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్‌ని కలర్ఫుల్గా మార్చారు.నగరంలో స్థిరపడిన సంస్కృతి..వుయ్ ఆర్ మ్యారీడ్ అన్నంత సహజంగా వుయ్ ఆర్ ఇన్ రిలేషన్ షిప్ అంటున్నాయి జంటలు. ఆ అనుబంధం పేరే లివిన్. ‘లివింగ్ టు గెదర్’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్ రిలేషన్íÙప్’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న మోసాలు.. గతంలో మహిళా కమిషన్ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్ ఇన్‌కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్ నిలిచింది. లివిన్ చీటింగ్ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.జాగ్రత్తలు తప్పనిసరి..ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్ పవర్ ఆఫ్ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.‘లివిన్’కు కారణాలెన్నో..నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్వేర్.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్‌ను, విజయాలను కోరుకోవడం, కెరీర్‌ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్ షేర్ చేసుకోవడంతో మొదలై ‘లివిన్’గా మారుతోంది.పబ్స్ నుంచి క్లబ్స్ వరకూ ‘స్టాగ్స్ నాట్ అలవ్డ్’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్‌ఫ్రెండ్/గరల్ ఫ్రెండ్ మిన్న అని భావించడం.పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్‌గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా. ఫిర్యాదులు ఇలా..నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 18న ఈవెంట్ ఆర్గనైజర్ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గత ఏప్రిల్ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న లివ్ ఇన్ కపుల్ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్‌గఢ్ కాగా అబ్బాయిది బీహార్ కావడం గమనార్హం.అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్ అనే వ్యాపారితో రిలేషన్ షిప్లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.లివిన్ రిలేషన్ షిప్లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్ పార్ట్నర్ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్ చేశారు.గతేడాది జూలై 23న ఫిలింనగర్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ తన లివిన్ పార్ట్నర్తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..ఏదేమైనా, ఇందులో పార్ట్నర్స్ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ఇవి చదవండి: స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం.. -
ధర్మ జిజ్ఞాస: కలిపురుషుడు.. కల్కి అవతారం!
మనం ఏదైనా పూజాది కార్యక్రమాలలో సంకల్పం చెప్పుకునేప్పుడు కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. అంటే కలియుగం మొదటి నాలుగవ వంతులో అని అర్థం. కలియుగం పైన అధికారం కలిపురుషుడిది. అతడి పెత్తనంలో ఉండే కలియుగ లక్షణాలని కొద్దిగానో, విపులంగానో అన్ని పురాణాలు ప్రస్తావించాయి. ధర్మం ఒక పాదం అంటే నాలుగవ వంతు మాత్రమే ఉంటుంది, మూడు పాళ్ళు అధర్మమే ఉంటుంది. అది మరింత పెచ్చు పెరిగి సజ్జనులు బతక లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీమహావిష్ణువు దుష్టసంహారం చేసి, శిష్టరక్షణ చేయటానికి భూమిపై అవతరిస్తాడు. ఆ అవతారం పేరు కల్కి.శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే సదాచార సంపన్నుడైన నైష్ఠిక బ్రహ్మణుడికి, సుమతికి జన్మించి, పద్మావతి అనే సింహళ రాజకన్యని వివాహమాడి, తెల్లని గుర్రాన్ని అధిరోహించి ఖడ్గం ధరించి దుష్టసంహారం చేస్తాడు. భూ భారాన్ని తగ్గిస్తాడు – ఇదీ పురాణాలన్నింటి క్లుప్తసారాంశం. ఈ అవతారం కలియుగం చివరలో వస్తుంది. త్రేతాయుగం చివరలో రామావతారం, ద్వాపరయుగం చివరలో కృష్ణావతారం వచ్చినట్టు.కల్కి ఎప్పుడు అవతరిస్తాడు? కలి విజృంభించినప్పుడు కల్కి అవతరిస్తాడు, యుగాంతంలో. యుగాంతం అనగానే సృష్టి అంతా జలమయం అయిపోయి ఏమీ లేని స్థితి అని అర్థం కాదు. కలి లక్షణాలు కలవారు, కలిప్రభావితులు సమసిపోతారు. కృతయుగంలో ఉండదగిన వారు మిగిలి ఉంటారు.కలి లక్షణాలు: పరీక్షిత్తు పరిపాలన చేస్తున్న కాలంలో కురు జాంగల దేశాలలో పర్యటిస్తూ ఒంటికాలితో సంచరిస్తున్న వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడు, గోరూపంలో ఉన్న భూమాతల సంభాషణ విన్నాడు. గోమాత కన్నీరు కార్చటానికి కారణం ధర్మదేవుడు అడిగాడు. ‘‘దేహం వ్యాధిగ్రస్తమై, ముఖం వాడిపోయి ఉన్నాయి. బంధువులకి ఆపద కలిగిందా? మూడు కాళ్ళు లేని నన్ను పట్టుకుంటారని బాధపడుతున్నావా?ఇక ముందు లోకమెట్లా ఉంటుందో తలుచుకుని దుఃఖిస్తున్నావా?’’ అని గోవు భయానికి కారణాలని అడుగుతాడు. అవి కలియుగ లక్షణాలు. 1. యజ్ఞాలు లేక దేవతలకి హవిస్సులు అందవు. 2.భర్తలు భార్యలను భరించరు. 3. పిల్లలు తల్లితండ్రులను పోషించరు. 4. సరస్వతి చెడ్డవారిని ఆశ్రయిస్తుంది. 5 ఉత్తమ విప్రులు రాజులకి సేవ చేస్తారు. 6. ఇంద్రుడు వానలు కురిపించడు. 7. దేశంలో న్యాయం నశించి పోతుంది. 8. మానవులు ఆహార నిద్రా భయ మైథునాదుల పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు. 9. నీచులు పరిపాలిస్తూ ఉంటారు."కలి ఉంటే ప్రపంచం ఎట్లా ఉంటుందో గోవు మాటల్లో తెలిసింది. ఈ లక్షణాలు మానవులలో కొద్దిగానైనా ఉంటాయి. అవి కృతయుగంలో నామ మాత్రంగా ఉంటే, త్రేతాయుగంలో సగానికి సగం ఉంటే, ద్వాపరంలో మూడువంతులు ఉంటే, కలియుగంలో క్రమక్రమంగా పెరిగి అవి మాత్రమే ఉండే స్థితికి చేరుకోటం జరుగుతుంది. అప్పుడు కల్కి గుర్ర మెక్కి వచ్చి, కత్తితో దుష్టసంహారం చేస్తాడు. అది ఎప్పుడు? గో వృషభ సంభాషణలో కలియుగం ఎప్పుడు మొదలైనది తెలిసింది కదా! కృష్ణ నిర్యాణంతో. కలియుగం ఆరంభం అయి 5,125 సంవత్సరాలు." ‘‘ఇదంతా కృష్ణుడు శరీరం వదలటం వల్ల జరిగింది. నీవు కూడా ఒక్క కాలితో కుంటుతూ ఉన్నావు. కలిపురుషుడి ప్రేరణతో భయంకర పాపకృత్యాలని చేస్తున్న మానవులని చూస్తే దుఃఖం కలుగుతోంది. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, నానా వర్ణాశ్రమాలకి, గోవులకి బాధ కలుగుతోంది.’’ అని తన బాధకి కారణాన్ని చెప్పింది గోరూపధారి అయిన భూదేవి. ఇది కలి ప్రభావం యొక్క ఫలితం.పరీక్షిత్తు ధర్మదేవుణ్ణి, భూదేవిని సముదాయించి, కలితో కఠినంగా మాట్లాడుతూ కత్తి తీశాడు. భయపడిన కలిపురుషుడు రాజచిహ్నాలని వదలి పరీక్షిత్తు కాళ్ళమీద పడి దయ తలచమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడిని చంపక ధర్మవర్తనులు ఉండే తన రాజ్యం వదలి దూరంగా ΄÷మ్మన్నాడు. కలిపురుషుడు తాను ఎక్కడ ఉండాలో చెప్పమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడు ఉండటానికి నాలుగు ప్రదేశాలని సూచించాడు. అవి జూదం, మద్యపానం,ప్రాణివధ, స్త్రీ (పరస్త్రీ వ్యామోహం) ఉన్న చోట్లు. అవి చాలవు మరికొన్ని కావాలని అడిగాడు. బంగారం అనే ఐదో చోటు కూడా కలికి ఇచ్చాడు. బంగారంతో వచ్చే అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే మరొక ఐదు స్థానాలు కలి నివాసాలు అయ్యాయి.ఇప్పుడే ఇట్లా ఉంటే, చివరి నాలుగోవంతు సమయంలో ఎట్లా ఉంటుందో? అని భయం అక్కర లేదు. ధర్మమార్గంలో చరించే వారి దగ్గరకు కలిపురుషుడు రాడు. అధర్మమార్గంలో ఉండేవారిని చక్కజేసి, ప్రేరేపించే వారిని మట్టుపెట్టటానికి కల్కి రానే వస్తాడు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
మా అమ్మమ్మ వాళ్ల ఊరు పాత మెదకర్ జిల్లా ఒక చిన్న పల్లెటూరు. ఏ సెలవులు అయినా అప్పటి తరం గడిపింది అమ్మమ్ల ఊర్లలోనే కదా!. సిద్ధిపేటలో పెరిగిన నాకు కులాల గురించి అస్సలు తెలియదు. 70 వదశకంలో అదొక పెద్ద మార్పు అని తెలియు. రోజంతా ఊర్లోని మట్టి రోడ్లమీద పొలాల గట్ల మీద ఈత బావుల్లో గడిచిపోయేది. మాదిగోళ్ల ఇళ్లు, వడ్లోళ్ల సందు, కమ్మరోళ్ల గల్లీ..ఏ తేడా తెలియకుండా ఆడుకునేది. పశువుల మందలు కొట్లాలకి చేరుకునే సందెపొద్దుకి ఇంటికి మా అడుగులు తడపడేవి. అప్పటి వరకు లేని పట్టింపులు ఇంటి వరండాకి చేరుకునేసరికి అమ్మమ్మకు గుర్తుకొచ్చేది. ఒక బిందె నీళ్లు మా నెత్తిమీద కుమ్మరించి పొడిబట్టలు ఇచ్చేది. అలా మైల పోతుందని ఆమె అనుకునేది. మాకు ఆమె నమ్మకం వింతగా చిరాకుగా కూడా ఉండేది. అప్పట్లో అది సామాజికి మనిషి అని. ఆర్థిక అంతరాలుకు ఒక కొలమానం అని పెత్తందారుల పోకడలకు నిలువటద్దం అని తెలియదు. కానీ చాలా అసహనంగా ఉండేది మనసులో. అదొక్కటే అమ్మమ్మ వాళ్ల ఊర్లో ఉన్నన్ని రోజుల్లో గొంతులో ఏదో అడ్డపడ్డట్టుగా ఉండేది. దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత కూడా గొంతులో ఏదో అడ్డంపడుతున్నట్లుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన, జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తున్నప్పుడు ఓట్ల కోసం కావచ్చు అధికారం చేజారిపోకూడదన్న రాజకీయతత్వం కావచ్చు. మరేదైనా కారణం కావచ్చు. బడులు కొత్తరూపును సింగారించుకున్నాయి. పిల్లలు నోట్లోంచి నాలుగు ఇంగ్లీషు ముక్కలు రాలుతున్నాయి. చాలిచాలని విదిలించనట్లుండే స్కూలు యూనిఫాంలు అద్దంలో అందంగా కనపడుతున్నాయి. క్లాస్‌రూంలోకి అంతర్జాతీయ స్థాయి విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఆత్మనూన్యతను ఆత్మవిశ్వాసం తరిమేస్తోంది. పదిసంవత్సరాల్లో ఒక్క కొత్తతరం మరింత ధైర్యంగా, రొమ్ము విరుచుకుని తలెత్తుకుని నిలబడబోతుంది.వంగిన నడుములు నిటారుగా నిలబడబోతున్నాయి. నేలచూపులు ప్రశ్నించేందుకు సూటిగా చూస్తున్నాయి. నేల బారు చదువులు వానాకాలపు పాఠాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక కొత్తతరం ఉరకలు వేసేందుకు ప్రశ్నించేందుకు తమ బతుకులు దిద్దుకునేందుకు ఆర్థిక బలవంతుల్ని తమ చదువులతో ఢీ కొట్టేందుకు అడుగులు వేయడం నేర్చుకుంటోంది. నాలుగు సంస్కృతం ముక్కలు నేర్చుకున్నందుకు నాలుక మీద వాతలు పెట్టించుకున తరం నుంచి కొండల మీద కూర్చొని వికటాట్టహాసం చేస్తున్న వర్గాల అహం మీద గట్టి దెబ్బ తగులుతోంది. దీన్ని అడ్డుకోవడానికి అహంకార వర్గాలు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా చేసినా, చేస్తున్న ప్రయత్నాలు వాళ్ల పీఠాలు కదలిపోతాయోమో అన్న భయం స్పష్టంగా కనపడుతోంది. అభద్రతాభావంతో కుట్రలు కుతంత్రాలకి తెరలేపారు. ఇంగ్లీషు చదువులు మీకెందుకురా..! అంటూ బహిరంగంగానే కూశారు. తెలుగు భాష చచ్చిపోతుందనే దొంగ ఏడుపులు..మాతృభాషకు వీరే బాధ్యులయినట్టు సమస్య భాష కాదు..సమస్య అసమానతలు తొలిగిపోతే..రేప్పొద్దున తమకు ఊడిగం చేసే వర్గాలు లేకపోతే ..అన్ని పనులు తామే చేసుకోవాల్సి వస్తే..ఇప్పటిదాక బాంచన్ దొర అన్న మాటలు వినపడకపోతే.. తమకన్నా ఉన్నత స్థానాల్లో నిలబడితే..తామే తలలు పైకెత్తి చూడాల్సి వస్తే అహంకారంతో విసురుగా ఆడిన చేతులు జోడించాల్సి వస్తే..ఇది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలకి మింగుడు పడని విషగుళిక. అందుకే అన్ని శక్తులు ఏకమై ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న మొగ్గల్ని..సూటిగా చూస్తున్న కళ్లని నిటారుగా నిలబడుతున్న నడుముల్ని అణచడానికి చేయని ప్రయత్నాలు లేవు. అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు ఇది కాదు అని పలికి గొంతు తొక్కాలనుకుంటుంది రాజకీయ ప్రత్యర్థులను కాదు..తమకు తరతరాలుగా వంగి వంగి దండాలు పెట్టి..ఇపుడిపుడే వస్తున్న కొత్తతరాన్ని..ఇందులో ఎవరైనా పుట్టాలనుకుంటారా..ఇంగ్లీషు చదివితే ఎటుకాకుండా పోతారని భయపెట్టి..తమ కదలిపోతున్న పునాదుల్ని మళ్లీ నిలబెట్టుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతోనే.పెట్టుబడిదారులు ఖద్దరు చొక్కా వేసుకొని ముందుకు వస్తే..ఆర్థిక, సామాజికి కారణాలు బయటకు కనిపిస్తూనే ఉంటాయి. కాశ్మీరో, కన్యాకుమారో అవసరం లేని వర్గం తమ కాళ్లమీద తాము నిలబడటానికి 75 ఏళ్ల తర్వాత ఒక ఊతం దొరికింది. పాదాలు నరికేస్తామని భయపడితే ఒక తరం తర్వాతితరాలు నష్టపోతాయి. చనిపోయేవరకు మా అమ్మమ్మలో మార్పు రాలేదు. కులం నరాల్లో ఇంకిపోయిన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల జాత్యాహంకార వర్గాల్లో కూడా మార్పు రాలేదు..రాదుకూడా నిలబటం నేర్చుకుంటున్న ఈ తరం తమ కోసమే కాదు..ముందు తరాల కోసం నడవటం, పరుగెత్తి గెలవడం కూడా నేర్చుకోవాలి. కుట్రలు ఉంటాయి. అడ్డంకులు ఉంటాయి. పడిపోతే లేచి నిలబడాలి..లేకపోతే పాక్కుంటూ అయిన గీత దాటాలిసిరా..(చదవండి: గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్) -
మనల్నీ మోసుకెళ్తుంది!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీని ఇస్రో చేపట్టింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్జీఎల్వీ రాకెట్‌లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్‌ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్జీఎల్వీ రాకెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు.. ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► రాకెట్ వెడల్పు 5 మీటర్లు ► దశల్లోనే రాకెట్ ప్రయోగం ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. షార్‌లో మూడో లాంచ్‌ప్యాడ్ షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది. -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్‌ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్‌ఫామ్‌లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్‌ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్‌ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్‌ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..! -
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
పెట్టుబడుల నిర్వహణకు సామ్కో సీఆర్పీ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ సామ్కో కొత్త తరం క్యాపిటల్ రిసోర్స్ ప్లానింగ్ (సీఆర్పీ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులను అందుకునేలా ఇన్వెస్టర్లు సులువుగా తమ పెట్టుబడులను నిర్వహించుకునేందుకు, ట్రేడింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. ఇటు తమ పెట్టుబడులపై రాబడులను, అటు ప్రామాణిక సూచీలపై రాబడులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునేలా స్వంతంగా ఒక వ్యక్తిగత సూచీని ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇందులో సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. మరోవైపు, 67 శాతం మంది ఇన్వెస్టర్లు .. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులు అందుకోలేకపోతున్నారని తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో సూచీలను మించి రాబడులను అందుకునే ధోరణులను పెంపొందించేందుకు ’మిషన్ – ఏస్ ది ఇండెక్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. -
యూత్ ఎంట్రీ.. ఎవరికి ఎగ్జిట్?.. అసలు ఏం జరుగుతోంది?
రంగారెడ్డి జిల్లాలో కొత్త తరం నాయకులు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మంత్రులు తమ తనయులను బరిలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారా? ఎమ్మెల్యేలు తప్పుకుని వారసులకు ఛాన్స్ ఇస్తారా ? గులాబీ పార్టీతో పాటు.. కమలం పార్టీ కూడా వారసుల్ని బరిలో దించబోతోందా? అసలు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మూడు ముక్కలు.. ఆరు వక్కలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలుగా విడగొట్టారు. పాలమూరు జిల్లా నుంచి షాద్ నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు.. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను రంగారెడ్డిలో కలిపేశారు. కోడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డి కూడా కేసీఆర్ క్యాబినెట్ లో స్థానం పొందారు. ఈ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో తనయులను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి 2014లోనే చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్తీక్ రెడ్డి .. అధిష్టానం తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి తన ఇద్దరు తనయులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇద్దరిలో ఒక్కరికైనా ఏదో ఒకచోట ఛాన్స్ ఇస్తారని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. లైన్లో మా వాడున్నాడు ఇక అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం..తమ తనయులకు రూట్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి... ఇప్పటికే కొడుకు ప్రశాంత్ రెడ్డితో నియోజకవర్గమంతా పాదయాత్ర చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అని క్యాడర్ కు క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు.. తన తనయుడు రోహిత్ రావు ను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు రోహిత్ రావు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. తన తనయుడు రవి యాదవ్ కు వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. అయితే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి... షాబాద్ జడ్పీటీసీగా ఉన్న తన సోదరుడి కుమారుడు పట్నం అవినాశ్ రెడ్డిని షాద్ నగర్ లో పోటీ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందరిది అదే దారి ఇక బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసులకే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మహేశ్వరం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని షాద్ నగర్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు రవి యాదవ్.. ఈ సారి టికెట్ దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారసుల్ని బరిలో దించగల పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీలు ఎవరెవరి వారసులకు ఛాన్స్ ఇస్తాయో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: దేశీయ కార్‌మేకర్ మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్ మోడల్లో కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది. కొత్త డిజైన్, అప్డేట్స్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌తో 2023 జనవరి నాటికి కొత్త తరం సుజుకి స్విఫ్ట్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. అంతేకాదు 2023లో జరగనున్న ఆటోఎక్స్పోలో దీన్ని ప్రదర్శించవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. రానున్నమారుతి స్విఫ్ట్ 2023లో గణనీయమైన కాస్మెటిక్ మార్పులు , ఫీచర్ అప్గ్రేడ్లు చేసే అవకాశం ఉందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ద్వైవార్షిక ఆటోమోటివ్ ఈవెంట్ జనవరి 13 నుండి ప్రారంభం కానుంది. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త సీ-ఎయిర్ స్ప్లిటర్లతో అప్డేట్ చేసిన బంపర్, కొత్త LED ఎలిమెంట్స్‌తో కూడిన స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు , ఫ్రంట్ ఎండ్‌లో.. కొత్త ఫాగ్ ల్యాంప్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త బాడీ ప్యానెల్స్, వీల్ ఆర్చ్‌లపై ఫాక్స్ ఎయిర్ వెంట్లు, బ్లాక్ అవుట్ పిల్లర్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో రివైజ్ చేసినట్టు సమాచారం. దాదాపు కొత్త బాలెనో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే, హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో డిజైన్ చేసిందట. ఇంకా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ,లెదర్ సీట్లుతొపాటు ఆపిల్ కార్ప్లే ,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి వాయిస్ అసిస్ట్ , OTA (ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లు)తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (కొత్త స్మార్ట్‌ప్లే ప్రో+) ఉండవచ్చు. దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్-కీప్ అసిస్ట్ ,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఇతర ఇంటీరియర్ అప్డేట్స్ను అందించనుంది. ఇక ఇంజీన్ విషయానికి వస్తే..1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో ఉండవచ్చు. దీంతో పాటు యూరప్‌తో సహా ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్న 1.4 లీటర్ల బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజీన్‌తో, కొత్త తరం సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌ను కూడా ఇండియాలో ఆ విష్కరించనుందని అంచనా. అయితే కొత్త స్విఫ్ట్ అరంగేట్రంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. -
ఆల్టో K10 లవర్స్‌కు గుడ్ న్యూస్! రూ. 11 వేలతో...
సాక్షి,ముంబై: మారుతి సుజుకి సరికొత్త ఆల్టో కె10 కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త ఆల్టో K10 బుకింగ్‌లను మారుతి సుజుకి బుధవారం ప్రారంభించింది. మారుతి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ తాజా వెర్షన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్న కొత్త ఆల్టో కె-10 కస్టమర్లను ఆకట్టుకోనుంది. రూ. 11 వేలు చెల్లించి ఆల్టో కె10ని ప్రీ-బుక్ చేయవచ్చు. మారుతి అరేనా షోరూంలో, లేదా ఆన్లైన్లో గానీ ఈ కారును బుక్ చేసుకోవచ్చు. (సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?) మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 4.32 మిలియన్లకు పైగా కస్టమర్లతో, ఆల్టో దేశంలో అత్యంత ప్రభావవంతమైన కార్ బ్రాండ్‌గా ఉందని చెప్పారు.. ఆల్టో కుటుంబాలు విపరీతంగా ఇష్టపడే, లెజెండరీ ఆల్టో యువ భారతదేశం ఆకాంక్షలతో అభివృద్ధి చెందిన దిగ్గజ బ్రాండ్‌కు నిదర్శనం. 22 సంవత్సరాల బలమైన బ్రాండ్ వారసత్వంతో, ఆల్టో గౌరవానికి విశ్వసనీయతకు చిహ్నం మాత్రమేకాదు తమకు చాలా విజయ వంతమైన బ్రాండ్ అన్నారు. దేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పునర్నిర్వచించేలా, కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా కొత్త ఆల్-న్యూ ఆల్టో K10 తీర్చి దిద్దామని మారుతి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ అన్నారు. ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్, సాంకేతికతతో నడిచే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. (వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!) ఫీచర్లు, ధరపై అంచనాలు ఆల్టో K10 సరికొత్త డిజైన్, ప్లాట్‌ఫారమ్, ఇంటీరియర్ లేఅవుట్, ఫీచర్ లిస్ట్‌తో రానుంది. కార్ టెక్ కనెక్ట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మెరుగైన పనితీరు కోసం హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌తో రానుంది. 1,000 cc పెట్రోల్ ఇంజీన్‌తో రానుందని భావిస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ఎస్-ప్రెస్సో ధర రూ. 4.25 లక్షల కంటే తక్కవనేగా ఉండనుందని అంచనా. కొత్త ఆల్టో కె10 ఆగస్టు 18 న అధికారికంగా లాంచ్ కానుంది. ఇదికూడా చదవండి : జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్ -
TRS: కొత్త రూట్లో ‘కారు’
టీఆర్ఎస్ ప్రస్తుతం 60 లక్షల మందికి పైగా సభ్యులతో అన్ని స్థాయిల్లో పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితిని అనువుగా మార్చుకుని, పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రక్రియను కేసీఆర్ చాప కింద నీరులా కొనసాగిస్తున్నారని నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పాతతరం నేతల స్థానంలో కొత్తవారు, యువతకు అవకాశాలు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిపాయి. అధికారంలో ఉండటం ద్వారా తలెత్తే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం.. కొత్త రాజకీయ శక్తులు, విపక్షాల దూకుడుకు కళ్లెం వేయడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్ను తున్నారని.. అందులో భాగంగానే కొత్తవారు, యువతపై దృష్టిపెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీలో ఉన్న యువతే భవిష్యత్తు నిర్మాతలు. నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా నాయకులు ఎక్కడి నుంచో రారు. ఇక్కడి నుంచే పుట్టుకొస్తారు. కొత్త నాయకత్వంతో మరింత వేగంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ముందటి నాగలి తర్వాత వెనుక నాగలి వచ్చినట్టు లైన్లో ఉన్న వారికి ఆటోమేటిగ్గా అవకాశాలు వస్తాయి..’’ హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలివి. పార్టీలో, పదవుల్లో యువతకు, కొత్తవారికి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగు తున్నట్టు ఆయన ఇచ్చిన సంకేతాలివి. సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతకాలంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ రెండోసారి గెలిచాక కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఆయన.. మెల్లగా యువతకు ప్రాధాన్యంపై దృష్టిపెట్టారు. కొత్తవారికి చాన్స్‌లు ఇస్తున్నారు. ఎవరి సామర్థ్యం ఏమిటో చూస్తూ.. వాస్తవానికి రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ రాజకీయ పునరేకీకరణపైనే కేసీఆర్ ఎక్కువగా దృష్టిపెట్టారని.. ప్రస్తుతం టీఆర్ఎస్లోకి వలసలు దాదాపు క్లై్లమాక్స్‌కు చేరాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీకి దీర్ఘకాలంగా సేవచేస్తున్నవారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, యువ నాయకుల పనితీరును అంచనా వేసే పనిని కేసీఆర్ మొదలుపెట్టారని చెప్తున్నాయి. అవకాశమున్న ప్రతీచోటా సామాజిక సమీకరణాలు చూసుకుంటూ కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటున్నాయి. పాత, కొత్త అనే తేడా లేకుండా.. యువ నాయకుల పనితీరు, వారి బలాలు, బలహీనతలను మదింపు చేసి, పార్టీ అవసరాల ఆధారంగా పదవులకు ఎంపిక చేయడమనే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి. దీనికి రాబోయే రోజుల్లో మరింత పదును పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి వారసుల ఎంట్రీ! ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. అందులో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు తొలిసారి, రెండోసారి గెలిచినవారే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో 25 మంది వరకు కొత్తతరం నాయకులు టీఆర్ఎస్ ద్వారా రాజకీయం అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని... కొందరు సీనియర్ నేతలు తమ వారసులను తెరమీదకు తేనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు నేతల వారసులు ఇప్పటికే యువసేనలు, ట్రస్ట్‌లు, సేవా కార్యక్రమాల పేరిట నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోచారం భాస్కర్‌రెడ్డి, జోగు ప్రేమేందర్, బాజిరెడ్డి జగన్, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, కోనేరు వంశీకృష్ణ, నడిపెల్లి విజిత్‌రావు, కడియం కావ్య, డీఎస్ రవిచంద్ర, అజ్మీరా ప్రహ్లాద్, బస్వరాజు శ్రీమాన్, పుట్ట శైలజ, వనమా రాఘవ, చిట్టెం సుచరిత, మైనంపల్లి రోహిత్, ఏ.సందీప్‌రెడ్డి వంటివారు చురుగ్గా ఉన్నారు. కొందరు ఇప్పటికే జిల్లాస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో కొందరికైనా భవిష్యత్తులో అవకాశం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ వారసత్వం లేని కొత్తతరం నాయకులు ముందుకు వస్తున్నారు. అన్నివర్గాల వారికి అవకాశం దిశగా.. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న టీఆర్ఎస్లో కొత్తవారికి, పలుకుబడి కలిగిన వారు, ఉద్యమంలో పనిచేసినవారు, ప్రముఖులు, రాజకీయ వారసత్వం కలిగిన వారు తదితర కేటగిరీల్లో అవకాశాలు వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవికి కేసీఆర్ అవకాశం కల్పించారు. తాజాగా గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయగా, ఇంతకుముందు ఇదే కోటాలో కవి, గాయకుడు గోరటి వెంకన్న, సామాజిక సేవా రంగానికి చెందిన భోగారపు దయానంద్‌కు అవకాశం లభించింది. ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్‌ను నామినేట్ చేశారు. ప్రభుత్వ విప్‌లుగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, గొంగిడి సునీత వంటి కొత్తతరం నేతలకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ కమిటీల్లోనూ కొత్తవారికే చోటు కల్పించారు. యాదవ, పద్మశాలి, రజక, విశ్వ బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అవకాశాల వేటలో విద్యార్థి నేతలు ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన కొందరు విద్యార్థి నేతలు టీఆర్ఎస్ ద్వారా రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాల్క సుమన్, గ్యాదరి కిశోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, పిడమర్తి రవి, రాకేశ్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్ వంటి వారికి వివిధ రూపాల్లో రాజకీయ అవకాశాలు లభించాయి. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజారామ్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి వంటి ఉద్యమ నేపథ్యమున్న విద్యార్థి నేతలు.. పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికైనా తమకు రాజకీయ అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్నారు. -
డాబర్ ఇండియాకు కొత్త చైర్మన్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియ చైర్మన్‌గా అమిత్ బర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఆనంద్ బర్మన్ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ కొత్త నియామకం జరిగింది. మరో వారసుడు మోహిత్ బర్మన్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో రూ. 8500 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని కలిగిన దేశంలోని పురాతన వినియోగ వస్తువుల కంపెనీ పగ్గాలు తరువాతి తరం చేతుల్లోకి మారాయి. మరోవైపు సీఈవో పదవినుంచి తప్పుకున్న సునీల్ దుగ్గల్ శుక్రవారం బోర్డునకు కూడా రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో మోహిత్ మల్హోత్రాను సీఈవోగా నియమించింది వ్యవస్థాపక బర్మన్ కుటుంబంనుంచి ఐదవతరం సభ్యుడైన అమిత్ బర్మన్(50) డాబర్‌లో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈయన కంపెనీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. డాబర్ ఫుడ్స్ పేరుతో సంస్థను స్థాపించిన అమిత్ 12 ఏళ్ల తరువాత దీన్ని మాతృసంస్థ డాబర్ ఇండియలో విలీనం చేశారు. వైస్ ఛైర్మన్‌గా నియమితులైన మోహిత్ ప్రస్తుతంఎలిఫెంట్ క్యాపిటల్(లండన్ స్టాక్ఎక్స్ఛేంజ్-లిస్టెడ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, జీవిత బీమా, సాధారణ భీమా, ఎసెట్ మేనేజ్మెంట్, రిటైల్ స్పోర్ట్స్ సహా డాబర్ ఫ్యామిలీకి చెందిన పెట్టుబడులకు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అవివా లైఫ్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ సైమన్ జనరల్ ఇన్సూరెన్స్, ఐపీఎల్ టీం కింగ్స్ఎలెవన్ పంజాబ్ తదితరాలున్నాయి. అలాగే ఆనంద్బర్మన్ కుమారుడు ఆదిత్య డాబర్ ఇండియాలో నాన్-ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్‌గా కంపెనీలో చేరనున్నారు. కాగా సహజ ఉత్పత్తుల విక్రయం పేరుతో 1884లో డా.ఎస్.కె. బర్మన్ డాబర్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం వాటికా షాంపూ, ఫెమ్ స్కిన్‌కేర్, రెడ్ టూత్ పేస్టు, ఓడోనిల్ ఎయిర్ ఫ్రెషనర్స్, రియల్ జ్యూస్, హోం మేడ్ కుకింగ్ పేస్టులతో సహా అనేక ప్యాకేజీ బ్రాండ్లను విక్రయిస్తున్నసంగతి తెలిసిందే. -
వారసులొస్తున్నారు...
ఎన్నికల పోటీలో కొత్త తరం రేసులో అనేకమంది సాక్షి, తిరుపతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువరక్తం తహతహలాడుతోంది. రేసులో ఉన్నవారిలో ఎక్కువమంది మాజీ మంత్రుల సంతానం కావడం గమనార్హం. ఇద్దరు యువకులు లోక్‌సభలో అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మిగిలినవారు శాసనసభ నుంచి రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గల్లా అరుణకుమారి, రెడ్డివారి చెంగారెడ్డి, గుమ్మడి కుతూహలమ్మ, గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు తదితరుల పిల్లలు ఇప్పటికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజంపేట, గుంటూరు లోక్‌సభ స్థానాల నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గల్లా జయదేవ్ వేర్వేరు రాజకీయపార్టీల నుంచి పోటీ చేయనున్నారు. మిగిలిన వారు వివిధ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు రాజకీయపార్టీల నుంచి టికెట్లు కోరుతున్నారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడి మిథున్‌రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. విద్యాధికుడైన మిథున్‌రెడ్డి ఇప్పటివరకు రాజకీయాల్లో తండ్రి విజయాలకు తెరవెనక పాత్ర పోషిస్తున్నారు. ఈ యువనేత ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రంలోనే లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. గల్లా జయదేవ్ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్. తెలుగుదేశం పార్టీ తర ఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి టికెట్టు ఖాయం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తల్లి గల్లా అరుణకుమారి రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులు. జయదేవ్ కుటుంబం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతోంది. రెడ్డివారి ఇందిర ప్రియదర్శిని మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి కుమార్తె ఇందిరప్రియదర్శిని కొన్ని సంవత్సరాలుగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. కిందటిసారి నగరి నుంచి కాంగ్రెస్ టికెట్టు ఆశించిన ప్పటికీ అధిష్టానం అంగీకరించకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్టు ఆశిస్తున్నారు. ఒకవేళ అవకాశం రాకపోతే స్వతంత్రంగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. గాలి జగదీష్ మాజీ మంత్రి, నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్. వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే అవసరమైన సమయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం చంద్రగిరి, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి టీడీపీ టికెట్టు ఆశిస్తున్నారు. అనగంటి హరికృష్ణ మాజీ మంత్రి, గంగాధరనెల్లూరు శాసనసభ్యులు గుమ్మడి కుతూహల మ్మ కుమారుడు అనగంటి హరికృష్ణ. విద్యాధికుడైన ఈయనను కింద టి ఏడాది తన రాజకీయ వారసుడుగా కుతూహలమ్మ పరిచయం చేశా రు. తెలుగుదేశం పార్టీ నుంచి గంగాధరనెల్లూరు టికెట్టు ఆశిస్తున్నారు. నారా గిరీష్ చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తినాయుడు కుమారుడు నారా గిరీష్. ప్రస్తుతం చంద్రగిరి టీడీపీ టికెట్టు ఆశిస్తున్నారు.