సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్‌జీ మోడల్‌న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్‌జీ ద్వారా తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది. సీఎన్‌జీ వర్షెన్ ధర రూ. రూ.5,94,500 ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. వీఎక్స్‌ఐ అనే ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 సీఎన్‌జీ అందుబాటులోకి ఇచ్చింది. ఇటీవల తమ మోడల్స్‌లో మరిన్ని సీఎన్‌జీ వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఎస్- సీఎన్‌జీ వాహనాలను విక్రయించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
ఆల్టో కే10 సీఎన్‌జీ ఇంజీన్
డ్యూయల్ జెట్ , డ్యూయల్ VVTతో 1.0లీటర్ ఇంజీన్ అందిస్తోంది.5300 RPM వద్ద 56 hp ,3400 RPM వద్ద 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేసింది. ఆల్టో కే10 సీఎన్‌జీ 33.85కి.మీ/కేజీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
డిజైన్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా థర్డ్-జెన్ ఆల్టో కే 10 మాదిరి డిజైన్‌ను కలిగి ఉంది. అయితే కొత్త పవర్ ట్రెయిన్‌కు అనుగుణంగా రైడ్ నాణ్యత, సౌకర్యం, భద్రతకు అనుగుణంగా క్యాలిబ్రేట్ చేసిందని పేర్కొంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ ఫిల్టర్స్ హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్‌తోపాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన SmartPlay డాక్, ఫ్యూయల్ అలర్ట్, డోర్ అజార్ వార్నింగ్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
మొత్తం పోర్ట్‌ఫోలియోలో 13 ఎస్- సీఎన్‌సీ మోడళ్లను కలిగి ఉంది. వీటిలో ఆల్టో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్‌ఎల్6, సూపర్ క్యారీ,టూర్ ఎస్ ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ క్విడ్‌కి గట్టిగా పోటీ ఇచ్చిన ఆల్టో కే10 సీఎన్‌జీ వెర్షన్ మరింత పోటీగా నిలవనుంది.రెనాల్ట్ క్విడ్‌లో ఇంకా సీఎన్‌జీ వేరియంట్ రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment