Special Discounts Upto Rs 50000 On Maruti Suzuki Models Alto, Swift, Wagon R In August 2023 - Sakshi
Sakshi News home page

Maruti Suzuki Discounts: కారు కొనాలనుకుంటున్నారా? మారుతి కార్లపై భారీ డిస్కౌంట్‌ 

Published Sat, Aug 5 2023 4:18 PM | Last Updated on Sat, Aug 5 2023 5:42 PM

August 2023 Maruti Suzuki discounts check details - Sakshi

ఆటో దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆగస్ట్​ నెలకు సంబంధించి కార్ల   కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్‌ అందిస్తోంది. దాదాపు రూ. 57 వేల తగ్గింపు దాకా అందిస్తోంది. ఇందులో క్యాష్​ డిస్కౌంట్, ఎక్స్​ఛేంజ్​ బోనస్ తదితరాలు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఈ డిస్కౌంట్‌ ధరలు అందుబాటులో ఉంటాయి

మారుతి సుజుకి పై రూ. 57 వేల దాకా డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది.  వేరియంట్ల ఆధారంగా కస్టమర్లు ఈ తగ్గింపును పొందవచ్చు. ఆల్టో కే10పై రూ. 57 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ)

మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో 56,000 వరకు తగ్గింపు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెట్రోల్,  CNG-ఆధారిత మారుతి సుజుకి S ప్రెస్సో  అన్ని వేరియంట్‌లు రూ. 56,000 వరకు మొత్తం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన వేరియంట్‌లు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు)

మారుతీ సుజుకీ ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌, వ్యాగన్‌ ఆర్‌ మోడల్స్‌పై క్యాష్​ డిస్కౌంట్, ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్ లభిస్తుంది. వేరియంట్లు, డీలర్‌షిప్‌ ఏజెన్సీల ఆధారంగా ఈ తగ్గింపు  అందుబాటులో ఉంటుంది. 

కాగా మారుతి సుజుకి ఈ ఏడాది క్యూ1లో మెరుగైన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్‌తోముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 145శాతం పుంజుకుని  రూ. 2,485 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 45  లక్షల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్‌ సెల్లింగ్‌ కారుగా నిలిచిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement