Baleno
-
కారు కొనాలనుకుంటున్నారా? మారుతి కార్లపై భారీ డిస్కౌంట్
ఆటో దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్ట్ నెలకు సంబంధించి కార్ల కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దాదాపు రూ. 57 వేల తగ్గింపు దాకా అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి మారుతి సుజుకి పై రూ. 57 వేల దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వేరియంట్ల ఆధారంగా కస్టమర్లు ఈ తగ్గింపును పొందవచ్చు. ఆల్టో కే10పై రూ. 57 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో 56,000 వరకు తగ్గింపు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెట్రోల్, CNG-ఆధారిత మారుతి సుజుకి S ప్రెస్సో అన్ని వేరియంట్లు రూ. 56,000 వరకు మొత్తం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన వేరియంట్లు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు) మారుతీ సుజుకీ ఇగ్నిస్, బాలెనో, డిజైర్, వ్యాగన్ ఆర్ మోడల్స్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. వేరియంట్లు, డీలర్షిప్ ఏజెన్సీల ఆధారంగా ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. కాగా మారుతి సుజుకి ఈ ఏడాది క్యూ1లో మెరుగైన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్తోముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 145శాతం పుంజుకుని రూ. 2,485 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 45 లక్షల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
దుమ్మురేపిన బాలెనొ.. అమ్మకాల్లో మారుతి సుజుకి కొత్త రికార్డ్
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' గత నెలలో (2023 ఫిబ్రవరి) మంచి అమ్మకాలను పొందింది. అమ్మకాల పరంగా కంపెనీ 2022 ఫిబ్రవరి కంటే కూడా 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మారుతి సుజుకి అమ్మకాల్లో బాలెనొ 18,592 యూనిట్లను విక్రయించి మునుపటి ఏడాది ఇదే నెలకంటే 47.91 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరిలో దీని అమ్మకాలు 12,570 యూనిట్లు. తరువాత వరుసలో 18,114 యూనిట్ల అమ్మకాలతో స్విఫ్ట్ నిలిచింది. అయితే స్విఫ్ట్ అమ్మకాలు మునుపటి సంవత్సరం కంటే 4.11 శాతం తగ్గాయి. 56.82 శాతం పెరుగుదలతో మారుతి ఆల్టో మూడవ స్థానంలో నిలిచింది. ఆల్టో అమ్మకాలు గత నెలలో 18,114 యూనిట్లు. వ్యాగన్-ఆర్ అమ్మకాలు 16,889 యూనిట్లు కాగా, డిజైర్ సేల్స్ 16,798 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. డిజైర్ అమ్మకాలు 2022లో 3.67 శాతం తగ్గాయి. (ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!) బ్రెజ్జా, ఈకో అమ్మకాలు వరుసగా 15,787 & 11,352 యూనిట్లు. ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలైన గ్రాండ్ విటారా ఏకంగా 9,183 యూనిట్ల అమ్మకాలతో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఎర్టిగా, ఇగ్నిస్ రెండూ 6472 యూనిట్లు, 4749 యూనిట్లను విక్రయించి తొమ్మిది, పదవ స్థానాల్లో నిలిచాయి. -
ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్ ఏదో తెలుసా?
సాక్షి, ముంబై: మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరి 2023 నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్ కొట్టేసింది. గత ఏడాది ఇదే కాలంలో 12,570 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో వార్షిక ప్రాతిపదికన పాజిటివ్ వాల్యూమ్ 48 శాతం పెరిగింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో మోడల్స్‌ను అధిగమించి మరి బాలెనో ఈ పాపులారిటీ సాధించింది. ఈ రెండు మోడల్స్ కార్లు ఒక్కొక్కటి 18,000 యూనిట్లకు పైగా సేల్ అయ్యాయి. అలాగే గత నెలలో ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ i20 , టాటా ఆల్ట్రోజ్లను వెనక్కి నెట్టేసింది బాలెనో. అప్డేటెడ్గా వచ్చిన బాలెనో మోడల్ రాక గేమ్ ఛేంజర్‌గా మారిందని. ప్రస్తుతం,మారుతి సుజుకి బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం నాలుగు వేరియంట్లలో,ఆరు రంగల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 6.56 లక్షలు- రూ. 9.83లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మారుతి సుజుకి బాలెనో ఇంజీన్ బాలెనోలోని 1.2-లీటర్ 4-సిలిండర్ DualJet VVT పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద గరిష్టంగా 90 PS పవర్ అవుట్‌పుట్ , 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 37 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం , 339 లీటర్ల బూట్స్పేస్ని కలిగిఉంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో కూడి ఉంది. HUD, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ AC వెంట్స్, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, ఫాగ్ ల్యాంప్స్, UV కట్ గ్లాస్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 83 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
మారుతీ కార్లపై అదిరిపోయే ఆఫర్స్!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్ జోష్‌ను కొనసాగించి, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్‌లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్, వ్యాగన్-ఆర్ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఆల్టో కే10: పాపులర్ మోడల్ ఆల్టో కే10పై అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. మారుతీ సుజుకి సియాజ్: మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. సెలేరియో: సెలేరియో బేసిక్ మేన్యువల్ వేరియంట్, సీఎన్జీ వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్, జెడ్ ప్లస్ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్సైట్లో గానీ చూడవచ్చు. -
అదిరే లుక్.. సీఎన్జీలో బాలీనో, ఎక్స్ఎల్6 కార్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్జీ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వేరియంట్లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1.23 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. బలీనో, ఎక్స్ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
2022లో ఇప్పటివరకూ టాప్ సెల్లింగ్ కార్లు ఇవే!
సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్‌లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది. సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి.. -
సరికొత్త హంగులతో మారుతి సుజుకి బాలెనో...!
2022 Maruti Baleno Facelift: భారతీయ మార్కెట్లో త్వరలోనే కొత్త 2022 మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (2022 Maruti Baleno Facelift) విడుదల కానుంది. ఈ కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కి సంబంధించిన చాలా విషయాలను కంపెనీ ఇదివరకే చాలా టీజర్ వీడియోల ద్వారా పంచుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ కారుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. డిజైన్‌లో సరికొత్త హంగులతో... 2022 మారుతి సుజుకి బాలెనో ప్రొఫైల్ ప్రస్తుత మోడల్‌కు కొంతవరకు సమానంగా ఉంటుంది. ఇది కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను పొందుతుంది. విండో లైన్ వెంట క్రోమ్ తో రానుంది. , ఇది వెనుక క్వార్టర్ గ్లాస్ వరకు విస్తరించి ఉంది. డోర్ హ్యాండిల్స్‌పై కూడా క్రోమ్ లుక్స్ కనిపిస్తుంది. బాలెనో కొత్తగా రూపొందించిన 16-అంగుళాల 10-స్పోక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తో రానుంది. 2022 మారుతి సుజుకి బాలెనో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ లుక్‌తో రానుంది. ఫేస్ లిఫ్ట్ మోడల్ కోసం గ్రిల్ వెడల్పుగా వస్తోంది. ఇది LED హెడ్లైట్లు,DRL లు కొత్త సెట్‌తో రానుంది. ఫాగ్‌ల్యాంప్ కేసింగ్ పరిమాణాన్ని పెంచడానికి బంపర్ కూడా ట్వీక్ చేశారు.. బానెట్‌కు మరింత ఫ్లాట్‌గా కనిపించేలా రీడిజైన్ చేయబడింది. ఈ వివరాలు కంపనీ ప్రీమియమ్ డీలర్షిప్ అవుట్లెట్ నెక్సా వెబ్సైట్ ద్వారా లీకయ్యాయి. భద్రతలో సరికొత్తగా... న్యూ ఫేస్ లీఫ్ట్ బాలెనోలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 2022 మారుతి సుజుకి బాలెనో వెనుక భాగం కూడా రీడిజైన్ చేయబడింది. ఇది ఇప్పుడు LED ర్యాప్‌రౌండ్ టైల్లైట్ సరికొత్తగా వెనుక బంపర్‌తో అందించబడుతుంది. మారుతి హ్యాచ్‌బ్యాక్ డైమెన్షన్‌ను మార్చనందున బూట్ స్పేస్ మారదు. 2022 మారుతి సుజుకి బాలెనో ఇంటీరియర్ రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్‌తో రిఫ్రెష్ లుక్‌ను అందిస్తుంది. ఇది ఇప్పుడు డ్యాష్‌బోర్డ్ వెడల్పులో క్రోమ్ యాక్సెంట్లతో డ్యూయల్-టోన్ యూనిట్. ఫ్లోటింగ్ 9-ఇచ్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరౌండ్ సెన్స్‌తో స్మార్ట్‌ప్లే ప్రో+ని అందిస్తుంది. ఈ కారులో స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌లోని స్విచ్ గేర్లు కూడా మార్చబడ్డాయి. ఇంజిన్ విషయానికీ వస్తే... మారుతి బాలెనో భారతదేశంలో ఒకే ఇంజన్ ఆప్సన్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బాలెనో ఇంజిన్‌ను మార్చలేదు. కావున మొదటిది 1.2-లీటర్ ఇంజన్, ఇది 83 బిహెచ్పి పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. -
మారుతీ నుంచి అదిరిపోయే న్యూఏజ్ బాలెనో,రూ.10వేలకే బుకింగ్స్ ప్రారంభం!
కారు కొనుగోలు దారులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి ఆఫర్ ప్రకటించింది. కొత్త హ్యాచ్ బ్యాక్ న్యూఏజ్ బాలెనో కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హంగులతో మార్కెట్‌కి పరిచయమైన ఈ కారును కేవలం రూ.10వేలతో బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనుగోలుదారులు మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌లో లేదంటే మారుతి సుజుకి నెక్సా వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చంది. ఈ సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఇప్పటి వరకు 1 మిలియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లు విక్రయించినట్లు తెలిపారు.“కస్టమర్ల అవసరాల్ని తీర్చేందుకు డైనమిక్‌గా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ డిజైన్, క్లాస్ లీడింగ్ సేఫ్టీ వంటి సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. న్యూ ఏజ్ బాలెనో 'ఫస్ట్-ఇన్ సెగ్మెంట్' హెడ్ అప్ డిస్ప్లేను కలిగి ఉంది.హెచ్యుడితో,డిస్ప్లే స్పీడోమీటర్, క్లైమేట్ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ ను అందించడంతో పాటు కొనుగోలు దారులకు అనుగుణంగా ఇంకా మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కార్లను భారీ సంఖ్యలో రీకాల్ చేస్తోంది. ఫ్యూయెల్ పంప్లో లోపాలు ఉండటంతో వ్యాగన్ ఆర్, బాలెనో మోడళ్ళను రీకాల్ చేస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతి బుధవారం ప్రకటించింది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఈ లోపాలను సరిదిద్ది కస్టమర్లకు తిరిగి అందించనున్నామని దేశంలోని అతిపెద్ద ప్రయాణీకుల వాహనాల తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్లు వాగన్ ఆర్, బాలెనో (పెట్రోల్ వేరియంట్) 1,34,885 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. నవంబర్ 15, 2018-2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వ్యాగన్ఆర్ 56,663 కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే జనవరి 8, 2019-నవంబర్ 8, 2019 మధ్య తయారైన బాలెనో 78,222 కార్లను రాబోయే వారాల్లో రీకాల్ చేస్తామని పేర్కొంది. కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ భర్తీ చేస్తుందని వెల్లడించారు. మోటారు జనరేటర్ యూనిట్లో లోపం కారణంగా డిసెంబరులో, 63,493 యూనిట్ల ప్రీమియం సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, ఆగస్టులో 40,618 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. -
మనసు దోచుకున్నారు
స్టవ్ మీదున్న సూప్ గిన్నెను రెండు చేతులతో పట్టుకుని ఎడమ కాలి బొటన వేలి మీద నిలబడి దేహాన్ని బాలెన్స్ చేస్తోందో అమ్మాయి. ఆమె బాలెన్స్‌కు సహకరిస్తున్నాడో అబ్బాయి. ఇది ఒక ఇంటి చిత్రం. ఒక అమ్మాయి మాప్‌తో ఇల్లు తుడుస్తూ తుడుస్తూ మాప్ పక్కన పెట్టి చేతులను గాల్లోకి లేపి ఒంటి పాదం మీద నిలబడి దేహాన్ని గిర్రున తిప్పింది. ఇది మరో ఇంటి విచిత్రం. ఈ స్టెప్పులు వేస్తున్న వాళ్లంతా రష్యన్ బాలే బృంద కళాకారులు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చోవడాన్ని బోర్‌గా ఫీలయ్యే వాళ్లను ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్రయోగం చేశారు. వంట చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, పిల్లలను అలంకరిస్తూ మధ్యలో స్టెప్పులు వేస్తున్నారు. వీటన్నింటినీ ఎడిట్ చేసి వీడియోను రూపొందించింది సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మిఖాయిలోవ్స్కీ నాటకరంగ కంపెనీ. ‘ఈ లాక్డౌన్ సమయంలో మా అభిమానులను మిస్సవుతున్నాం. అందుకే ఇలా దగ్గరయే ప్రయత్నం చేస్తున్నాం’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో రష్యా వాసుల మనసులను కొల్లగొట్టేసింది. ఇంటి పనులు చేసేటప్పుడు విసుగ్గా ముఖం పెట్టుకోకుండా, ఈ డాన్స్ బాలేలో చూసిన స్టెప్పులను ప్రాక్టీస్ చేస్తూ రోజును ఆనందంగా గడుపుతున్నారు. ‘ఈ లాక్‌డౌన్‌ను ఇలాగే ఆడుతూ పాడుతూ గడిపేస్తాం. లాక్డౌన్ పూర్తవగానే స్టేజ్ మీద మీరు చేసే డాన్స్ బాలేను నేరుగా వీక్షించడానికి వస్తాం’ అని చాలామంది నెటిజన్లు కళాకారులను ఉత్సాహపరుస్తున్నారు కూడా. దేనినైనా సరే అధిగమించగలమనే ధైర్యమే మనిషిని గెలిపిస్తుంది. రష్యావాసుల్లో కనిపిస్తున్నది అదే. ప్రపంచాన్ని పీడిస్తున్న నావల్ కరోనా వైరస్ ఎవరినీ గడపదాటనివ్వడం లేదు. రష్యాలో పదివేల మంది మీద దాడి చేసిన కరోనా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. దాదాపుగా ఏడు వందల మంది విజయవంతంగా వ్యాధిని జయించారు. రష్యాలో లాక్డౌన్ జూన్ 1 వరకు ఉంది. -
పండుగల సీజన్లో ‘మారుతీ’ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్లో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఇందుకు అదనంగా తాజా తగ్గింపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్ డీజిల్ సెలెరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూ ర్ ఎస్ డీజిల్, విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మోడళ్ల ధరలను రూ. 5వేల వరకు ఈ వారంలో తగ్గించిం ది. ఆటో పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో తమ కంపెనీ అమ్మకాలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. -
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతి కొత్త బాలెనో
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద వాహన తయారీ దారు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) సోమవారం కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ స్టేజ్ (బీఎస్) 6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో బిఎస్ -6 ఇంజనతో కొత్త బాలెనో వాహనాన్ని పరిచయం చేసింది. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ (పెట్రోల్) ఇంజీన్ బాలెనో కారు ధర రూ. 5.58 లక్షలు -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా నెక్సా దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2015లో లాంచ్ అయినప్పటినుంచి బాలెనో బ్లాక్ బ్లస్టర్గా నిలిచిందనీ, 5.5 లక్షల బాలెనో వినియోగదారులున్నారనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లు విక్రయించించినట్టు తెలిపారు. ఇటీవలే బాలెనోను తాజా డిజైన్, టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశామన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ లాంగ్‌లైఫ్ సర్వీసు అందిస్తుందనీ, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, వాహన ఉద్గారాలను తగ్గించే మెరుగైన ఇంధన సామర్థ్యంలో వినియోగదారులను ఉత్సాహానిస్తుందని తెలిపారు. -
మారుతి కార్లపై భారీ తగ్గింపు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్ షిప్ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. సియాజ్, బాలెనో, ఎస్-క్రాస్, ఇగ్నిస్ కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ పై రూ.33 వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్, 15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అలాగే నెక్సా డీలర్ షిప్ కింద పరిచయమైన మొదటి మోడల్ కార్ ఎస్-క్రాస్‌పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. -
మార్కెట్లోకి సరికొత్త బాలెనో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షల రేంజ్లో ఉంటాయని మారుతీ తెలిపింది. కొత్త బాలెనోలో రియర్ పార్కింగ్ కెమెరాతో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టూ టోన్ 16 అంగుళాల అలాయ్ వీల్స్, కారు డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, వెహికల్ ఇన్ఫర్మేషన్, స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు అలర్ట్స్ అందటం వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ రిస్ట్రెయింట్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయని వివరించారు. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ (మాన్యువల్ ట్రాన్సిమిషన్) ధరలు రూ.5.4–7.45 లక్షల రేంజ్లో, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ధరలు రూ.7.48–8.77 లక్షల రేంజ్లో ఉన్నాయని తెలిపారు. 1.3 లీటర్ డీజిల్ వేరియంట్లో మాన్యువల్ ట్రాన్సిమిషన్ మోడల్ మాత్రమే లభిస్తుందని, దీని ధరలు రూ.6.6–8.6 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. బాలెనో మోడల్ మైలేజీ ఒక్కో లీటర్‌కు పెట్రోల్ వేరియంట్‌కు 21.4 కి.మీ. డీజిల్ వేరియంట్ 27.4 కి.మీ. వస్తుందని అంచనా. -
దివాలీ ఆఫర్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దీపావళి సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు శుభవార్త. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్ల కార్లపై దివాలీ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో డిస్కౌంట్లను పెంచి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా 23శాతం డిస్కౌంట్ అందిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువ. ధంతేరస్, దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ద్వారా మరిన్ని అమ్మకాలను సాధించనున్నామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు అమ్మకాలు) ఆర్ ఎస్‌కల్సీ చెప్పారు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు అక్టోబర్ నెల రీటైల్ విక్రయాలను ప్రభావితం చేశాయి. మరోవైపు అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకి మెరుగైనప్రదర్శన కనబర్చింది. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే... అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ను విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. -
బాలెనో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో' లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కాస్మొటిక్, ఇంటీరియర్ మార్పులు చేసి స్పోర్టీ లుక్‌తో ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. అలాగే ధరల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే 30 నుంచి 40వేల ప్రీమియం ధర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.కాగా ఫెస్టివ్ సీజన్లలో లిమిటెడ్ ఎడిషన్ కార్లను కస్టమర్లకు అందించడం ఇది మూడవ సారి. గతంలో ఇగ్నిస్, స్విఫ్ట్ మోడల్ కార్లలో స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేసింది. బాలెనో వాస్తవ ధరలు రూ. 5.48 లక్షలు, (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. -
కొత్త స్విఫ్ట్, బాలెనో కార్లు రీకాల్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 52686 యూనిట్ల కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేయనున్నామని, అనంతరం వాటిని పరీక్షించి, లోపం ఉన్న బ్రేక్ వాక్యుమ్ను రీప్లేస్ చేయనున్నట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 16కు మధ్యలో తయారుచేసిన స్విఫ్ట్, బాలెనో వాహనాలకు ఈ సర్వీసు క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా 2018 మే 14 నుంచి వాహన యజమానులు డీలర్లను సంప్రదించాలని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. గ్లోబల్‌గా కూడా ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద మొత్తంలో సర్వీసు క్యాంపెయిన్లను చేపడుతున్నాయి. కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్న లోపం ఉన్న భాగాలను సరిదిద్దుతున్నాయి. సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ చేపడుతున్న ఈ తనిఖీ, రీప్లేస్మెంట్ కస్టమర్లకు ఉచితం. మీ స్విఫ్ట్ లేదా బాలెనో కారు రీకాల్‌లో భాగమై ఉందో లేదో తెలుసుకోవడం కోసం కస్టమర్లకు మారుతీ సుజుకీ అధికారిక సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ వాహన ఛాసిస్ నెంబర్‌ను నమోదుచేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన తర్వాత ఒకవేళ మీ కారు ఆ రీకాల్ జాబితాలో ఉంటే, కస్టమర్లు కంపెనీ సర్వీసు స్టేషన్‌ను సందర్శించి, పరీక్షించుకుని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్ చేయించుకోవాలి. ఛాసిస్ నెంబర్ వాహన ఇన్వాయిస్లో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉంటుంది. కాగా, సియామ్ వెబ్సైట్లో పొందుపరిచిన డేటాలో 2018 తొలి మూడు నెలల కాలంలో 1.12 లక్షలకు పైగా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు రీకాల్ చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం 2017లో రీకాల్ చేసిన వాహనాల కంటే కూడా ఎక్కువే. -
ఆ కార్ల కోసం లక్షకుపైగా వెయిటింగ్
మార్కెట్లో దేశీయ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కార్లకు ఉన్న పాపులారిటీ తెలిసిందే. రోడ్లపై చక్కర్లు కొట్టే వాహనాల్లో సగానికి పైగా ఈ కంపెనీవే. రోజురోజుకి ఈ సంస్థ కార్లకు డిమాండ్ పెరగడమే కానీ, తగ్గడం మాత్రం ఉండదు. తాజాగా స్విఫ్ట్, బాలెనో, డిజైర్, విటారా బ్రిజా కార్ల కోసం లక్షకు పైగా కస్టమర్లు వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ నాలుగు కార్లు కలిపి 1,10,00 యూనిట్ల పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉన్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం కంపెనీకి చెందిన గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచి, ఈ ప్రొడక్ట్‌ల వెయిటింగ్ కాలాన్ని తగ్గించాలని మారుతీ సుజుకీ ప్లాన్ చేస్తోందని తెలిసింది. కొత్త మారుతీ స్విఫ్ట్‌ను కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే ఈ కారు టాప్-సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. లాంచ్ అయిన రెండు నెలల్లోనే స్విఫ్ట్‌కు దాదాపు లక్ష బుకింగ్స్ నమోదైనట్టు తెలిసింది. మరోవైపు ఏడాది క్రితం లాంచ్ అయిన మారుతీ డిజైర్‌కు కూడా అంతే డిమాండ్ వస్తోంది. లాంచ్ అయిన ఐదు నెలల లోపే ఈ కారు కూడా లక్ష యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సెడాన్ గతేడాది టాప్ సెల్లింగ్ కార్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2018 ఏప్రిల్ చివరి నాటికి మారుతీకి 1.72 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగ, హ్యుందాయ్ ఇండియాకు 59,744 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని తెలిసింది. ఈ గణాంకాలు బట్టి మారుతీ సుజుకీ ఉత్పత్తులకు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచాలని మారుతీ చూస్తోంది. ఈ ప్లాంట్‌కు మరో రెండు లైన్లను కూడా జత చేయాలనుకుంటోంది. మొత్తంగా 2020 నాటికి 7.5 లక్షల యూనిట్ల కెపాసిటీని మారుతీ పెంచబోతోంది. -
మారుతి కొత్త బాలెనో లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో సరికొత్త బాలెనోను లాంచ్ చేసింది. సీవీటీ ఆప్షన్‌తో హాచ్బ్యాక్ టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ వేరియంట్‌గా దీనిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త బాలెనోను ధర రూ. 8.34 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. హై ఎండ్ ఫీచర్స్‌తో ఈ ప్రీమియం వెర్షన్ ఆటోమేటిక్ బాలెనో కార్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రయోగంతో, ఆటోమేటిక్ బాలెనో కొనుగోలుకు చూస్తున్న వినియోగదారులకు ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్ లింకేజ్ డిస్ ప్లే ఆడియోతో సహా హై-ఎండ్ ఫీచర్స్ అందుతాయని సంబంధిత కంపెనీ అధికారి తెలిపారు. సీవీటీ (కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) ఆప్షన్‌తో డెల్టా, జెటా కార్లను ఇప్పటికే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, 2015లో లాంచ్ అయిన ఈ బాలెనో ఒక ఏడాదిలోనే లక్షలకార్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. అలాగే ఇప్పటికి 2లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో స్పోర్టీ వెర్షన్ బాలెనో ఆర్ఎస్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
స్విఫ్ట్ , బాలెనో బూస్ట్‌తో మారుతి స్పీడు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సూజుకీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్చి అమ్మకాల్లో 8.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలల్లో గణనీయమైన వృద్ధితో 7.7 శాతం కంపెనీ శనివారం వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 1,29,345 యూనిట్ల నుంచి 1,39,763 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా యుటిలిటీ కార్లు విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా 32శాతం అమ్మకాలతో మారుతి టాప్ గేర్ లో దూసుకుపోయింది. దేశీయంగా గత ఏడాది మార్చిలో 1,18,895 యూనిట్లను విక్రయించిన మారుతి, ఈ ఏడాది ఆ సంఖ్యను 1,27,999కు మెరుగుపర్చుకుంది. ఎగుమతుల విషయానికి వస్తే 12.6 శాతం వృద్ధితో 11,764 యూనిట్లుగా ఉంది. ముఖ్యంగా విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగాల అమ్మకాలు 31.8 శాతం ఎగబాకాయి. గత ఏడాది మార్చి 2016లో 13,894 యూనిట్ల అమ్మకాలతో తో పోలిస్తే ఈ ఏడాది 18,311 యూనిట్లను విక్రయించింది. అయితే చిన్న కార్ల విభాగంలో మాత్రం కంపెనీ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అలాగే వ్యాన్ల విభాగంలో ఈకో, ఓమ్నీల విక్రయాలు కూడా దాదాపు 10శాతం పడిపోయాయి. ఆల్టో, వేగనార్ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. మిడ్ సైజ్ సెగ్మెంట్లో సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గాయి. అయితే కాంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, ఇగ్నిస్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్ల అమ్మకాలు 29.7 శాతం పెరిగాయి. ఇగ్నిస్, బాలెనో మోడళ్ళలో కొత్త వెర్షన్లను విడుదల చేయడంతో ఈ విభాగంలో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా 2015-16 సం.రంలో డొమెస్టిక్ మార్కెట్ లో 13.5ల క్షల వాహనాలతో పోలిస్తే 11 శాతం వృద్ధితో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ మొత్తం విక్రయాలు 14.44 లక్షల యూనిట్లకు పెరిగాయి. -
మారుతికి స్విఫ్ట్ , బాలెనో బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సూజుకీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్చి అమ్మకాల్లో 8.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలల్లో గణనీయమైన వృద్ధితో 7.7 శాతం కంపెనీ శనివారం వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 1,29,345 యూనిట్ల నుంచి 1,39,763 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా యుటిలిటీ కార్లు విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా 32శాతం అమ్మకాలతో మారుతి టాప్ గేర్ లో దూసుకుపోయింది దేశీయంగా గత ఏడాది మార్చిలో 1,18,895 యూనిట్లను విక్రయించిన మారుతి, ఈ ఏడాది 1,27,999 వాహనాలను విక్రయించింది. ఎగుమతుల విషయానికి వస్తే 12.6 శాతం వృద్ధితో 11,764 యూనిట్లుగా ఉంది. ముఖ్యంగా విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగాల అమ్మకాలు 31.8 శాతం ఎగబాకాయి. గత ఏడాది మార్చి 2016లో 13,894 యూనిట్ల అమ్మకాలతో తో పోలిస్తే ఈ ఏడాది 18,311 యూనిట్లను విక్రయించింది .వ్యాన్ల విభాగంలో ఈకో, ఓమ్నీల విక్రయాలు మాత్రం దాదాపు 10శాతం పడిపోయాయి. చిన్న కార్ల విభాగంలో మాత్రం కంపెనీ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆల్టో, వేగనార్ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. మిడ్ సైజ్ సెగ్మెంట్లో సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గాయి. అయితే కాంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, ఇగ్నిస్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్ల అమ్మకాలు 29.7 శాతం పెరిగాయి. ఇగ్నిస్, బాలెనో మోడళ్ళలో కొత్త వెర్షన్లను విడుదల చేయడంతో ఈ విభాగంలో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా 2015-16 సం.రంలో డొమెస్టిక్ మార్కెట్ లో 13.5ల క్షల వాహనాలతో పోలిస్తే 11 శాతం వృద్ధితో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ మొత్తం విక్రయాలు 14.44 లక్షల యూనిట్లకు పెరిగాయి. -
విక్రయాల్లో పడిపోయిన మారుతి
పండుగ సీజన్లో కార్ల విక్రయాలు జోరు కొనసాగుతుండగా.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మాత్రం ఈ అక్టోబర్ నెల విక్రయాల్లో స్వల్పంగా పడిపోయింది. గతేడాది 1,34,209 యూనిట్లగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది 1,33,793 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా విక్రయాలు మందగించినప్పటికీ, దేశీయ అమ్మకాల్లో మారుతి మెరుగైన పెరుగుదలనే నమోదుచేసింది. దేశీయంగా 2.2 శాతం అమ్మకాలు పెంచుకుని 1,23,764 యూనిట్లగా నమోదుచేసినట్టు ఎంఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 అక్టోబర్‌లో ఈ విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకీ ఉత్పత్తులకు డిమాండ్‌గా బలంగానే ఉందని కంపెనీ పేర్కొంది. సియాజ్, ఎస్ క్రాస్, ఎర్టిగా, బ్రిజా, బాలెనో రిటైల్ విక్రయాలు అత్యధికంగా నమోదైనట్టు ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కాల్సి తెలిపారు. నెలవారీ కంపెనీ విక్రయాలు, పనిదినాలు, స్టాక్ ప్లాన్ వంటి స్వల్పకాలిక కారకాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఫెస్టివ్ సీజన్లో డిమాండ్‌పై ఇవి ప్రతిబింబిస్తాయని వివరించారు. ఆల్టో, వాగన్ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్లు విక్రయాలు 9.8 శాతం క్షీణించి, 37,595యూనిట్లగా నమోదైనట్టు ఎంఎస్ఐ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాలు సిప్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో విక్రయాలు 1.8 శాతం పడిపోయినట్టు మారుతి వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కాంపాక్ట్ సెడాన్ డిజైర్ విక్రయాలు పడిపోయి, 27.4 శాతం కిందకి దిగజారాయి. అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు 2,481 యూనిట్లగా నమోదయ్యాయి. కాగ, మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ 8 శాతం ఎగిసి, 6,360 యూనిట్లగా రికార్డయ్యాయి. -
విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. అయితే జూన్‌లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్‌లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి.