హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్‌ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్‌జీ వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్‌జీ వేరియంట్‌లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు.
1.23 లక్షల యూనిట్ల సీఎన్‌జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్‌జీ వాహనాలు రోడ్డెక్కాయి.
బలీనో, ఎక్స్‌ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది.
చదవండి: ఎయిర్‌టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment