Baleno premium hatchback
-
అదిరే లుక్.. సీఎన్జీలో బాలీనో, ఎక్స్ఎల్6 కార్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్జీ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వేరియంట్లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1.23 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. బలీనో, ఎక్స్ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన న్యూ ఏజ్ బాలెనో కారు..!
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నేడు(ఫిబ్రవరి 23) తన సరికొత్త ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో కారును విడుదల చేసింది. ఈ కారును "న్యూ ఏజ్ బాలెనో" అని పిలుస్తారు. ఈ కొత్త బాలెనో కారు ధర సుమారు రూ.6.35 లక్షల నుంచి రూ.9.49 లక్షల(ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉంది. ఈ కొత్త కారు బుకింగ్స్ ఇప్పటికే ఫిబ్రవరి 7, 2022 నుంచి ఓపెన్ అయ్యాయి. మారుతీ సుజుకీ 2022 బాలెనో లాంఛ్ కావడం కన్నా ముందే 25,000 బుకింగ్స్ రావడం విశేషం. మారుతి సుజుకి కూడా సబ్ స్క్రిప్షన్ కింద ఈ కొత్త కారును అద్దెకు అందిస్తోంది. దీని సబ్ స్క్రిప్షన్ ధర నెలకు రూ.13,999. సరికొత్త బాలెనోను తయారుచేసేందుకు కంపెనీ రూ.1,150 కోట్లు పెట్టుబడిపెట్టినట్లు చేసింది. ఈ కొత్త బాలెనో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, విడబ్ల్యు పోలో, హోండా జాజ్ వంటి వాటితో పోటీ పడనుంది. మారుతి సుజుకి 2022లో 7 కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ప్రారంభించాలని యోచిస్తోంది. అందులో మొదటిది ఈ కొత్త 2022 బాలెనో కారు. 2022 బాలెనో ఫీచర్స్ బాలెనో మోడల్లో అత్యున్నతమైన ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ ఫీచర్లతో వచ్చింది. అల్టిమేట్ అర్బన్ క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ కోసం క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్‌ను కూడా ఇందులో ఉంది. మారుతీ సుజుకీ 2022 బాలెనో ఐదు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ హిల్ కంట్రోల్, ఇతర సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. 2022 బాలెనో ఫ్రంట్ గ్రిల్ వెడల్పుగా ఉంటుంది. సుజుకీ లోగో, డీఆర్ఎల్ టెయిల్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ ఉంటాయి. హెడ్ అప్ డిస్ప్లే 360 డిగ్రీ వ్యూ కెమెరా, అడ్వాన్స్డ్ వాయిస్ అసిస్ట్, ARKAMYS రూపొందించిన సరౌండ్ సెన్స్‌తో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలెక్సా వాయిస్‌తో సుజుకీ కనెక్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 2022 మారుతి సుజుకి బాలెనోలో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ కె12ఎన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 90 హెచ్‌పి పవర్, 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు గేర్ బాక్సులు, 5స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కూడా లభిస్తాయి. మారుతి సుజుకి న్యూ ఏజ్ లీటర్‌కు 22.35 కి.మీ/లీ(మాన్యువల్), 22.94 కి.మీ/లీ(ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్) మైలేజ్ ఇవ్వనుంది. (చదవండి: పెండింగ్ చలాన్ వాహనదారులకు భారీ శుభవార్త..!) -
బాలెనో, ఆల్ట్రోజ్ కంటే తక్కువ ధరలో.. i20 ఎరా!
న్యూఢిల్లీ: హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి హ్యుందాయ్ తెరలేపింది. పప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఐ 20 ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో పోటీగా ఉన్నా టాటా, నెక్సాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మాగ్నాకంటే తక్కువ హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ20కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఐ20 మోడల్లో మాగ్నా వేరియంట్ ధర తక్కువ. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో మాగ్నా ట్రిమ్ వేరియంట్ ధర రూ. 6.85 లక్షల నుంచి రూ.8.21 లక్షల వరకు లభిస్తోంది. ఇప్పుడు ఇంత కంటే తక్కువ ధరలో ఐ20 ఎరా ట్రిమ్ మోడల్‌ను మార్కెట్లోకి తెస్తోంది. రూ. 6 లక్షల దగ్గర కేవలం పెట్రోల్ వెర్షన్లోనే లభించే హ్యుందాయ్ ఐ20 ఎరా ట్రిమ్ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇదే సెగ్మెంట్లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.80 లక్షలు, నెక్సా బాలెనో ధర రూ. 5.98 లక్షలుగా ఉంది. ఇంచుమించు వీటికి దగ్గరగానే ఐ20 ఎరా ట్రిమ్ ప్రైస్ ఉండేలా హ్యుందాయ్ జాగ్రత్త పడుతోంది. నో కాంప్రమైజ్ ధర తగ్గించినప్పటికీ కారు బిల్ట్ క్వాలిటీలో హ్యుందాయ్ పెద్దగా కాంప్రమైజ్ కావడం లేదు.పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఎయిర్ కండీషన్, మాన్యువల్ గేర్ సిస్టమ్ అందిస్తోంది. అయితే వెనుక వైపు పవర్ విండోస్‌కి బదులు మాన్యువల్ విండోస్ అందించింది. నేటి ట్రెండ్‌కి తగ్గ ఇన్ఫోంటైన్ సిస్టమ్ కాకుండా బేసిక్ ఇన్ఫోంటైన్ సిస్టమ్ అందిస్తోంది. త్వరలో ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు హ్యుందాయ్ వెల్లడించనుంది. -
మారుతీ నుంచి మరిన్ని ప్రీమియం కార్లు
పండుగల సీజన్ కల్లా బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కంపెనీ చైర్మన్ ఆర్.సి. భార్గవ న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ మరిన్ని ప్రీమియం కార్లను మార్కెట్లోకి తేనుంది. దీంట్లో భాగంగా బాలెనో పేరుతో కొత్తగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను దసరా, దీపావళి పండుగల సీజన్లో మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. వచ్చే నెలలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగే ఆటో షోలో ఈ కారును మారుతీ మాతృసంస్థ జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్ప్ ప్రదర్శించనుంది. పండుగల సీజన్‌కల్లా మరో కొత్త ప్రీమియం కాంపాక్ట్ కారును తేనున్నట్లు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. కంపెనీ వాటాదారులకు నివేదించిన కంపెనీ వార్షిక నివేదిక (2014-15)లో ఆయన ఈ వివరాలు పేర్కొన్నారు. గతంలో బాలెనో పేరుతో ఒక ప్రీమియం సెడాన్‌ను మారుతీ విక్రయించింది. దీనికి ఇప్పుడు తేనున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు పేరులో తప్ప మరేదాంట్లోనూ పోలిక లేదు. ప్రస్తుతం మారుతీ సుజుకీ కంపెనీ ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో సియాజ్ కారును విక్రయిస్తోంది. ప్రీమి యం కార్ల కోసం నెక్సా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగానే వాణిజ్య వాహనాల కోసం మరో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నది.