భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' గత నెలలో (2023 ఫిబ్రవరి) మంచి అమ్మకాలను పొందింది. అమ్మకాల పరంగా కంపెనీ 2022 ఫిబ్రవరి కంటే కూడా 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
మారుతి సుజుకి అమ్మకాల్లో బాలెనొ 18,592 యూనిట్లను విక్రయించి మునుపటి ఏడాది ఇదే నెలకంటే 47.91 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరిలో దీని అమ్మకాలు 12,570 యూనిట్లు. తరువాత వరుసలో 18,114 యూనిట్ల అమ్మకాలతో స్విఫ్ట్ నిలిచింది. అయితే స్విఫ్ట్ అమ్మకాలు మునుపటి సంవత్సరం కంటే 4.11 శాతం తగ్గాయి.
56.82 శాతం పెరుగుదలతో మారుతి ఆల్టో మూడవ స్థానంలో నిలిచింది. ఆల్టో అమ్మకాలు గత నెలలో 18,114 యూనిట్లు. వ్యాగన్-ఆర్ అమ్మకాలు 16,889 యూనిట్లు కాగా, డిజైర్ సేల్స్ 16,798 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. డిజైర్ అమ్మకాలు 2022లో 3.67 శాతం తగ్గాయి.
(ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!)
బ్రెజ్జా, ఈకో అమ్మకాలు వరుసగా 15,787 & 11,352 యూనిట్లు. ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలైన గ్రాండ్ విటారా ఏకంగా 9,183 యూనిట్ల అమ్మకాలతో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఎర్టిగా, ఇగ్నిస్ రెండూ 6472 యూనిట్లు, 4749 యూనిట్లను విక్రయించి తొమ్మిది, పదవ స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment