Car Sales 2023 August: 2023 ఆగష్టు నెల ముగియగానే దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. ఈ డేటా ప్రకారం దాదాపు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తున్నాయి. గత నెలలో ఎక్కువ కార్లు విక్రయించిన సంస్థ ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్ల అమ్మకాలలో 2022 ఆగష్టు నెల కంటే 2023 ఆగష్టు నెలలో మారుతి సుజుకి 16.4 శాతం (165402 యూనిట్లు), మహీంద్రా అండ్ మహీంద్రా 19 శాతం వృద్ధి పొందినట్లు తెలుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో మొత్తం 70350 యూనిట్లను విక్రయించింది. ఇందులో 37270 యూనిట్లు దేశీయ విక్రయాలు కాగా.. మిగిలినవి విదేశీ ఎగుమతులు. మొత్తం మీద మహీంద్రా 26 శాతం వృద్ధిని నమోదు చేసింది.
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3.5 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో 78,010 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఆగష్టు నెలలో 78,843 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!
ఇక టూ వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్స్ 5 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. కాగా బజాజ్ ఆటో 31 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం మీద అమ్మకాల పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment