అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు | Tata Motors 20 Lakh SUV Sales | Sakshi
Sakshi News home page

అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు

Published Tue, Jul 9 2024 9:16 PM | Last Updated on Tue, Jul 9 2024 9:19 PM

Tata Motors 20 Lakh SUV Sales

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్‌యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలుగా టాటా సఫారీ, హారియర్,  నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.

కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్‌యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్‌యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement