భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన 'టాటా పంచ్' (Tata Punch) తాజాగా.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల సేల్స్ (Sales) మైలురాయిని దాటేసింది.
టాటా పంచ్ 2021 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,04,679 మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2021లో 22,571 యూనిట్లు, 2022లో 1,29,895 యూనిట్లు, 2023లో 1,50,182 యూనిట్లు, 2024లో 2,02,031 యూనిట్ల సేల్స్ జరిగాయి. అంతే కాకుండా గత ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.
సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధరలు రూ. 6.19 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ అన్ని మోడల్స్.. ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment