Tata Nexon EV hits 50,000 units sales milestones in India - Sakshi
Sakshi News home page

Tata Nexon EV: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!

Published Tue, Jun 27 2023 6:01 PM | Last Updated on Tue, Jun 27 2023 6:46 PM

Tata Nexon ev new milestone in sales details - Sakshi

Tata Nexon EV Sales: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో 'నెక్సాన్ ఈవీ' (Nexon EV) లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలను పొందుతూ బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. కాగా ఇప్పుడు అమ్మకాల పరంగా అరుదైన ఒక కొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2020లో ప్రారంభమైనప్పటి నుంచి మూడు సంవత్సరాల సమయంలో ఏకంగా 50,000 యూనిట్ల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మార్కెట్లో నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 14.49 లక్షలు, రూ. 19.54 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ , ఇండియా) ఉన్నాయి. 

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ అనేది 30.2 కిలోవాట్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 312 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. కాగా ఈవీ మ్యాక్ 40.5kWh బ్యాటరీని కలిగి 453 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి రెండూ ఐపి67 రేటింగ్ పొందుతాయి. అదే సమయంలో ఇవి 3.3kW లేదా 7.2kW ఛార్జర్‌తో లభిస్తాయి.

(ఇదీ చదవండి: స్విట్జర్లాండ్‌లో ఖరీదైన విల్లా కొన్న ఇండియన్ ఫ్యామిలీ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!)

ఈవీ ప్రైమ్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో 10-80 శాతం, ఈవీ మ్యాక్స్ 50 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 56 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు ఒక్క చూపులోనే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యువి400 ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement