Tata Nexon Ev Prime
-
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో సురక్షితమైన కార్లు (ఫోటోలు)
-
నెక్సాన్ సీఎన్జీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ టర్బోచార్జ్డ్ ఐసీఎన్జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనమిది వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.99 లక్షలతో ప్రారంభమై రూ.14.59 లక్షల వరకు ఉంది. 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌తో తయారైంది. కేజీకి 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఫీచర్లు. 321 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. టాప్ వేరియంట్‌కు 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, టైర్ ప్రెజర్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఆటో హెడ్‌లైట్, ఆటో వైపర్స్ వంటివి జోడించారు. ఈవీ 489 కిలోమీటర్లు.. టాటా మోటార్స్ తాజాగా 45 కిలోవాట్ అవర్ బ్యాటరీతో కూడిన నెక్సాన్ ఈవీని పరిచయం చేసింది. ధర రూ.13.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 48 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టచ్ బేస్డ్ ఏసీ ప్యానెల్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ ఫోన్ చార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు జోడించారు. కాగా, టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్‌ను రూ.17.19 లక్షల ధరతో ప్రవేశపెట్టింది. -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిన నెక్సన్.ఈవీ, టియాగో.ఈవీ మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యాటరీ వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. నెక్సన్.ఈవీ ధర రూ.1.2 లక్షల వరకు తగ్గింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.14.49 లక్షలు ఉంది. టియాగో.ఈవీ ధర రూ.70,000 వరకు తగ్గడంతో ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి లభిస్తోంది. బ్యాటరీ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని పంచ్.ఈవీ ధర నిర్ణయించడంతో తాజాగా ఎటువంటి సవరణ చేయలేదని టాటా మోటార్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ 8 శాతం వృద్ధి చెందింది. అయితే ఈవీ విభాగం 90 శాతం దూసుకెళ్లడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 2024 జనవరిలో ఈవీ విభాగం ఏకంగా 100%పెరగడం విశేషం. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో భారత్‌లో 70%పైగా వాటాతో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రస్థానంలో నిలిచింది. -
అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!
Tata Nexon EV Sales: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో 'నెక్సాన్ ఈవీ' (Nexon EV) లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలను పొందుతూ బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. కాగా ఇప్పుడు అమ్మకాల పరంగా అరుదైన ఒక కొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి మూడు సంవత్సరాల సమయంలో ఏకంగా 50,000 యూనిట్ల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మార్కెట్లో నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 14.49 లక్షలు, రూ. 19.54 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ , ఇండియా) ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ అనేది 30.2 కిలోవాట్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 312 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. కాగా ఈవీ మ్యాక్ 40.5kWh బ్యాటరీని కలిగి 453 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి రెండూ ఐపి67 రేటింగ్ పొందుతాయి. అదే సమయంలో ఇవి 3.3kW లేదా 7.2kW ఛార్జర్‌తో లభిస్తాయి. (ఇదీ చదవండి: స్విట్జర్లాండ్‌లో ఖరీదైన విల్లా కొన్న ఇండియన్ ఫ్యామిలీ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!) ఈవీ ప్రైమ్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో 10-80 శాతం, ఈవీ మ్యాక్స్ 50 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 56 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు ఒక్క చూపులోనే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో మహీంద్రా ఎక్స్యువి400 ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. Together, #NexonEV50kCommunity is forging a new path, one that's powered by electric dreams and a passion for change. Join us as we continue to drive towards a greener, cleaner, and more exhilarating future. Cheers to 50,000 and beyond!#50kCommunity #TATAMotors #TATA #NexonEV pic.twitter.com/KHZIKB8J9F — Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) June 27, 2023 -
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కారు కావాలా - ఇక్కడ చూడండి (ఫోటోలు)
-
కొత్త కారుతో గ్రాండ్ ఎంట్రీ .... పల్టీ కొట్టిందిగా!
ఒక వ్యక్తి కొత్త కారుతో గ్రాండ్‌గా ఎంటీ ఇస్తున్నాడు. కానీ అతనికి కొత్త కారుతో వచ్చిన ఆనందం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. బ్రాండెడ్ టాటా నెక్సాన్ కారుతో చక్కటి పూల దండతో అలకరింపబడి ఉన్న కారుతో ఇంటికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే సెక్యూరిటీ గార్డు కూడా గేట్ తీసి చక్కగా దారి ఇచ్చాడు కూడా. కానీ సదరు వ్యక్తి కారుని లోపలి పోనిచ్చి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపైకి పోనిచ్చాడు. దీంతో కారు ఆ బైక్లన్నింటిని ఢీ కొడుతూ ఒక పక్కకు పల్టీ కొట్టబోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సదరు కారు నడుపుతున్న వ్యక్తికి సాయం అందిస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వినోద్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD — Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
టాటా ఎలక్ట్రిక్ కారు, ఒకసారి చార్జింగ్ చేస్తే 312కి.మీ ప్రయాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా నెక్సన్ ఈవీ ప్రైమ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. మల్టీ మోడ్ రీజెన్, క్రూజ్ కంట్రోల్, ఇండైరెక్ట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ వంటివి అదనంగా పొందుపరిచారు. ఈ ఫీచర్లు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ ద్వారా ఇప్పటికే పరుగెడుతున్న 22,000లకుపైగా నెక్సన్ ఈవీ కార్లకూ జోడించవచ్చని కంపెనీ తెలిపింది. జూలై 25 నుంచి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ కార్యక్రమం అధీకృత సర్వీస్ కేంద్రాల ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నట్టు వివరించింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో దేశంలో 65 శాతం వాటా ఉన్నట్టు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ హెడ్ వివేక్ శ్రీవత్స తెలిపారు.