హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ టర్బోచార్జ్‌డ్ ఐసీఎన్‌జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనమిది వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.99 లక్షలతో ప్రారంభమై రూ.14.59 లక్షల వరకు ఉంది. 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌తో తయారైంది. కేజీకి 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
మాన్యువల్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఫీచర్లు. 321 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. టాప్ వేరియంట్‌కు 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, టైర్ ప్రెజర్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఆటో హెడ్‌లైట్, ఆటో వైపర్స్ వంటివి జోడించారు.
ఈవీ 489 కిలోమీటర్లు..
టాటా మోటార్స్ తాజాగా 45 కిలోవాట్ అవర్ బ్యాటరీతో కూడిన నెక్సాన్ ఈవీని పరిచయం చేసింది. ధర రూ.13.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 48 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్ బేస్డ్ ఏసీ ప్యానెల్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు జోడించారు. కాగా, టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్‌ను రూ.17.19 లక్షల ధరతో ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment