హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా నెక్సన్ ఈవీ ప్రైమ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.
మల్టీ మోడ్ రీజెన్, క్రూజ్ కంట్రోల్, ఇండైరెక్ట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ వంటివి అదనంగా పొందుపరిచారు. ఈ ఫీచర్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ద్వారా ఇప్పటికే పరుగెడుతున్న 22,000లకుపైగా నెక్సన్ ఈవీ కార్లకూ జోడించవచ్చని కంపెనీ తెలిపింది.
జూలై 25 నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కార్యక్రమం అధీకృత సర్వీస్ కేంద్రాల ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నట్టు వివరించింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో దేశంలో 65 శాతం వాటా ఉన్నట్టు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ హెడ్ వివేక్ శ్రీవత్స తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment