ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. గత నెల ఏప్రిల్ 69,599 యూనిట్లను విక్రయించింది. 2022లో ఇదే సమయానికి 72,468 యూనిట్లను అమ్మింది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
టాటా నెక్సాన్, టాటా టిగోర్ వంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను టాటా మోటార్స్ అమ్మకాలు జరుపుతుండగా.. వాటి సేల్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ ఏప్రిల్‍లో 6,516 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడు పోగా.. గతేడాది ఇదే నెలలో 2,333 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈవీ వెహికల్స్‌తో పోటీగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 47,107 ప్యాసింజర్ వాహనాలను ఆ సంస్థ అమ్మి 13 శాతం వృద్దిని సాధించింది. గతేడాది ఇదే నెల 41,630లో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మింది.
Comments
Please login to add a commentAdd a comment