న్యూఢిల్లీ: మూడవ అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఈవీ తయారీ సంస్థలకు భారత్ మెరుగైన లక్ష్యంగా ఉంది. అయితే దేశీయంగా నెమ్మదిగా మార్కెట్ కొనసాగుతుండడంతో భవిష్యత్తులో ఏ భారతీయ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలలో అర్ధవంతమైన ప్రపంచ వాటాను కలిగి ఉండే అవకాశం లేదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది.
‘ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆసియా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ బ్యాటరీలు, బ్యాటరీ ముడిసరుకు కోసం ఇక్కడ మార్కెట్ ఉంది. ఈ ఖండం ఈవీ శకానికి కేంద్రంగా నిలుస్తుంది. దేశంలో గత ఏడాది ఈవీల విక్రయాలు రెండింతలు పెరిగాయి.
గత 12 నెలల్లో మొత్తం తేలికపాటి వాహన విక్రయాలలో వీటి వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. 90 శాతం ఈవీలు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విభాగంలో ఉన్నాయి. బలమైన వృద్ధి సామర్థ్యం ఉన్నప్పటికీ తగిన ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈవీల స్వీకరణకు కీలకం. దేశంలో టాటా మోటార్స్ 80 శాతం కంటే ఎక్కువ వాటాతో ఈ విభాగంలో ముందంజలో ఉంది.
ఎస్‌ఏఐసీ మోటార్ కార్ప్, హ్యుందాయ్, అలాగే దేశీయ కంపెనీ అయిన మహీంద్రాతో సహా ఇతర సంస్థల నుండి పోటీ పెరుగుతున్నప్పటికీ టాటా మోటార్స్ తన బలమైన స్థానాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాము. ఆసియా ప్రాంతంలో ఈవీ రంగానికి అవసరమైన వనరులు ఉన్నాయి. ఇండోనేషియాలో నికెల్ నిక్షేపాలు ఎక్కువ. చైనాలో అత్యంత సహాయక విధానాలు, కొరియా, చైనా, జపాన్‌లో పరిశ్రమకు కావాల్సిన సాంకేతికత పుష్కలంగా ఉంది’ అని వివరించింది.
చదవండి👉 ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్?
Comments
Please login to add a commentAdd a comment