దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2023 మార్చి నెల అమ్మకాల గణాంకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో ఏకంగా 44,044 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ గొప్ప రికార్డ్ సృష్టించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి నాటికి కంపెనీ 5,38,640 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 45.43 శాతం పెరిగాయి.
2022 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా టాటా మోటార్స్ 3,70,372 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ తరువాత టాటా మోటార్స్ అతి పెద్ద సంస్థ. గత నెలలో కంపెనీ ఎక్కువగా నెక్సాన్, పంచ్, హారియార్, సఫారీ వంటి కార్లను విక్రయించింది. మొత్తం అమ్మకాల్లో ఈ ఎస్‍యూవీల వాటా 66శాతం.
మొత్తం అమ్మకాల్లో (44,044 యూనిట్లు) ఎలక్ట్రిక్ వెహికల్స్ (6,509 యూనిట్లు) కూడా ఉన్నాయి. 2022 మార్చితో పోలిస్తే ఈ అమ్మకాలు నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే 2022 మార్చిలో కంపెనీ అమ్మకాలు 42,293 యూనిట్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో కంపెనీ వృద్ధి 89 శాతం ఉండటం గమనార్హం. 2022లో ఈవీల అమ్మకాలు 19,668 యూనిట్లు.
(ఇదీ చదవండి: మార్కెట్లో కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర తక్కువ & బోలెడన్ని ఫీచర్స్..)
ఇక కమర్షియల్ వెహికల్స్ సేల్స్ విషయానికి వస్తే, 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,93,317 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2022లో ఈ అమ్మకాలు 3,22,182 యూనిట్లు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల్లో కూడా 22 శాతం పెరుగుదల ఉంది. ఎగుమతుల విషయంలో కంపెనీ భారీ తగ్గుదలను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment