Harrier
-
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ విడుదల.. కర్వ్ వచ్చే ఏడాదే..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రెండేళ్లలో మరో రెండు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) భారత్‌లో ప్రవేశపెడుతోంది. వీటిలో కర్వ్, సియెరా మోడళ్లు ఉన్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర వెల్లడించారు. వీటి చేరికతో కంపెనీ ఎస్యూవీ శ్రేణికి మరింత బలం చేకూరుతుందన్నారు. ఎస్‌యూవీలైన హారియర్, సఫారి కొత్త వర్షన్స్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హారియర్, సఫారి కొత్త వర్షన్స్ గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి అత్యుత్తమ భద్రతా రేటింగ్స్‌ను పొందాయి. 5–స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో భారతీయ కంపెనీలకు చెందిన వాహనాల్లో అత్యధిక స్కోర్‌తో టాటా ఎస్‌యూవీలు ఇక్కడి రోడ్లపై అత్యంత సురక్షితమైన మోడళ్లుగా ఉన్నాయి’ అని వివరించారు. ఎక్స్‌షోరూంలో హారియర్ కొత్త వర్షన్ రూ.15.49 లక్షలు, సఫారి రూ.16.19 లక్షల నుంచి ప్రారంభం. ఎస్యూవీ విభాగంలో పోటీ.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ దేశీయ ప్యాసింజర్ వాహనాల (పీవీ) వృద్ధిని నడిపిస్తున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం మొత్తం పీవీల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 60 శాతానికి చేరింది. చాలా కాలంగా ఎస్యూవీ విభాగంలో అగ్ర స్థానంలో ఉన్నామని శైలేష్ తెలిపారు. పంచ్, నెక్సన్ సెగ్మెంట్ లీడర్లుగా ఉన్నాయని వెల్లడించారు. హారియర్, సఫారి ద్వయం ఇవి పోటీ పడుతున్న విభాగంలో రెండవ స్థానంలో ఉన్నాయని చెప్పారు. ‘ఇతర కంపెనీలు కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేశాయి. ర్యాంకింగ్ మారుతూనే ఉంటుంది. ఇక్కడ నంబర్ వన్ అనేది స్పష్టంగా లేదు. ఈ సెగ్మెంట్లో తీవ్ర పోటీ ఉండబోతోంది. మొదటి మూడు–నాలుగు కంపెనీల అమ్మకాల వ్యత్యాసం కొన్ని వేల యూనిట్లు మాత్రమే. ఏదో ఒక సమయంలో ఎవరైనా నంబర్ వన్ అవుతారు. కొన్నిసార్లు మరొకరు నంబర్ టూ అవుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మా వద్ద ఉన్న నాలుగు ఎస్‌యూవీల్లో మేము అద్భుత పనితీరును కనబరుస్తున్నాము’ అని తెలిపారు. -
అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2023 మార్చి నెల అమ్మకాల గణాంకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో ఏకంగా 44,044 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ గొప్ప రికార్డ్ సృష్టించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి నాటికి కంపెనీ 5,38,640 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 45.43 శాతం పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా టాటా మోటార్స్ 3,70,372 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ తరువాత టాటా మోటార్స్ అతి పెద్ద సంస్థ. గత నెలలో కంపెనీ ఎక్కువగా నెక్సాన్, పంచ్, హారియార్, సఫారీ వంటి కార్లను విక్రయించింది. మొత్తం అమ్మకాల్లో ఈ ఎస్‌యూవీల వాటా 66శాతం. మొత్తం అమ్మకాల్లో (44,044 యూనిట్లు) ఎలక్ట్రిక్ వెహికల్స్ (6,509 యూనిట్లు) కూడా ఉన్నాయి. 2022 మార్చితో పోలిస్తే ఈ అమ్మకాలు నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే 2022 మార్చిలో కంపెనీ అమ్మకాలు 42,293 యూనిట్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో కంపెనీ వృద్ధి 89 శాతం ఉండటం గమనార్హం. 2022లో ఈవీల అమ్మకాలు 19,668 యూనిట్లు. (ఇదీ చదవండి: మార్కెట్లో కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర తక్కువ & బోలెడన్ని ఫీచర్స్..) ఇక కమర్షియల్ వెహికల్స్ సేల్స్ విషయానికి వస్తే, 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,93,317 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2022లో ఈ అమ్మకాలు 3,22,182 యూనిట్లు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల్లో కూడా 22 శాతం పెరుగుదల ఉంది. ఎగుమతుల విషయంలో కంపెనీ భారీ తగ్గుదలను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
టాటా రెడ్ డార్క్ ఎడిషన్స్.. అద్భుతమైన డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్లను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్స్ ఎక్కువ కాస్మెటిక్ అప్డేట్స్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, సేఫ్టీ అప్‌గ్రేడ్స్ పొందుతాయి. నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్: దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్‌లో కూడా లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి.. నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ మాన్యువల్: రూ. 12.35 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్: రూ. 13.70 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ ఆటోమాటిక్: రూ. 13.00 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్: రూ. 14.35 లక్షలు నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్: టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్, నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ (ఓ) రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 21.77 లక్షలు, రూ. 24.07 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ లో ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్: ఈ ఎడిషన్ ఆరు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు రూ. 22.61 లక్షల నుంచి రూ. 25.01 లక్షల మధ్య ఉన్నాయి. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ కూడా ADAS ఫీచర్స్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డోర్ హ్యాండిల్స్ దగ్గర, పనోరమిక్ సన్‌రూఫ్ చుట్టూ రెడ్ యాంబియంట్ లైటింగ్ పొందుతుంది. టాటా రెడ్ డార్క్ ఎడిషన్లలో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ లేదు, కావున పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండదు. 2023 ఆటో ఎక్స్పో వేదిక మీద సఫారి మరియు హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్లు మాత్రమే కనిపించాయి, అయితే కంపెనీ ఇప్పుడు నెక్సాన్ని కూడా ఈ జాబితాలోకి చేర్చింది. రెడ్ డార్క్ ఎడిషన్ కొనుగోలుపైన 3 సంవత్సరాల/1,00,000కిమీ వారంటీ పొందవచ్చు. -
కొత్త ఫీచర్లతో మెరిసిన టాటా సఫారి 2023 డార్క్ ఎడిషన్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో టాటా మోటార్స్ సఫారి, హ్యారియర్ కొత్త డార్క్ వెర్షన్లను పరిచయం చేసింది. కాస్మెటిక్ అప్డేట్లతో వీటిని ఆవిష్కరించింది. సఫారీ కొత్త వెర్షన్ స్టాండర్డ్ మోడల్‌తో పోలినప్పటికీ, ప్రతిచోటా క్రిమ్సన్ డిటైలింగ్‌తో అప్డేట్ చేసింది. రెడ్ ఫాబ్రిక్ బ్రాండ్-న్యూ సీట్లను అందించింది. ఫ్రంట్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ,డోర్ గ్రాబ్ గ్రిప్లలో ఒకటి బ్రైట్ క్రిమ్సన్ రంగులో డిజైన్ చేసింది. ముఖ్యంగా 10.25-అంగుళాల టచ్ స్క్రీన్‌తో కూడిన కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ ఫెండ్లీ ఫీచర్లు (ADAS) కూడా జోడించింది. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రియర్ కొలిషన్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, డోర్ ఓపెన్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్ హై బీమ్ అసిస్ట్ వంటి సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లున్నాయి. వీటి ధరలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. 2023 ఆటో ఎక్స్పో తొలి రోజున, టాటా మోటార్స్ ఈవీల్లో తన సత్తాను ప్రదర్శించింది. Avinya ప్రోటోటైప్ EVని , టాటా పంచ్ టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్లతో పాటు, టాటా హారియర్ EV, టాటా సియెర్రా EVలను కూడా ప్రారంభించింది. -
టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ
ఆటోమొబైల్ రంగంలో నంబర్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎస్‌యూవీకి డిమాండ్ ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నారు. ఎలాంటి రోడ్లపైనా అయినా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్ డిఫరెంట్‌గా ఉండటమే ఇందుకు కారణం. పోటీలో టాటా టాటా నుంచి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా నెక్సాన్ కారు ఉంది. అయితే దీని సగటు ధర పది లక్షలకు దగ్గర ఉంది. ఇంత కంటే తక్కువ ధరలో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్యూవీ పేరుతో టాటా హెచ్బీఎక్స్ను మార్కెట్లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఎంట్రీ లెవల్లో పోటీ టాటాలో టాప్ ఎండ్ ఎస్‌యూవీగా ఉన్న హారియర్, సఫారీ తరహా ఎక్స్టీరియర్, ఆల్ట్రోజ్ తరహా ఇంటీరియర్‌తో హెచ్బీఎక్స్ ఉండవచ్చని అంచనా. టియాగోలో ఉపయోగించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చతారని సమచారం. మొత్తంగా కారు తయారీకి సంబంధించి ఆల్ఫా ఆర్కిటెక్చర్ మోడల్ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. మారుతి ఇగ్నీస్, మహీంద్రా కేయూ 100లతో పాటు త్వరలో మార్కెట్లోకి రాబోతున్న హ్యుందాయ్ క్యాస్పర్లకు టాటా హెచ్బీఎక్స్ పోటీ విసరనుంది. It's Showtime! The most awaited SUV now has a name. Stay tuned.#TataMotors #HBX #ComingSoon pic.twitter.com/tI0bZL5ngI — Tata Motors Cars (@TataMotors_Cars) August 21, 2021 చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్..! -
మనసు దోచే ‘టాటా’ డార్క్ ఎడిషన్స్
న్యూఢిల్లీ : డార్క్ ఎడిషన్ పేరుతో సక్సెస్ఫుల్ మోడల్ కార్లకు టాటా మోటార్స్ కొత్త రూపు ఇస్తోంది. టాటా హ్యరియర్, అల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ మోడల్స్‌లో ఉన్న అన్ని వేరియంటర్లలో డార్క్ వెహికల్స్ అందుబాటులోకి తేనుంది. ధర ఎంతంటే ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం డార్క్ ఎడిషన్లకు సంబంధించి టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్ ఈవీ ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్ ధర రూ. 18.04 లక్షలుగా ఉంది. వివిధ నగరాలు, వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. డార్క్ స్పెషల్స్ ఆల్ట్రోజ్‌లో డార్క్ ఎడిషన్‌ను XZ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూ మోడల్ కాస్మో డార్క్ కలర్ స్కీంతో ఎక్స్టీరియర్ డిజైన్ చేశారు. ఎల్లాయ్ వీల్స్, క్రోమ, బ్యానెట్, ముందు భాగంలో డార్క్ ఎంబ్లమ్ అమర్చారు. ఇక ఇంటీరియర్‌కి సంబంధించి గ్రాఫైట్ బ్లాక్ థీమ్‌తో పాటు గ్లాసీ ఫినీష్ ఉన్న డ్యాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ సీట్స్ విత్ డార్క్ ఎంబ్రాయిడరీతో వచ్చేలా డిజైన్ చేశారు. నెక్సాన్ ఇలా ఇక నెక్సాన్‌లో చార్కోల్ ఎల్లాయ్ వీల్స్, సోనిక్ సిల్వర్ బెల్ట్‌లైన్, ట్రై యారో డ్యాష్‌బోర్డ్ , లెదర్ సీట్లు, డోర్ ట్రిమ్స్ అండ్ ట్రై యారో థీమ్‌తో డిజైన్ చేశారు. నెక్సాన్ ఈవీలో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్‌లో కారు బాడీకి మిడ్నైట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. సాటిన్బ్లాక బెల్ట్‌లైన్, చార్కోల్ వీల్ ఎల్లాయిస్ అందించారు. ఇంటీరియర్‌లో కూడా పూర్తిగా డార్క్ థీమ్ ఫాలో అయ్యారు. హ్యారియర్‌తో మొదలు డార్క్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా తీసుకురావడం గురించి టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మొదట హ్యారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. మేము ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. హ్యారియర్ అమ్మకాల్లో డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన స్థాయికి చేరుకుంది. దీంతో వినియోగదారుల టేస్ట్‌కి తగ్గట్టుగా మిగిలిన మోడల్స్‌లో కూడా డార్క్ ఎడిషన్స్ తీసుకురావాలని నిర్ణయించాం’ అని తెలిపారు. -
Tata Motors: టాటా మోటార్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల తన ప్యాసింజర్ వాహన శ్రేణి ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. ఎప్పటి నుంచి పెరగనున్నయో స్పష్టంగా చెప్పకున్నప్పటికి "త్వరలో" పెరగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాహన తయారీలో ఉపయోగించే ఉక్కు, విలువైన లోహాలతో సహా ఆవశ్యక ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్ల వాహన ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ధరల పెరుగుదల ఎంత అనేది రాబోయే రోజులు, వారాల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్ వంటి మోడల్స్ ను విక్రయిస్తుంది. ఆదివారం, హోండా కార్స్ ఆగస్టు నుంచి తన అన్నీ వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఉక్కు ధరలు గణనీయంగా పెరిగాయి. జూన్ ల, ప్రముఖ దేశీయ ఉక్కు తయారీదారులు హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్ సీ), కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్ సీ) ధరలను వరుసగా టన్నుకు రూ.4,000, రూ.4,900 వరకు పెంచారు. హెచ్ఆర్ సీ, సీఆర్ సీ అనేవి ఆటో, ఉపకరణాలు, నిర్మాణం వంటి పరిశ్రమల్లో ఉపయోగించే ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులు. అందువల్ల, ఉక్కు ధరల పెరుగుదల వాహనాలు, వినియోగదారు వస్తువుల, నిర్మాణ ఖర్చుల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా, రోడియం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి, ఇది ఉత్పత్తి ఖర్చును ప్రభావితం చేసింది. రోడియం, పల్లాడియంలను ఉత్ప్రేరకాలలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల వాటికి డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. -
టాటా ‘హారియర్’ విడుదల
-
టాటా ‘హారియర్’ వచ్చేసింది
ముంబై: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా హారియర్’ బుధవారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ల్యాండ్ రోవర్ డీ8 ప్లాట్‌ఫాంపై రూపొందిన ఈ సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ).. మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 6–స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సింగిల్ పవర్‌ట్రెయిన్ ఈ కారు ప్రధాన ఫీచర్లు. ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌టీ, ఎక్స్జెడ్’ మోడళ్లను హారియర్ విభాగంలో కంపెనీ విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ.12.69 లక్షల నుంచి రూ.16.25 లక్షల మధ్య ఉన్నట్లు ప్రకటించింది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా రూపొందించిన తొలి కారు ఇదేనని సంస్థ పేర్కొంది. ‘ల్యాండ్ రోవర్ డీ8 ఒమేగాఆర్కిటెక్చర్పై ఈ కారు రూపొందింది. టర్న్అరౌండ్ 2.0 ప్రణాళికలో భాగంగానే దీన్నివిడుదలచేశాం’ అని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ మాట్లాడుతూ.. వ్యాఖ్యానించారు. -
టాటా కొత్త ఎస్యూవీ ‘హారియర్’
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్’ తన కొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ‘హారియర్’ను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తున్నది ప్రకటించింది. 2019 తొలి త్రైమాసికంలో దీన్ని ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ ఈ హారియర్ ఎస్‌యూవీని జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిసి అభివృద్ధి చేస్తోంది. కాగా కంపెనీ ఆటో ఎక్స్పో 2018లో హెచ్5ఎక్స్ కాన్సెప్ట్‌తో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. స్టైల్, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్ వంటి పలు అంశాల్లో తమ భవిష్యత్ ప్రొడక్ట్ నమూనాలను ప్రతిబింబించేలా హారియర్ ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా రూపొందుతున్న తొలి వెహికల్ ఇదని పేర్కొంది. అత్యుత్తమ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను హారియర్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. తొలి కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్, కొత్త సెడాన్ టిగోర్, కాంపాక్ట్ కారు టియాగో వంటి మోడళ్లతో టాటా మోటార్స్ తిరిగి విజయపథంలోకి వచ్చింది. ల్యాండ్ రోవర్ డీ8 ఆర్కిటెక్చర్‌పై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా మోటార్స్ ఇంజనీర్లు ఈ హారియర్‌ను తయారు చేశారని కంపెనీ పేర్కొంది. ‘టర్న్అరౌండ్ 2.0 ప్రణాళిక ఫలితాలను ఇస్తోంది. వేగంగా ఎదుగుతాం. అందులో భాగంగానే హారియర్‌ను తీసుకువస్తున్నాం. దీన్ని 2019 తొలి త్రైమాసికంలో ఆవిష్కరిస్తాం. ఈ కొత్త ఎస్యూవీ ద్వారా సంస్థ బ్రాండ్ విలువ మరో స్థాయికి చేరుతుంది’ అని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ విభాగం) మయాంక్ పరీఖ్ తెలిపారు. -
యూట్యూబ్ లో 'జెట్' ల్యాండింగ్ హల్ చల్
మనిషి మెదడుకు కాస్త పదును పెడితే అద్భుతాలను ఆవిష్కరించగలడు, చరిత్రను సృష్టించగలడు అనేందుకు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఓ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బతాన్ టేకాఫ్ అవ్వడం ప్రశాంతంగానే జరిగినా... ల్యాండ్ అయ్యే సమయంలో విమానానికి ముందు చక్రాలు తెరచుకోపోవడంతో అత్యంత ఉత్కంఠతను రేపింది. సమయస్ఫూర్తితో ఓ పైలట్ జెట్ విమానాన్ని ల్యాండ్ చేసిన విధానం, చూపరులకు గగుర్పాటును కలిగేట్లు చేస్తోంది. ఎటువంటి సమస్యా లేకుండా టేకాఫ్ అయిన విమానం... ఆకాశంలోకి ఎగిరాక అనుకోని అవాంతరాలు ఏర్పడితే ఏం చేయాలో.. మెరైన్ క్రాప్స్ పైలట్ విలియమ్ మహోనీ సమయస్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. ఎవి-8బి ల్యాండింగ్ సమయంలో ఏర్పడ్డ సాంకేతిక కారణాలతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన పైలట్... సమయస్ఫూర్తితో వ్యవహరించడం పెను ప్రమాదాన్ని తప్పించింది. జెట్ యుద్ధ విమానం ఫ్రంట్ వీల్స్ తెరుచుకోవడం లేదని గమనించిన పైలట్... ఏమాత్రం భయపడకుండా... ధైర్యంగా వ్యవహరించాడు. విమానాన్ని సురక్షితంగా కిందికి దించేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ను అధికారులకు తెలిపి వారివద్ద అనుమతి తీసుకున్నాడు. నౌకపై విమానాన్ని దింపేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయించుకొన్నాడు. విభిన్నంగా స్టూల్ పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించాడు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తిని వేనోళ్ళ అభినందించారు. 2014 జూన్ నెలలో ఫైటర్ జెట్ విమానం ల్యాండింగ్ ఘటనకు సంబంధించిన అరుదైన వీడియో... ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ ఆకట్టకుంటోంది. లక్షలకొద్దీ కామెంట్లు, వేలకోద్దీ షేర్లతో హల్ చల్ చేస్తోంది.