న్యూఢిల్లీ: ఆటో ఎక్స్‌పో 2023లో టాటా మోటార్స్ సఫారి, హ్యారియర్ కొత్త డార్క్ వెర్షన్‌లను పరిచయం చేసింది. కాస్మెటిక్ అప్‌డేట్‌లతో వీటిని ఆవిష్కరించింది. సఫారీ కొత్త వెర్షన్ స్టాండర్డ్ మోడల్‌తో పోలినప్పటికీ, ప్రతిచోటా క్రిమ్సన్ డిటైలింగ్‌తో అప్‌డేట్ చేసింది. రెడ్ ఫాబ్రిక్ బ్రాండ్-న్యూ సీట్లను అందించింది. ఫ్రంట్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ,డోర్ గ్రాబ్ గ్రిప్‌లలో ఒకటి బ్రైట్ క్రిమ్సన్ రంగులో డిజైన్ చేసింది.
ముఖ్యంగా 10.25-అంగుళాల టచ్ స్క్రీన్‌తో కూడిన కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ ఫెండ్లీ ఫీచర్లు (ADAS) కూడా జోడించింది. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రియర్ కొలిషన్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, డోర్ ఓపెన్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్ హై బీమ్ అసిస్ట్ వంటి సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లున్నాయి. వీటి ధరలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
2023 ఆటో ఎక్స్‌పో తొలి రోజున, టాటా మోటార్స్ ఈవీల్లో తన సత్తాను ప్రదర్శించింది. Avinya ప్రోటోటైప్ EVని , టాటా పంచ్ టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వేరియంట్‌లతో పాటు, టాటా హారియర్ EV, టాటా సియెర్రా EVలను కూడా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment