సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు టాటా మోటార్స్ కూడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరిలో ఎంపిక చేసిన మోడల్స్, సఫారి, హారియర్, ఆల్ట్రోజ్, టిగోర్ ,టియాగోపై రూ. 75,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి కూడా తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
2023 ఫిబ్రవరి నెలకు సంబందించిన తగ్గింపులో హారియర్, సఫారి మోడల్‌కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది . ముఖ్యంగా 2022, 2023 మోడల్స్‌పై ఈ బెనిఫిట్స్‌ను అందించడం విశేషం. టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సఫారి 2023 అన్ని వేరియంట్‌లలో మొత్తం రూ. 35,000 తగ్గింపు లభ్యం. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు రూ. 25,000 విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. మరోవైపు, అమ్ముడుపోని ఎంపిక చేసిన 2022 సఫారీపై మొత్తం రూ. 75,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దాదాపు టాటా హారియర్ కార్‌పై కూడా అదే ఆఫర్ లభిస్తోంది.
టాటా హారియర్: 2023 మోడళ్లపై రూ. 35,000, 2022 మోడల్స్‌పై 75,000 వరకు తగ్గింపు
టాటా టిగోర్: కొత్త స్టాక్ 25,000 వరకు తగ్గింపు , 2022 స్టాక్ పై 35,000 వరకు తగ్గింపు
టాటా టియాగో: కొత్త స్టాక్‌పై 25,000 వరకు తగ్గింపు, 2022 స్టాక్‌పై 40,000 వరకు తగ్గింపు
Comments
Please login to add a commentAdd a comment