సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023 సమరానికి నేడు (మార్చి 31) తెరలేవనుంది. నరేంద మోదీ స్టేడియంలో 4 సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జరిగే తొలి మ్యాచ్‌తో పోరు షురూకానుంది. ఈ మేజర్ టోర్నమెంట్‌కు అధికారిక భాగస్వామిగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)తో వరుసగా ఆరవ సంవత్సరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఈవీలపై అవగాహన పెంచనుంది. గో ఈవీ అనేందుకు 100 కారణాలు అంటూ టాటా టియాగో ఈవీతో వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.
వరుసగా ఆరోసారి ఆఫీషియల్ పార్టనర్‌గా
టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌కు అధికారిక భాగస్వామిగా టియాగో ఈవీని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స ప్రకటించారు.ఈవీ సెగ్మెంట్‌లో తాము టాప్‌లో ఉన్నామని ఎఫ్‌సిబి ఉల్కా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుల్విందర్ అహ్లువాలియా తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 స్టేడియంలలో కొత్త Tiago.evని ప్రదర్శించడమే అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న క్రికెటర్‌కు ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్ టాటా టియాగో ఈవీని గిఫ్ట్‌గా ఇవ్వనుంది. దీంతోపాటు పాటు లక్షరూపాయల నగదు బహుమతిని కూడా అందివ్వనుంది.
బంతి తగిలితే రూ. 5 లక్షల విరాళం
అంతేకాదు డిప్‌ప్లేలో ఉన్న Tiago.ev కారుకు బంతి తగిలిన ప్రతిసారీ టాటా మోటార్స్ రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తుంది. కర్ణాటకలోని కాఫీ తోటల జీవవైవిధ్యాన్ని పెంపొందించేలా మొక్కల్ని పంపిణీ చేయనుంది.
మరో బంపర్ ఆఫర్ ఏంటంటే టాటా టియోగో కొనుగోలు చేసిన వారికి ఎంపిక చేసిన మ్యాచ్‌లకు టిక్కెట్‌లను అందించనుంది. అలాగే టాటా ఈవీ ఓనర్‌లు ఆన్-గ్రౌండ్‌లో కొన్ని ఉత్తేజకరమైన ఎంగేజ్‌మెంట్ కార్యకలాపాలలో భాగం పంచుకోవచ్చు. అంతేనా కొంతమంది లక్కీ ఓనర్స్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో కొందరికి అవార్డును అందించే అద్బుత అవకాశాన్ని గెలుచుకోవచ్చు.
కాగా టాటా మోటార్స్ 2018 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో నిమగ్నమై ఉంది, నెక్సాన్, హారియర్, ఆల్ట్రోజ్, సఫారి , పంచ్ లాంటి తన పాపులర్ కార్లను ప్రదర్శిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment