official
-
అమెరికాలో ఇండియన్ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో విషాదం చోటు చేసుంది. కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న (శుక్రవారం) ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మృతి చెందిన అధికారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడిచలేదు.‘‘భారత రాయబార కార్యాలయ ప్రాంణంలో 18 సెప్టెంబర్ 2024 (బుధవారం) రోజు సాయంత్రం ఓ అధికారి మరణించినట్లు మేము ధృవీకరిస్తున్నాం. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి పంపిచడానికి సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక.. కుటుంబం గోప్యత కోసం మరణించిన అధికారికి సంబంధించి అదనపు వివరాలను వెల్లడించటం లేదు. ఈ విషాద సమయంలో ఆ అధికారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.మరోవైపు.. ఈ ఘటపై స్థానిక పోలీసులు, సిక్రెట్ సర్వీస్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మ హత్య చేసుకున్నా? లేదా హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చదవండి: లెబనాన్ పేజర్ల పేలుళ్ల కేసులో కేరళ టెక్కీ ప్రమేయం! దర్యాప్తులో ఏం తేలిందంటే.. -
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం. స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్ ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు. మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు. -
మన పులులు 21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 పెద్ద పులులు ఉన్నట్టు ’స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారిక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోనే ఉన్నాయని, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఒక్క పులి కూడా శాశ్వత ఆవాసం ఏర్పరచుకోలేదని పేర్కొంది. కాగా ఈ నివేదిక చూస్తుంటే కేవలం రెండు టైగర్ రిజర్వ్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పులుల సంఖ్యనే గుర్తించినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నివేదికలో రెండున్నరేళ్ల వయసుకు పైబడిన పులుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. మొత్తంగా సవివరమైన వివరాలతో విడుదల చేసే ‘అబ్స్ట్రాక్ట్ నివేదిక’లో స్పష్టత వస్తుందనీ అది వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చునని పేర్కొంటున్నారు. తాజా నివేదికపై అధికారుల్లో చర్చ 2018లో ఉన్న 26 పులుల సంఖ్య (కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో 19, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 7) నుంచి ఇప్పుడు గణనీయంగా పులుల సంఖ్య పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తూ వచ్చారు. అయితే నివేదిక అందుకు భిన్నంగా రావడంపై రాష్ట్ర అటవీశాఖ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాల్లోనే కాకుండా టైగర్ కారిడార్లు, బఫర్ జోన్లు ఇతర ప్రాంతాలు కలిపితే 28 దాకా పెద్ద పులులు, దాదాపు పది దాకా పులి పిల్లలు ఉండొచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు. కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రాంతాల్లో పులి పాదముద్రలు రికార్డ్ అయ్యాయని, టైగర్ కారిడార్ ఏరియాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, ఇతర ప్రాంతాల్లోనూ వీటి జాడలున్నాయని తెలిపారు. అక్కడ పులుల సంఖ్యలో వృద్ధికి సంబంధించి తాము క్షేత్రస్థాయిలో కెమెరా ట్రాపులు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ అంచనాకు వచి్చనట్టుగా ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ ద్వారా సత్ఫలితాలు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ ములుగులో ఘనంగా రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవం ములుగు (గజ్వేల్): దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెంపుదల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్)ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ)లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో పులుల సంఖ్య 3,167కు పెరిందని తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగిందన్నారు. పులులను మనం కాపాడితే అడవిని, తద్వారా మానవాళిని కాపాడుతాయన్నారు. రానున్న రోజులలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ములుగు ఎఫ్సీఆర్ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
విడాకులు తీసుకున్న బుల్లితెర నటి.. భర్త పోస్ట్ వైరల్!
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చివరికీ విడిపోయేందుకే మొగ్గుచూపారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ జంట మనస్పర్థలతో గతేడాది డిసెంబరులో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్) తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో తమ కుమార్తె కోసం స్నేహపూర్వకంగా ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని రాజీవ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు రాజీవ్ సేన్. 'మేము ఒకరికొకరు వీడిపోయినా కుడా మా ప్రేమ అలాగే ఉంటుంది. మేము ఎల్లప్పుడూ మా కుమార్తెకు అమ్మ, నాన్నాలాగే ఉంటాం.' అంటూ పోస్ట్ చేశారు. దీనిపై ఇంకా చారు అసోపా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఈ జంట జూన్ 9, 2019న గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు మొదటి బిడ్డను స్వాగతించారు. తమ కుమార్తెకు జియానా అని పేరు పెట్టారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023 సమరానికి నేడు (మార్చి 31) తెరలేవనుంది. నరేంద మోదీ స్టేడియంలో 4 సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జరిగే తొలి మ్యాచ్‌తో పోరు షురూకానుంది. ఈ మేజర్ టోర్నమెంట్‌కు అధికారిక భాగస్వామిగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)తో వరుసగా ఆరవ సంవత్సరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఈవీలపై అవగాహన పెంచనుంది. గో ఈవీ అనేందుకు 100 కారణాలు అంటూ టాటా టియాగో ఈవీతో వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. వరుసగా ఆరోసారి ఆఫీషియల్ పార్టనర్‌గా టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌కు అధికారిక భాగస్వామిగా టియాగో ఈవీని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స ప్రకటించారు.ఈవీ సెగ్మెంట్లో తాము టాప్‌లో ఉన్నామని ఎఫ్సిబి ఉల్కా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుల్విందర్ అహ్లువాలియా తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 స్టేడియంలలో కొత్త Tiago.evని ప్రదర్శించడమే అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న క్రికెటర్‌కు ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్ టాటా టియాగో ఈవీని గిఫ్ట్‌గా ఇవ్వనుంది. దీంతోపాటు పాటు లక్షరూపాయల నగదు బహుమతిని కూడా అందివ్వనుంది. బంతి తగిలితే రూ. 5 లక్షల విరాళం అంతేకాదు డిప్ప్లేలో ఉన్న Tiago.ev కారుకు బంతి తగిలిన ప్రతిసారీ టాటా మోటార్స్ రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తుంది. కర్ణాటకలోని కాఫీ తోటల జీవవైవిధ్యాన్ని పెంపొందించేలా మొక్కల్ని పంపిణీ చేయనుంది. మరో బంపర్ ఆఫర్ ఏంటంటే టాటా టియోగో కొనుగోలు చేసిన వారికి ఎంపిక చేసిన మ్యాచ్‌లకు టిక్కెట్లను అందించనుంది. అలాగే టాటా ఈవీ ఓనర్లు ఆన్-గ్రౌండ్లో కొన్ని ఉత్తేజకరమైన ఎంగేజ్మెంట్ కార్యకలాపాలలో భాగం పంచుకోవచ్చు. అంతేనా కొంతమంది లక్కీ ఓనర్స్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో కొందరికి అవార్డును అందించే అద్బుత అవకాశాన్ని గెలుచుకోవచ్చు. కాగా టాటా మోటార్స్ 2018 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో నిమగ్నమై ఉంది, నెక్సాన్, హారియర్, ఆల్ట్రోజ్, సఫారి , పంచ్ లాంటి తన పాపులర్ కార్లను ప్రదర్శిస్తోంది. -
భారత్ అగ్రరాజ్యానికి మిత్ర పక్షం కాదు..వైట్‌హౌస్ అధికారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్ అగ్రరాజ్యానికి మిత్రపక్షంగా ఉండబోదంటూ వైట్‌హౌస్ ఉన్నతాధికారి కర్ట్ క్యాంప్‌బెల్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా..భారత్ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్, అమెరికాకు మిత్రపక్షంగా ఉండదని, ఒక గొప్ప శక్తిగా ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతంగా వేగంగా ఏర్పడ్డాయని అన్నారు. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని కూడా చెప్పారు. అలాగే అమెరికా తన సామర్ధ్యానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, సాంకేతికంగా ఇతర సమస్యలపై కలిసి పనిచేయడం ద్వారా ప్రజలతో సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదీగాక ఇరు దేశాల్లోని కేంద్రీకృత ప్రభుత్వ విధానాల్లో పలు సవాళ్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఇరు దేశాలు కలిసి పనిచేసే అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అంతరిక్షం, విద్య, వాతావరణం, సాంకేతికత తదితర వాటిల్లో ఇరు దేశాలు సమన్వయంగా ముందుకు సాగాలని చెప్పారు. అలాగే భారత్ అమెరికా సంబంధాలు కేవలం చైనా చుట్టూ ఉన్న ఆందోళనలతో ఏర్పడలేదని నొక్కి చెప్పారు. వనరులు అధికంగా ఉన్న బీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు ఏర్పరచి సైనిక స్థావరాలను నిర్మించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా క్యాంప్‌బెల్ ప్రస్తావించారు. ఈ విషయంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం తదితర దేశాలు చైనాను తప్పుపట్టాయన్నారు. చైనాకు జపాన్‌తో కూడా ప్రాదేశిక వివాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం గురించి మోదీతో చర్చించినప్పుడూ చైనా తన ప్రయోజనాల కోసం నిర్మించుకున్నారంటూ... కొట్టిపారేశారని చెప్పారు. కాగా, బైడెన్ తన పరిపాలను క్వాడ్ లీడర్ స్థాయికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి (ఆంథోనీ) అల్బనీస్ 2023లో ఒక ప్రధాన క్వాడ్ సమావేశానికి అమెరికాను ఆహ్వానించిన సంగతిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్వాడ్ సమావేశం నాలుగు కీలక దేశాల మధ్య సమన్వయ సహకారాన్ని చాలా స్ట్రాంగ్‌గా బలోపేతం చేస్తోందని క్యాంప్‌బెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన జీన్ పియర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...భారత్, యునైటెడ్ స్టేల్స్‌ల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. జీ20లో భారత్ నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడమే గాక భారత్‌తో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా, లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారతదేశంలోని యుఎస్ రాయబారిగా నియమించాలని బైడెన్ పరిపాలన చూస్తున్నట్లు కూడా జీన్ పియర్ తెలిపారు. (చదవండి: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్) -
అధికారి గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
-
Queen Elizabeth II: మహారాణి రాయల్ డ్యూటీస్ కుదింపు
లండన్: ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ అనుభవించనంత వైభవాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు మహారాణి క్వీన్ ఎలిజబెత్. ఎంతలా అంటే.. బ్రిటన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. రాజకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. రాజకుటుంబం తరపున తప్పనిసరిగా ఆమె హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ఇక నుంచి ఆమె దూరంగా ఉండనున్నారు. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా... వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ... తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. -
మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: విచారణ పేరుతో వ్యాపారవేత్త భార్యను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో అయిదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో తనను అక్రమంగా నిర్బంధించారని మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. హైరదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు 2019లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే సోదాల సమయంలో శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డని అధికారులు అక్రమంగా నిర్బంధించారు. ఫిబ్రవరి 27, 2019 రోజున తనను సెర్చ్ ఆపరేషన్ పేరుతో అధికారులు నిర్బంధించారని జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. అయిదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, శ్రీనివాస్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బొల్లినేని గాంధీ , చిలక సుధా సస్పెన్షన్‌లో ఉన్నారు. చదవండి: దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం! -
చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు
Karate Kalyani Summoned By Officials Over Child Adoption: సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రాంక్ పేరుతో ఆసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌పై కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం కొసమెరుపు. ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిందా?.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనేది తెలియల్సి ఉంది. చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్! మరోవైపు కరాటే కల్యాణి ఓ చిన్నారి దత్తత వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆమెకు గతంలో నోటిసులు ఇచ్చినట్లు తాజాగా అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఆమె ఆ నోటీసులకు స్పందించలేదని, తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేడు సోమవారం(మే 16) ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రేపటి వరకు ఆమె ఈ నోటీసులపై స్పందించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది? పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని, దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా వెళితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు. కాగా కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా రీసెంట్గా శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి కూడా ఉన్న విషయం తెలిసిందే. -
అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాపై ముడుపుల ఆరోపణల కేసుకు సంబంధించి అరెస్టయిన దేవేందర్ కుమార్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ రూ 50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేశారు. తనను నిర్బంధించడం అక్రమమని, తనకు విముక్తి కల్పించాలని కోరుతూ కుమార్ ఢిల్లీ కోర్టులో బెయిల్ దరఖాస్తులో పేర్కొన్నారు. బెయిల్ ఇచ్చే క్రమంలో తనకు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని కూడా కుమార్ కోర్టుకు నివేదించారు. కాగా తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధతను కుమార్, ఆస్ధానాలు ఇప్పటికే న్యాయస్ధానంలో సవాల్ చేశారు. ఈ కేసులో వీరితో పాటు మనోజ్ ప్రసాద్, సోమేష్ ప్రసాద్‌లను సైతం నిందితులుగా చేర్చారు. మరో కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు కుమార్ ప్రయత్నించాడని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. సీబీఐలో సీనియర్ అధికారుల మధ్య వివాదంలో తనను ఇరికించడంతో తాను బాధితుడు అయ్యానని కుమార్ పేర్కొన్నారు. -
స్మార్ట్ ఫోన్ ఉంటేనే ‘నివేదన’
మల్దకల్ : నివేదన, స్పందన యాప్‌లకు అందరు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎంపీడీఓ గోవిందరావు వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ సమావేశ హాల్లో అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్‌శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు నివేదన, స్పందన యాప్‌లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ ఇటీవలే ప్రారంభించిన నివేదన, స్పందన యాప్‌లను అందరు తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ప్రజలు పంపిన ఫిర్యాదులకు సమాధానాలు వారం రోజుల్లో పంపించాల్సి ఉంటుందని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. స్మార్ట్ఫోన్లు లేవనే సాకుతో ఫిర్యాదులకు స్పందించని అధికారులపై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. సూపరింటెండెంట్ రాజారమేష్, జూనియర్ అసిస్టెంట్ సూర్యప్రకాష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు మల్లేశ్వర్రావు, శ్రీలత, జ్యోతి, మాణిక్యరాజ్, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
లేదంటే టీఆర్ఎస్కు కాంగ్రెస్ గతే: డాక్టర్ లక్ష్మణ్
అధికారికంగా ‘సెప్టెంబర్ 17’ ఉత్సవాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిన సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించకుంటే టీఆర్ఎస్ సర్కార్‌కు, సీఎం కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే నైతికహక్కు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 ఉత్సవాలను నిర్వహించకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆర్ఎస్కు కూడా పడుతుందన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను కించపరిచే విధంగా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత మాట్లాడుతున్నారని, దీనిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సమైక్య రాష్ర్టంలో అప్పటి తెలంగాణ మంత్రులను డిమాండ్ చేసిన విషయం కేసీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించా రు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ వీడియో ప్రసంగాల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. శనివారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్వహించే చాకలి ఐలమ్మ వర్ధంతికి కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి హాజరవుతారని లక్ష్మణ్ తెలిపారు. -
కేంద్రమే ఉత్తర్వులివ్వాలి
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంపై సుద్దాల అశోక్‌తేజ సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ సూచించారు. ఒక దసరా, ఒక సంక్రాంతి లాగా నరకాసుర వధ అనంతరం కొత్త దీపావళి మాదిరిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ మీడియా సెల్ నిర్వహించిన ‘తెలంగాణ విమోచనదినం జ్ఞాపకాలు’ సదస్సులో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నవారు, ఆయా కుటుంబాలకు చెందిన వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఇందులో అశోక్‌తేజ పాల్గొన్నారు. నిజాం పాలనలోనే చైన్ స్నాచింగ్‌లు జరిగాయని, విలీనం రోజు నిజాం నివాసం నుంచి లారీల నిండా మహిళల పుస్తెలు, మట్టెలు తరలి వెళ్లాయని కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఒకవైపు కొమురంభీమ్, మరోవైపు నిజాంలను కీర్తిం చడం టీఆర్ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అ న్నారు. నాటి పోరాటంలో కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డికొమురయ్య వంటి వారిని స్మరించుకోవడం కూడా రాజకీయం చేస్తున్నవారికి తెలంగాణ సమాజమే సరైన సమాధానం చెబుతుందన్నారు. బీజేపీ కార్యక్రమాలు హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి కాదని సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. నీతిలేని నిజాంకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు కూడా నీతి లేద ని సీనియర్‌నేత పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. వెల్చాల కొండలరావు తదిత రులు పాల్గొన్నారు. -
కలెక్టర్ చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే
-
డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే
ముంబయి: మహారాష్ట్రలో ఓ ప్రజా ప్రతినిధి డిప్యూటీ కలెక్టర్‌పై చేయి చేసుకున్నాడు. ఆయన చెంప చెల్లు మనిపించారు. ఓ ఆయిల్ పైప్ లైన్ వేయడంతో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయమై డిప్యూటీ కలెక్టర్ అభయ్ కల్ గుద్కర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ హాజరయ్యారు. ఇదే సమయంలో నష్టపరిహారం అంశంపై చర్చిస్తుండగా వాదోపవాదాలు తలెత్తాయి. భూమికి నష్టంగా భూమే ఇవ్వాలని పలువురు రైతులు పట్టుబట్టారు. ఈ క్రమంలో తోపులాట జరగగా అదే సమావేశంలో ఉన్న సురేశ్ లాడ్ గబాల్లున లేచి డిప్యూటీ కలెక్టర్, మరో అధికారిని చొక్కాలు పట్టి దగ్గరకు లాగి గట్టిగా చెంపలు వాయించాడు. అయితే, దీనిపై సదరు అధికారిగానీ, ఇతర అధికారులుగానీ ఫిర్యాదు చేయలేదు. కాగా, ఈ ఘటనపై స్పందన కోరగా సురేశ్ లాడ్ కొట్టిపారేశారు. -
ఎరువుల కుంభకోణంపై ముగిసిన విచారణ
అనంతపురం అగ్రికల్చర్: ఎరువుల కుంభకోణంపై కమిషనరేట్‌కు చెందిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తీ చేసింది. అడిషినల్ డైరెక్టర్ వినయచంద్, డీడీఏ భగవత్‌స్వరూప్, ఏడీఏ ప్రసాద్‌లతో కూడిన విచారణ బృందం మూడో రోజు బుధవారం తమ పని పూర్తీ చేసుకుని అమరావతికి బయలుదేరి వెళ్లింది. మూడో రోజు అవంతివేర్‌హౌస్ గోడౌన్, బాలాజీ గోడౌన్లతో ఎరువుల నిల్వలు, రిజిష్టర్లు తనిఖీలు చేశారు. కొన్ని రికార్డులను జిరాక్స్ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం స్థానిక మార్కెట్‌యార్డు ప్రాంగణంలో ఉన్న అనంతపురం డివిజన్ ఏడీ కార్యాలయానికి వెళ్లి అక్కడ సస్పెన్షన్‌లో ఉన్న ఏడీఏ రవికుమార్‌ను పిలిపించి విచారించారు. తర్వాత వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని కలిసి వివరాలు సేకరించారు. అలాగే సస్పెన్షన్‌లో ఉన్న ఏడీఏ (పీపీ) కె.మల్లికార్జునను పలిపించి విచారించి వారి వాంగ్మూలం తీసుకున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత మూడు రోజులుగా వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ కార్యాలయాల్లో ఎరువుల సరఫరా, కేటాయింపులు, నిల్వలు, అమ్మకాల రిజిష్టర్లు తనిఖీ చేయడంతో పాటు సెంట్రల్ వేర్‌హౌస్, అవంతి వేర్‌హౌస్ గోడౌన్లు, శిరిగుప్ప, బాలాజీ హోల్‌సేల్ డీలర్లకు చెందిన దుకాణాలను పరిశీలించారు. అలాగే భాస్కర్ ఫర్టిలైజర్స్, రేణుకా ఫర్టిలైజర్స్ మిక్సింగ్ ప్లాంట్లలో కూడా సోదాలు నిర్వహించి అవసరమైన వాటికి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. క్రిబ్‌కోతో పాటు మిగతా ఎరువుల కంపెనీలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లను కూడా పిలిపించి గత మూడు నెలల వివరాలు సేకరించారు. చివరగా ముగ్గురు అధికారుల నుంచి వివరాలు తీసుకుని విచారణ ముగించారు. మూడు రోజుల విచారణకు సంబంధించి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు. -
ఫోన్ కాల్‌తో రూ. 25 వేలు మాయం
బ్యాంకు అధికారినంటూ మోసం దుబ్బాక: ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 25 వేలు మాయమైన సంఘటన మండలంలోని రఘోత్తంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల నర్సవ్వ–ఆంజనేయులు దంపతుల కుమారుడు మురళికి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 7546922653 మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం లాకవుతోంది. మీ ఏటీఎం పిన్, బార్ కోడ్, ఆధార్ నెంబర్ చెబితే లాకవుతోన్న ఏటీఎంను సరి చేస్తామని చెప్పడంతో ఆ యువకుడు నమ్మాడు. బ్యాంకు అధికారి అడిగిన నంబర్లు చకచకా చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన యువకుడు గురువారం తన ఎస్బీహెచ్ దుబ్బాక శాఖలోని ఎస్బీ అకౌంట్లో డబ్బులను సరిచూసుకోగా అందులో నుంచి రూ. 25 వేలు డ్రా చేసినట్లు ఉంది. డ్రా చేసిన డబ్బులు కూడా ఏటీఎం ద్వారా ఒకే రోజు ఆరు సార్లు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో కంగుతిన్న యువకుడు లబోదిబోమంటూ బ్యాంకు అధికారుల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. -
ఆ క్రూరుడికి జీవితఖైదు
కల్బుర్గి: 14 ఏళ్ల బాలికను పదేళ్ల పాటు రేప్ చేసిన కిరాతకుడికి బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 5 వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. నేరస్తుడి ఆస్తులను జప్తు చేసి బాధితురాలికి రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. 2002లో ఆరుద్ పట్టణ ప్రైమరీ స్కూల్ చైర్మన్ గా ఉన్న మారుతి అమ్రేప్ప తారే ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిని వేధించడం ప్రారంభించాడు. అప్పటికే ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మారుతి చిన్నారిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను కోరగా వారు చదువు మాన్పించి, మంగుళూరులో చదువుకోవడానికి పంపేశారు. మంగుళూరు వెళ్లిన మారుతి ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి తన ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు. ఆయనను కూతురు కూడా ఇష్టపడుతుందేమోనని అనుకున్న తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు. అప్పటి నుంచి బాలిక తొమ్మిది సార్లు గర్భవతి అయిన ఆమెకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. తొమ్మిదో సారి వారి ఇద్దరికి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మారుతి బిడ్డను ఉదయగిరిలోని ఆశ్రమంలో వదిలేసి వచ్చాడు. 2012లో ఆమె మరలా గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. దాన్ని వ్యతిరేకించిన ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో తల్లిదండ్రులను ఆశ్రయించిన ఆమె ఆరుద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ కుమార్ హంచాటే నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
వాట్పాప్ సందేశమే ఆదుకుంటోంది..
షిమ్లా: జమ్ము కశ్మీర్ పర్వతాల్లో చిక్కుకున్న ఓ పర్వతాహకుడ్ని వాట్సాప్ సందేశం ఆదుకుంది. ఆపద నుంచి కాపాడబోతోంది. కార్గిల్ సమీపంలో జానస్కార్ లోని ఉమాసి పాస్ పరిసర ప్రాంతంలో చిక్కుకుపోయిన టెక్కర్ రిజుల్ గిల్ రక్షించేందుకు ప్రభుత్వం, సైన్యం పాటుపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ప్రాంతానికి చెందిన గిల్ అనే పర్వతారోహకుడు అనూహ్యంగా ఆపదలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అరుణ్ శర్మకి సమాచారం అందించాడు. దీంతో అరుణ్ దీన్ని వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా టెక్కర్ రిజుల్ గిల్ ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ రాజేష్ కన్వార్ తెలిపారు. తీవ్ర గాయాలపాలయ్యాడన్న సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యామని, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, సైన్యం సహాయంతో అతన్ని అక్కణ్నించి రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రెక్కర్ ను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్ కోసం కార్గిల్ అధికారులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందర్లోనే అతణ్ని వెనక్కి తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తన మిత్రుడు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికే నాలుగురోజులైందని, ఇక రెండు రోజులకు సరపడా ఆహారం మాత్రమే అతడి దగ్గర ఉందని గిల్ స్నేహితుడు అరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
కడపలో ఐటీ దాడులు
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని పలువురు ఫైనాన్షియర్లు, వ్యాపారస్తుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని నాలుగు చోట్ల దాడులు నిర్వహించారు. చిన్నచౌకు పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఫైనాన్షియర్ మధుసూదన్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. అలాగే ఎర్రముక్కపల్లె పీఎఫ్ క్వార్టర్స్ ఎదురు రోడ్డులో నివసిస్తున్న ఫైనాన్షియర్ శ్రీనివాసులుతో పాటు ఓ వ్యాపారి ఇంటిలో తనిఖీలు చేశారు. భైరవ ట్రాన్స్‌పోర్టు యజమాని మహేంద్రారెడ్డికి సంబంధించిన ఆస్తులపై కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఎందుకు నిర్వహించింది ఐటీ దాడుల బృందం స్పష్టంగా తెలపడం లేదు. ఉన్నతాధికారులకు నివేదిక తెలియజేస్తామని సమాధానం దాటవేశారు. ఈ దాడుల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం.