డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే
ముంబయి: మహారాష్ట్రలో ఓ ప్రజా ప్రతినిధి డిప్యూటీ కలెక్టర్పై చేయి చేసుకున్నాడు. ఆయన చెంప చెల్లు మనిపించారు. ఓ ఆయిల్ పైప్ లైన్ వేయడంతో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయమై డిప్యూటీ కలెక్టర్ అభయ్ కల్ గుద్కర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ హాజరయ్యారు.
ఇదే సమయంలో నష్టపరిహారం అంశంపై చర్చిస్తుండగా వాదోపవాదాలు తలెత్తాయి. భూమికి నష్టంగా భూమే ఇవ్వాలని పలువురు రైతులు పట్టుబట్టారు. ఈ క్రమంలో తోపులాట జరగగా అదే సమావేశంలో ఉన్న సురేశ్ లాడ్ గబాల్లున లేచి డిప్యూటీ కలెక్టర్, మరో అధికారిని చొక్కాలు పట్టి దగ్గరకు లాగి గట్టిగా చెంపలు వాయించాడు. అయితే, దీనిపై సదరు అధికారిగానీ, ఇతర అధికారులుగానీ ఫిర్యాదు చేయలేదు. కాగా, ఈ ఘటనపై స్పందన కోరగా సురేశ్ లాడ్ కొట్టిపారేశారు.