
నివేదన యాప్‌పై అవగాహన కల్పిస్తున్న ఎంపీడీఓ గోవిందరావు
మల్దకల్ : నివేదన, స్పందన యాప్‌లకు అందరు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎంపీడీఓ గోవిందరావు వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ సమావేశ హాల్‌లో అంగన్‌వాడీ, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్‌శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు నివేదన, స్పందన యాప్‌లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ ఇటీవలే ప్రారంభించిన నివేదన, స్పందన యాప్‌లను అందరు తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ప్రజలు పంపిన ఫిర్యాదులకు సమాధానాలు వారం రోజుల్లో పంపించాల్సి ఉంటుందని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. స్మార్ట్‌ఫోన్లు లేవనే సాకుతో ఫిర్యాదులకు స్పందించని అధికారులపై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. సూపరింటెండెంట్ రాజారమేష్, జూనియర్ అసిస్టెంట్ సూర్యప్రకాష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు మల్లేశ్వర్‌రావు, శ్రీలత, జ్యోతి, మాణిక్యరాజ్, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment