గద్వాల క్రైం : ‘సార్! కొత్త బస్టాండ్ వద్ద బైక్ నిలిపి పక్కనే ఉన్న దుకాణంలో మందులు తీసుకుని వచ్చేసరికి అక్కడ వాహనం కనిపించలేదు..’ ‘అయ్యా! ఇంట్లో దొంగలు చొరబడి విలువైన వస్తువులు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు...’ మరో బాధితుడు. ‘ఓ సారో..ఒక్కగానొక్క కుమార్తె రెండు రోజులుగా కనిపించడం లేదు, యాడికి బోయిందో తెలియదు, ఎలాగైనా నా బిడ్డ ఆచూకీ తెలుసుకుని అప్పగించండి..’ అంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు.. సదరు ఎస్‌ఐ సరే.. సరే రెండు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాం.. అం టూ సమాధానం వస్తుంది. ఇక కేసు దర్యాప్తులో భా గంగా సీసీ కెమెరాల కంట్రోల్ విభాగంలోని పర్యవేక్షకుడు వద్దకు సమాచారం.. సిబ్బంది గంటల తరబడి అక్కడే ఉండి అన్ని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా క్షుణంగా గుర్తించి నిందితులను ఛేదించి బాధితులకు న్యాయం చేస్తారు.. సార్! గాంధీచౌక్‌లో ట్రాఫిక్ జాం అయింది.
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు..’ అంటూ ఓ వాహనదారుడు ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తాడు.. ఇలాం టి తరుణంలో సీసీ కెమెరాల పర్యేవేక్షకుడి సాయం కోసం అక్కడ సమస్యపై కంట్రోలర్ విభాగానికి ఫోన్ చేసి ఎంత మేర ట్రాఫిక్ జాం అయిందని వెంటనే కంట్రోల్ రూంకు వెళ్లి సూచనలు ఇవ్వు.. ఉన్నతాధికారులు సీసీ కెమెరాల మానిటర్‌కు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన మొబైల్‌లో ఇంటర్నెట్ లింకు ఆధారంగా నిక్షిప్తం చేసుకున్నది అనుసంధానమై నేరుగా సీసీ కంట్రోలర్ సిబ్బంది ఉన్న చోటు నుంచి సమస్యలపై నేరుగా చూసి చెప్పవచ్చు. ఇలా జిల్లాలో పోలీసు శాఖ టెక్నాలజీని వినియోగించడంలో ముందుంది.
జిల్లా కేంద్రంలో 55సీసీ కెమెరాలు
గద్వాల పట్టణంలోని 55సీసీ కెమెరాల దృశ్యమాలికలను మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా చూసుకునేలా సాంకేతిక విప్లవంతో నాంది పలికింది. సీసీ కెమెరాల విభాగంలో పర్యవేక్షకుడు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలోనూ అరచేతిలో ఉన్న మొబైల్ సాయంతో ఏ ప్రాంతంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు తతెత్తినప్పుడు వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. ఇక సీసీ కెమెరాల విభాగం సీఐ కార్యాలయంలోని ప్రత్యేక భవనంలో పర్యవేక్షకుడు నిత్యం మానిటరింగ్ చేస్తూ పట్టణంలో జరిగిన పలు సంఘటనలపై దృష్టి సారించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారు.
పరుగులకు చెక్
పట్టణంలో అనుమానాస్పదంగా గుర్తు తెలియని నిందితులు ఉన్నట్లు సమాచారం వస్తే ఉన్నతాధికారులు గతంలో వెంటనే సీసీ కెమెరాల కంట్రోలర్‌కు సమాచారం అందించేవారు. అయితే సిబ్బంది భోజనం సమయం కావడంతో బయటకు వెళతారు. ఈ క్రమంలో తిరిగి కార్యాలయానికి రావడంలో అలస్యమవుతుంది. ఇక నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని మరోచోట ప్రత్యక్షమవుతారు. సిబ్బంది సైతం కార్యాలయానికి పరుగులు తీస్తారు. ఈలోపు నిందింతులు సునాయసంగా చేజారిపోతారు. ఇలాంటి వాటికి కొత్త విధానంతో చెక్ పెట్టినట్టే. సిబ్బంది ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ లింకు ఆధారంగా తన అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిందితులు ఎటు వెళ్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయొచ్చు. దీంతో నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షణాల్లో కేసులను ఛేదించి బాధితులకు ఊరట కల్పించవచ్చు.
సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజ
కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో జిల్లా పోలీసు శాఖ ముందంజలో ఉంది. ఇదే విషయమై ఇటీటల పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం, డీజీపీ సైతం ఎస్పీ విజయ్‌కుమార్‌ను అభినందించారు. ఇక మొబైల్ యాప్‌కు సంబంధించి ఇంటర్నెట్ లింకు ద్వారా కెమెరాల అనుసంధానంతో పట్టణంలో మరింత నిఘా పెట్టేందుకు వివిధ సీసీ కెమెరాల పాయింట్లు వీక్షించే సిబ్బందికి ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణకు పంపించి ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రోత్సహించారు. శాంతిæభద్రతల పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు పోలీసులంటే జావాబుదారీగా ఉండాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సిబ్బంది పెట్రోలింగ్, ట్రాఫిక్ తదితర విధులను ఎంత మేర చేస్తున్నారో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఎక్కడ ఏం జరిగినా ఈ కొత్త పరిజ్ఞానంతో చెక్ పెట్టొచ్చంటున్నారు.
నిరంతర నిఘా
జిల్లాలో విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని నిలువరించి ప్రజలకు జావాబుదారీగా ఉండాలనేది మా సంకల్పం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ కేసులు, సమస్యలను ఎక్కడి నుంచైనా సులువుగా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాప్‌తో సీసీ కెమెరాలను సిబ్బంది పరిశీలించి తగు వివరాలను ఉన్నతాధికారులకు సమాచారం అంది స్తారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవుతారు.
– ఎస్.ఎం.విజయ్‌కుమార్, ఎస్పీ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment