
అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీటీవీ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను వేధింపులు గురిచేశాడు ఓ యువకుడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
బాలికతో సదరు యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలు విషయం చెప్పడంతో.. సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు ఆమె బంధువులు. ఆపై వేధింపులపై అతన్ని నిలదీస్తూ.. చితకబాదారు. చివరకు పోలీసులకు అప్పగించారు.