SR nagar
-
నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!
హైదరాబాద్(Hyderabad) నగర వీధుల్లో చలికి గజగజ వణుకుతూ ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, నిర్భాగ్యుల((Homeless People)ను ఆదుకునేందుకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి(Aster Prime Hospital) నర్సులు(Nurses) సహృదయంతో ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వీధుల్లో ఉంటున్న సుమారు 50 మంది నిరుపేదలకు రగ్గులు పంచిపెట్టారు. సుమారు 120 మంది నర్సులు తాము సంపాదించిన దాంట్లోంచి తలా కొంత వేసుకుని ఈ రగ్గులు కొని, వీధుల్లో ఉంటున్నవారికి ఉచితంగా పంచిపెట్టారు. ప్రతిరోజూ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న ఏంజెల్ నర్సులు ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని తలపెట్టి, నిరుపేదలను చలి నుంచి రక్షించేందుకు రగ్గులు పంచాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ రోడ్లపై ఉంటున్న 50 మందికి ఈ రగ్గులు అందించారు. ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లిండామోల్ జోయ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా ఏదో ఒక సంబరాలు చేసుకుంటామని, ఈసారి అలా కాకుండా.. పేదలను ఆదుకోవడానికి ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. వెంటనే తమ నర్సింగ్ గ్రూపులో పోస్ట్ చేయగా, ఏంజెల్ నర్సులు అంతా ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేశారన్నారు. వచ్చే ఏడాది కూడా మరింత మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. నర్స్ ఎడ్యుకేటర్ రాహుల్ కమర్ మాట్లాడుతూ..అన్నీ ఉన్న మనమే చలిని తట్టుకోలేకపోతున్నామని.. అలాంటిది కనీసం గూడు కూడా లేకుండా నడివీధిలో పడుకుంటున్న నిర్భాగ్యులను చూసి తామంతా చలించిపోయామని అన్నారు.అందుకే ఈసారి వీరికి చలిని తట్టుకునేందుకు వీలుగా రగ్గులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సిబ్బంది నిరుపేదలను ఆదుకునేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తారని తెలిపారు.(చదవండి: చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఆఫర్ ..!) -
బాయ్స్ హాస్టల్ లో డ్రగ్స్
-
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
-
మద్యం మత్తులో బండరాళ్లతో వ్యక్తిపై దాడి
-
Hyd: సీసీటీవీలో అసభ్యప్రవర్తన.. చితకబాదేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను వేధింపులు గురిచేశాడు ఓ యువకుడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికతో సదరు యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలు విషయం చెప్పడంతో.. సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు ఆమె బంధువులు. ఆపై వేధింపులపై అతన్ని నిలదీస్తూ.. చితకబాదారు. చివరకు పోలీసులకు అప్పగించారు. -
మార్కులు తక్కువొచ్చాయని తల్లి మందలింపు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు..వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అసిత్ కుమార్ డెరియ భార్య, పిల్లలతో కలిసి సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లో డెక్కన్ సెరాయి హోటల్లో పనిచేసే కుమార్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు బోనాశ్రీ డెరియ (19) గురువారం ఉదయం కేఎల్ఎన్వై పార్కులో వాకింగ్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. మార్కులు తక్కువగా ఎందుకు వచ్చాయని తల్లి మందలించి ఆమె కూడా వాకింగ్‌కు వెళ్లి పోయింది. తిరిగి తల్లి ఇంటికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. తలుపులు ఎంత సేపు తట్టినా లోపల నుండి సమాధానం రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా బోనాశ్రీ సీలింగ్ వ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్‌దే -
Hyderabad: ఉద్యోగం ఇప్పిస్తానని.. యువతిని ఓయో హోటల్‌కు తీసుకెళ్లి..
సాక్షి, అమీర్‌పేట: ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి చైతన్యపురి కాలనీలో ఉంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి టెలీకాలర్‌గా పని చేస్తోంది. సదరు యువతి ఫోన్ నెంబర్ సంపాదించిన సిద్ధార్థరెడ్డి అనే యువకుడు ఆమెకు ఫోన్ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.18 వేల వేతనం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నెల 9న కారులో దిల్సుఖ్నగర్ వెళ్లి యువతిని తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గమధ్యలో ఫొటోలు, గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలు తీసుకున్నాడు. ఎర్రగడ్డలోని ఓయోలో ఓ గదిని తీసుకుని అందులో దింపాడు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి హోటల్‌కు ఎందుకు తీసుకువచ్చావని ప్రశ్నించగా నియామకపత్రం రావడానికి ఆలస్యమవుతుందని, రాత్రి భోజనం చేశాక నియామకపత్రంతో పాటు కొన్ని డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం చేసి జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. హోటల్ నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన యువతి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి చైతన్యపురి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు. చదవండి: తొమ్మిది పేజీల సూసైడ్ నోట్.. ఎనిమిది నెలలుగా లైంగిక సంబంధం.. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రెండేళ్లు కలిసి తిరిగాక..
సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడకు చెందిన తెన్నేటి భార్గవ్ హైటెక్ సిటీలోని ఐను ఆస్పత్రిలో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఉప్పలపాడుకు చెందిన 26 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సదరు యువతి వద్దకు తరచూ వెళ్లే వాడు. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. రెండేళ్ల నుంచి వీరు ఇద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో భార్గవ్ ముఖం చాటేయడంతో యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
అమీర్‌పేట: బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి..
సాక్షి, అమీర్‌పేట: బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేలోగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ రాజీవ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సాయినివాస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 301లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లక్ష్మి కుమారి నివాసం ఉంటోంది. ప్రకాశం జిల్లాలో బంధువు చనిపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. గురువారం తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ మెయిన్ డోర్ తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లోని బీరువా తెరిచి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన కిలో బంగారు అభరణాలు,ఫ్లాట్ విక్రయించగా వచ్చిన రూ. 22 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లైంగిక నేరం: మహిళకు 100 కొరడా దెబ్బల శిక్ష! -
అమీర్‌పేట్‌లో స్కూల్ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, అమీర్‌పేట: ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వృద్ధులను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. బాధితుల కేకలు విన్న స్థానికులు అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధులను రక్షించి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు.. అనంతరం ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మెరాజ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల పేరు మీద అమీర్‌పేటలోని లీలానగర్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదమే కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ భూవివాదంపై కోర్టు పరిధిలో విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..) మరోవైపు కిడ్నాపర్లు తమ నుంచి కీలకమైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని లాక్కున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేసి తమ ఆస్తిని కాపాడాలని వేడుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులు బీదర్‌లో వున్నట్లు గుర్తించారు. చదవండి: హృదయ విదారక ఘటన.. నాలుగేళ్ల బాలికను.. -
హైదరాబాద్: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: కన్న కూతురిపై అత్యాచారం అమీర్‌పేట: కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాడు కన్న కూతురిపై లైంగికదాడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అగాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కాలనీలో నివసించే 17 ఏళ్ల మైనర్ బాలిక ఇంటర్ పూర్తి కావడంతో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. డ్రైవర్‌గా పనిచేసే తండ్రి గురువారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదును చూసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక బయటకు పరుగెత్తి పక్కింటి మహిళలకు విషయం తెలిపింది. స్థానికులు ఆ మృగాడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. చదవండి: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం మదనపల్లి ప్రైవేట్ లాడ్జిలో యువతి ఆత్మహత్యాయత్నం -
ఇలా కూడా మోసం చేస్తారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో విక్రయానికి పెట్టిన వస్తువులు కొంటామని, మరికొన్నింటిని అమ్ముతామంటూ పోస్టింగ్స్ పెట్టి అందినకాడికి దండుకునే కేసుల్ని తరచు చూస్తునే ఉంటున్నాం. అయితే ఈ యాప్ కేంద్రంగా జరిగిన ఓ వెరైటీ సైబర్ క్రైమ్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందులో బాధితుడు, ‘బాధితుడి లాంటి వ్యక్తి’ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. (అల్లుడితో సంబంధం.. వేధింపులు భరించలేక) అసలేం జరిగింది? నగరంలో పశ్చిమ మండల పరిధిలో ఉన్న ఎస్సార్‌నగర్ ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడు తన వద్ద ఉన్న ఫోన్‌ను విక్రయంచాలని భావించాడు. దీనికోసం అతడు దాని ఫొటో, వివరాలతో పాటు తన ఫోన్ నెంబర్‌ను పొందుపరుస్తూ ఓఎల్ఎక్స్ యాప్‌లో ఒక యాడ్ పోస్టు చేశాడు. అందులో ఆ ఫోన్ రేటును రూ.27 వేలుగా పేర్కొన్నాడు. తిరుపతి సమీపంలోని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న బాలాజీ అనే నిందితుడు ఈ యాడ్‌ని చూశాడు. అందులోని ఫోన్ ఫొటో, వివరాలు కాపీ చేసి మరో యాడ్‌గా పోస్ట్ చేశాడు. ఈ యాడ్‌ను గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మోహన్ అనే వ్యక్తి చూశాడు. ఆ ఫోన్ ఖరీదు చేయాలని భావించిన అతగాడు ‘కాపీ–పోస్ట్’ యాడ్‌లో ఉన్న నెంబర్ ఆధారంగా బాలాజీని సంప్రదించాడు. బేరసారాల తర్వాత ఆ ఫోన్‌ను రూ.20 వేలకు ‘విక్రయించడానికి’ బాలాజీ అంగీకరించాడు. అయితే తాను ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉన్నానని, ఎస్సార్‌నగర్ వెళితే తన సోదరుడు ఫోన్ చూపిస్తాడంటూ చెప్పి పవన్ నెంబర్ ఇచ్చాడు. ఆ వెంటనే పవన్‌కు ఫోన్ చేసిన బాలాజీ... ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేసిన ఫోన్ తనకు నచ్చిందని, అయితే తాను వేరే ఊరిలో ఉండటంతో తన స్నేహితుడు వచ్చి దాన్ని పరిశీలించి వెళతాడని చెప్పాడు. అతడికి ఫోన్ చూపించాలని, నచ్చితే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్తాడని పవన్‌తో నమ్మబలికాడు. ఈ విషయం నమ్మిన పవన్ వచ్చిన వ్యక్తిని కలిసి ఫోన్ చూపించాలని నిర్ణయించుకున్నాడు. బాలాజీ చెప్పిన ప్రకారం పవన్‌ను అతడి సోదరుడిగా భావించిన మోహన్ ఎస్సార్‌గనర్ వచ్చి ఫోన్ చేశాడు. తనకు ఫోన్ చేసింది బాలాజీ ఫ్రెండ్‌గా భావించిన అతడు వెళ్ళి కలిసి ఫోన్ చూపించాడు. వీరిద్దరూ కలిసి ఉండగానే మోహన్‌కు కాల్ చేసిన బాలాజీ... ఫోన్ నచ్చిందా? అంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో ఆ ఫోన్‌ను పవన్ నుంచి తీసుకుని పరిశీలిస్తున్న అతడు ఔనంటూ సమాధానం ఇచ్చాడు. ఫోన్లోనే బేరసారాలా తర్వాత రూ.20 వేలకు విక్రయించడానికి అంగీకరించాడు. ఆ వెంటనే తన పథకాన్ని అమలులో పెట్టిన బాలాజీ తొలుత రూ.12 వేలు తనకు ఫోన్‌పే చేయాలని, మిగిలిన మొత్తం పంపడానికి మరో ఖాతా చెప్తానన్నాడు. పవన్ ఎదురుగానే ఉన్న మోహన్ తన ఫోన్ నుంచి బాలాజీకి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఆ తర్వాత ఫోన్ తీసుకుని వెళ్తుండగా అడ్డుకున్న పవన్ డబ్బు చెల్లించకుండా ఎలా తీసుకువెళ్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఖంగుతిన్న మోహన్ ఇప్పుడే మీ అన్నయ్య బాలాజీకి బదిలీ చేశానని చెప్పగా... అతడు మీ స్నేహితుడు కదా? అంటూ పవన్ ప్రశ్నించాడు. ఇలా ఇద్దరూ చర్చించుకున్న నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తామిద్దరం బాలాజీ చేతిలో మోసపోయామని భావించారు. బాలాజీకి ఫోన్ చేసిన మోహన్ దీనిపై ప్రశ్నించగా... పరిస్థితి బాగోలేక, డబ్బు అవసరం ఉండి అలా చేశానని, రెండు రోజుల్లో తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తానంటూ నమ్మబలికాడు. ఇలా నాలుగు రోజుల పాటు వేచి చూసిన మోహన్ మంగళవారం పవన్‌ను తీసుకుని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఫిర్యాదు ఇచ్చాడు. దీని ఆధారంగా ఆరా తీస్తున్న అధికారులు బాలాజీగా చెప్పుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతా తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. అతడు అక్కడే ఉండి ఈ నేరం చేశాడా? లేక నగరంలో ఉండి డబ్బు కాజేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిర్ధారించడానికి సాంతికేతిక ఆధారాలు సేకరిస్తున్నాడు. -
శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్
-
విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి
-
కీలక దశకు చేరుకున్న శ్రావణి కేసు
తూర్పు గోదావరి : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవరాజ్‌ను ఇప్పటికే విచారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించిందుకు ఆమె కుటుంబ సభ్యులను విచారించనున్నారు. పోలీసుల పిలుపు మేరకు శ్రావణి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి శనివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో రేపు ఉదయం (ఆదివారం) శ్రావణీ తల్లిదండ్రులు, సోదరుడుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా హాజరు కానున్నారు. (శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్) శ్రావణీ కుటుంబ సభ్యులను సాయి తన కారులో ఎక్కించుకుని హైదరబాద్‌కు ప్రయనమైయ్యాడు. కాగా దేవరాజ్, సాయి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సాయి, ఆమె కుటుంబ సభ్యలను విచారించిన తరువాతనే కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సాయి, శ్రావణికి సంబంధించిన ఓ వీడియో సైతం తాజాగా వెలుగులోకి రావడంతో అతని పాత్రపై మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం నాటి విచారణ కేసు దర్యాప్తులో కీలకం కానుంది. (ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) -
ఎస్ఆర్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
యువతిని ఈడ్చుకుంటూ వెళ్లిన కారు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండా బైక్ ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. కారు చక్రాల మధ్యలో ఆమె ఇరుక్కుపోవడంతో కొంత దూరంపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అలేఖ్యను స్థానికులు హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. -
హైదరాబాద్‌లో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సురేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. సురేశ్ స్థానిక ధరమ్‌కరణ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్ ఇంచార్జ్ డీసీసీ సుమతి ఘటన స్థలానికి చేరుకుని.. పరిసరాలను పరిశీలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్సైపై దాడికి యత్నం
అమీర్‌పేట: కేసు విచారణలో జాప్యం చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న కారణంగా డ్యూటీలో ఉన్న ఎస్సైపై దాడికి యత్నించిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కోర్టులో ప్రవేశ పెట్టగా అతడి మానసిక స్థితిపై న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్గొండకు చెందిన గణేష్‌యాదవ్ ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని వెంగమాంబ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ మెస్ చార్జీలు చెల్లించక పోవడంతో నిర్వాహకుడు వెంకట్‌రెడ్డి డబ్బుల కోసం అతడిని ఒత్తిడి చేయడంతో ఇరువురి మద్య మాటా మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ గణేష్‌యాదవ్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు ఎస్సై నరేష్ విచారణ చేపట్టి నివేదిక రూపొందించాడు ఈ సందర్భంగా గణేష్‌యాదవ్ స్నేహితులు నవీన్ తదితరులను విచారించగా ప్రతి రోజు ఏదో విషయమై గొడవ పడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గణేష్ తల్లిదండ్రులకు తెలిపి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడించారు. దీని ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ హాస్టల్లో జరిగిన గొడవపై తన తల్లిదండ్రులకు ఎందుకు చెప్పారంటూ బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సైతో గొడవ పడ్డాడు. నీ ప్రవర్తన సరిగా లేని కారణంగా మీ తల్లిదండ్రులకు చెప్పాల్సి వచ్చిందని, ఇన్స్పెక్టర్తో మాట్లాడిస్తానని తీసుకెళ్తుండగా ఆగ్రహానికిలోనైన గణేష్ ఎస్సై నరేష్ చొక్కా పట్టుకుని పక్కకు నెట్టి వేశాడు. దీంతో అడ్మిన్ ఎస్సై నవీన్‌కుమార్ జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. గణేష్‌యాదవ్ మానసిక స్థితిపై అనుమానం రావడంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. రాత్రి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎస్సై సాయినాథ్ తెలిపారు. -
ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్
సాక్షి, హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వాహనదారుడిని నిలువరించేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్ తగిలింది. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ నడపటాన్ని గమనించారు. యువకుడిని ఆపడానికి ప్రయత్నించగా, పోలీసులను చూడగానే ఒక్కసారిగా యువకుడికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి సపర్యలు చేయాల్సి వచ్చింది. -
ఎస్సార్ నగర్లో బీభత్సం సృష్టించిన క్రేన్
సాక్షి, హైదరాబాద్ : ఎస్సార్ నగర్లో ఆదివారం ఓ క్రేన్ వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా క్రేన్‌కు బ్రేకులు ఫెయిల్ కావడంతో చిరు వ్యాపారుల దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. క్రేన్ బీభత్సానికి భయపడిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. -
జిమ్ చేస్తూ యువకుడి మృతి
హైదరాబాద్: సరైన శిక్షణ లేకుండా జిమ్ చేస్తూ కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోమవారం ఎస్ఆర్నగర్లోని గోల్డెన్ జిమ్‌లో ఆదిత్య (30) అనే యువకుడు జిమ్ చేసిన అనంతరం అస్వస్థతకులోనై మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌కు చెందిన ఆదిత్య బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న గోల్డెన్ జిమ్‌లో ప్రతిరోజు ఉదయం కసరత్తులు చేసేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన ఆదిత్య గంటపాటు ఎప్పటిలాగే జిమ్ చేశాడు. ఆ తర్వాత కడుపులో నలతగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని నిర్వాహకులతో చెప్పి కుప్పకూలిపోయాడు. అయితే ఆదిత్యను నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆదిత్య స్నేహితుడు హుసేన్‌కు వారు ఫోన్ చేయగా హుసేన్ ఆదిత్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆదిత్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ జిమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మాత్రలు వేసుకున్నానని చెప్పాడు ‘ఆదిత్యకు ఉదయం ఫోన్ చేస్తే తీయలేదు. దీంతో అతడిని తీసుకువచ్చేందుకు జిమ్‌కు వెళ్లాను, అప్పటికే ఆదిత్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంటికి తెచ్చాక పరిస్థితి విషమంగా మారడంతో ‘జిమ్‌లో ఏమైనా తిన్నావా’అని అడిగాను. జీఎంజీ మాత్ర వేసుకున్నానని ఆదిత్య చెప్పడంతో జిమ్ ట్రైనర్ అఖిల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాను. ఆయన సలహా మేరకు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను’అని స్నేహితుడు హుసేన్ తెలిపాడు. అయితే జిమ్ చేసేముందు మాత్రలు వేసుకున్నాడా లేక అస్వస్థతకు గురైన అనంతరం మాత్ర వేశారా అన్నది తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీసిన ఎక్సర్సైజ్
సాక్షి, హైదరాబాద్ : జిమ్‌లో అధిక సమయం ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఎస్ ఆర్ నగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన ఆదిత్య నగరంలో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం ఆదిత్య ఎస్ ఆర్ నగర్‌లోని గోల్డెన్ జిమ్‌లో చేరాడు. రోజులానే సోమవారం ఉదయం జిమ్‌లో చాలాసేపు ఎక్సర్సైజ్ చేస్తూ గడిపాడు. దాంతో ఒక్కసారిగా నీరసించి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లేట్ ఇచ్చారు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆదిత్య పరిస్థితి మరింత విషమంగా మారింది. చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్థారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిమ్‌లో అధిక సమయం ఎక్సర్సైజ్ చేయించడం వల్లే ఆదిత్య చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. అంతేకాక గోల్డెన్ జిమ్‌పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
యువతిపై సామూహిక లైంగికదాడి
అమీర్‌పేట్: ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటమే గాకుండా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తుండటంతో బాధితురాలు బుధవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, నూజివీడు, గాంధీనగర్‌కు చెందిన తాను ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని రమా హోమ్‌లో ఉంటున్నట్లు తెలిపింది. హోమ్ నిర్వాహకురాలు రమ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని , శిరీష అలియాస్ జయశ్రీ అనే మహిళను పరిచయం చేసిందని, సోషల్ వర్కర్‌గా చెప్పుకునే శిరీష గత మార్చి 5న అమెరికా నుంచి తన స్నేహితులు వచ్చారని ఉద్యోగ విషయమై వారితో మాట్లాడదామని తనను కారులో గుంటూరుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. మార్గమధ్యంలో మత్తుమందు కలిపిన మంచినీళ్లు ఇవ్వడంతో తాను స్పృహ కోల్పోయానని, మెలకువ వచ్చి చూసేసరికి ఓ గదిలో ఉన్నట్లు గుర్తించానంది. నలుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించినా కేసు పెడితే పరువు పోతుందని భయపడి ఫిర్యాదు చేయలేదని తెలిపింది. ఈ నెల 3న ఓ వ్యక్తి తనకు ఫోన్ చేయడమేగాక అర్ధనగ్నంగా ఉన్న తన ఫొటోలను వాట్సప్ పంపాడని, మరో వ్యక్తి కూడా ఫొటోలు పంపిస్తూ, తమకు లొంగిపోవాలంటూ లేని పక్షంలో ఫొటోలను యూట్యూబ్‌లో పెడతామని బెదిరించినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్ నిర్వాహకురాలు రమ, శిరీష తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ వాహనంలోకే మద్యం సఫ్లై
-
మొబైల్ దొంగిలించాడని మద్యం మత్తులో స్నేహితుడి హత్య
-
వివాహేతర సంబంధం: మాతృత్వానికే మచ్చ తెచ్చింది!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు. చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి లలితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్నిరోజులుగా లలిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం కారణంగానే చిన్నారిని వదిలించుకునేందుకు ఆమె ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టింది
-
ఎస్ఆర్ నగర్లో యువతిపై కిరాతకం
-
ఎస్ఆర్ నగర్లో యువతిపై కిరాతకం
సాక్షి, హైదరాబాద్ : అటు విశాఖలో యాచకురాలిపై యువకుడి కీచకపర్వం ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే, హైదరాబాద్‌లో మరో కిరాతకం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ రైతు బజార్ వద్ద ఓ వివాహితపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో పడిపోయిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా.. : ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వివాహితను అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీనిపై ఆమె రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. సోమవారం మధ్యాహ్నం రైతు బజార్ వద్ద ఆమెపై కొబ్బరిబోండాల కత్తితో దాడిచేసి మెడ నరికే ప్రయత్నం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే క్రమంలో స్థానికులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారిస్తున్నామని, బాధితురాలికి గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందుతున్నదని పోలీసులు చెప్పారు. -
ఎస్ఆర్ నగర్ ఇళ్ల కూల్చివేతపై స్టేటస్ కో
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎస్ఆర్ నగర్లో ఇళ్ల కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్ నగర్లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న తమకు అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కె.రాజు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బూర రమేశ్ వాదనలు వినిపిస్తూ, అధికారులు రెండు పడక గదుల ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నా వారి ఇళ్లను మాత్రమే కూల్చివేస్తామని హామీ ఇచ్చి, ఆకస్మాత్తుగా వచ్చి 40 ఇళ్ల వరకు కూల్చివేశారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. -
హైదరాబాద్‌లో ఓ కన్నతల్లి కర్కశత్వం!
-
ఓ కన్నతల్లి కర్కశత్వం!
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కన్నతల్లే తనను రాచిరంపాన పెడుతోందంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పదకొండేళ్ల బాలికను కన్నతల్లితోపాటు సవతితండ్రి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంట్లో నీళ్లు పట్టలేదంటూ ఆమె గ్యాస్ కట్టర్‌తో కొట్టారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. చదువుకోవాల్సిన వయస్సులో బాలిక వసతిగృహంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సవతి తండ్రితోపాటు కన్నతల్లి సైతం బాలిక పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ.. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి పోరును తట్టుకోలేక ఆ చిన్నారి ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. -
SRనగర్ పీఎస్ పరిధిలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్
-
అందరూ‘చల్ల’గా ఉండాలి... అందులో నేనుండాలి
భానుడి ప్రతాపం మొదలైంది..సూర్య కిరణాలకు నగరవాసి విలవిల్లాడుతున్నాడు.. చల్లటి పానీయం కోసం తహతహలాడుతున్నాడు. అందరికీ వాటర్క్యాన్లను సరఫరా చేసే ఓ యువకుడు ఎండకు తాళలేక శీతలపానీయం తాగుతూ ఎస్ఆర్నగర్లో కనిపించాడు. -
SRనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం
-
వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై!
-
వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై!
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్సై పోలీసులకు దొరికిపోయాడు. ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం టూటౌన్ ఎస్సైగా విజయ్ పనిచేస్తున్నాడు. అతనికి ఫేసుబుక్ ద్వారా ఓ మహిళ పరిచయమయింది. వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. నగరంలోని మోతీనగర్ కామధేను అపార్ట్మెంట్లో వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా సదరు మహిళ భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై విజయ్‌ని అరెస్టు చేశారు. -
ఎస్ఆర్నగర్లో కారు భీభత్సం
-
జ్యోతిష్యం చెప్పాలంటూ ఇంటికొచ్చి...
హైదరాబాద్: జ్యోతిష్యం చెప్పాలంటూ వచ్చి.. ఏకంగా జ్యోతిష్యుడిపైనే దాడి చేసిన ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన కిషన్‌జీ జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. శనివారం సాయంత్రం ఆయన ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తమకు జ్యోతిష్యం చెప్పాలని కోరారు. ఆయన అంగీకరించి వారికి జ్యోతిష్యం చెప్పేందుకు యత్నిస్తుండగానే.. వారు కత్తులతో ఆయనపై దాడి చేశారు. అడ్డువచ్చిన కిషన్ జీ కారు డ్రైవర్‌పైనా దాడి చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికులు గాయపడిన కిషన్ జీని, ఆయన డ్రైవర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్
-
బోరబండ ప్రాంతంలో పోలీసుల కార్డెన్ సర్చ్
హైదరాబాద్ : నగరంలోని బోరబండ ప్రాంతంలో పలు కాలనీల్లో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. బోరబండ, భరత్‌నగర్, బంజారానగర్, బాబాసాహెబ్నగర్ తదితర ప్రాంతాల్లో 586 ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడుగురు రౌడీషీటర్లను, ముగ్గురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 17 మంది విదేశీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 400 మంది పోలీసులు నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో చూసి.. యువకుడి ఆత్మహత్య
* ఉద్యోగం రాలేదనే ఆవేదనతో బలవన్మరణం * హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో ఘటన హైదరాబాద్: ఆ యువకుడు కొన్నాళ్ల కింద ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.. ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం రాలేదు.. దీంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఆత్మహత్య చేసుకునే విధానాలపై యూట్యూబ్‌లో వెతికాడు.. వాటి నుంచి ప్రేరేపితుడై ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.. హైదరాబాద్‌లో ఎస్ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఆరు నెలలుగా.. నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన నర్సయ్య కుమారుడు నవీన్‌కుమార్ (26). బీటెక్ పూర్తి చేసిన నవీన్ ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఆరు నెలలుగాఎస్ఆర్నగర్లోని అనుపమ హస్టల్లో బెంగళూర్‌కు చెందిన మరో వ్యక్తితో కలసి ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఎన్ని సంస్థల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించకపోవడంతో ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో కూడా చెప్పుకొన్నాడు. ఈ ఆందోళనతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల కింద తన రూమ్మేట్ బెంగళూరుకు వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ సమయంలోనే ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే దానిపై యూట్యూబ్‌ను శోధించాడు. చివరికి ఉరి వేసుకోవాలని నిర్ణయించుకుని.. ఓ తాడు కొనుక్కుని తెచ్చుకున్నాడు. మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని గదిలోకి వెళ్లాక.. ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి దీనిని గమనించి, హస్టల్ నిర్వాహకులకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. ఆ గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్య ఏ విధంగా చేసుకోవాలన్న దానిపై యూట్యూబ్‌లో వెతికానని నవీన్ సూసైడ్ నోట్లో రాశాడని పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు కుటుంబ సభ్యులే కారణమని పేర్కొన్నాడని.. తల్లిదండ్రులను ప్రశ్నిస్తే పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్..
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీసులు బుధవారం రాత్రి అంబేద్కర్‌నగర్, జయప్రకాశ్‌నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మొత్తం 412 ఇళ్లను సోదా చేయగా అందులో 17 హాస్టళ్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 61 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నేపాల్ దేశంతోపాటు వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. అలాగే, ఎలాంటి పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. -
మత్తుమందిచ్చి హాస్టల్ నిర్వాహకుడి నిర్వాకం!
అమీర్‌పేట: యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి యత్నించాడో హాస్టల్ నిర్వాహకుడు. ఈ ఘటనలో నిందితుడిని ఎస్సార్‌నగర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం.. గురజాలకు చెందిన నరేందర్‌రెడ్డి అనే యువకుడు 10 నెలల కిత్రం నగరానికి వచ్చి బల్కంపేట బీకేగూడలో 'అర్రు' హాస్టల్ నడుపుతున్నాడు. కోయంబత్తూర్‌కు చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇతని హాస్టల్లో దిగింది. రూంలోని బ్యాగులో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో ఆమె నరేందర్‌రెడ్డికి ఫోన్ చేసిచెప్పింది. హాస్టల్ వద్ద ఎందుకు బీకేగూడ పార్కు వద్దకు వస్తే మాట్లాడతానని చెప్పడంతో ఆమె వెళ్లింది. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న ఓ రూమ్‌కు తీసుకెళ్లిన నరేందర్‌రెడ్డి బలవంతంగా ఆమె నోట్ల సిగరెట్ పెట్టాడు. దీంతో ఆమెకు మత్తు వచ్చినట్లైంది. అతడి పన్నాగం కనిపెట్టిన యువతి అతడి నుంచి తప్పించుకొని బాలానగర్‌లో ఉంటున్న తన పెద్దమ్మ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆమె సహాయంతో ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నరేందర్రెడ్డిపై లైంగికదాడికి యత్నం కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. -
బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి..
హైదరాబాద్‌సిటీ: ఎస్ఆర్ నగర్లో బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు. సబీనా సుల్తానా అనే మహిళ దృష్టి మరల్చి 3.8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నటి అపూర్వకు బెదిరింపులు!
హైదరాబాద్: సినీ నటి అపూర్వను కొందరు దుండగులు బెదిరించి వెళ్లారు. సోమవారం ఎస్ఆర్ నగర్ పరిధిలోని సిద్ధార్ధనగర్‌లో నివాసముంటున్న నటి అపూర్వ ఇంటికి నలుగురు దుండగులు వచ్చి ఆమెను బెదిరించారు. అయితే మూడు రోజుల క్రితం తన కారుకు జరిగిన యాక్సిడెంట్‌కు సంబంధించి మాట్లాడతామని తన ఇంటికి వచ్చి బెదిరించినట్టు పోలీసులకు చెప్పింది. తనను దుండగులు బెదిరించినట్టు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నటి అపూర్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీగా టర్కీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: టర్కీ దేశపు కరెన్సీని చౌకగా ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకుని, వారి నుంచి పెద్ద మొత్తంలో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలివీ..టర్కీ దేశంలో ప్రస్తుతం వాడుకలో లేని, ఆ దేశ కరెన్సీ ‘లిరా’ కరెన్సీ నోట్లను వివిధ అక్రమ మార్గాల్లో ముఠా సేకరించింది. వాటికి ఎంతో విలువ ఉందంటూ మోసాలకు పాల్పడుతోంది..దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం లాలాగూడచెందిన కృష్ణమోహన్ ఇంట్లో సమావేశమై ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, కృష్ణమోహన్ అనే వ్యక్తి మల్కాజిగిరి ప్రాంతం జ్యోతినగర్‌లోని ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి 198 లిరా నోట్లు(సుమారు 220 కోట్ల విలువ), ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2005కు ముందు ముద్రితమైన ఈ లీరా నోట్లు ప్రస్తుతం ఆ దేశంలో వాడుకలో లేవు. ఒక్కో నోటు విలువ మన కరెన్సీలో రూ.5 లక్షలుండేది. నిందితులను, కరెన్సీని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో రాజమండ్రికి చెందిన పెదపూడి సత్యకుమార్, వీరవెంకట సుబ్రమణ్యం, విజయవాడ వాసులు కొండవీటి రంజిత్‌కుమార్, రూప్ చంద్, బందరు మండలం బూదలపాలెంనకు చెందిన టి.శ్రీనివాసరావు, సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన కృష్ణమ్మోహన్, వెంకట చలపతి రెడ్డి ఉన్నారు. ఈ ముఠా సభ్యుడు, ఖమ్మం జిల్లా వాసి అనిల్ కుమార్ పరారయ్యాడు. -
వ్యాపారి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ
మధురానగర్(హైదరాబాద్‌సిటీ): ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీంది. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్‌లో సోమవారం అర్థరాత్రి జరిగింది. మధురానగర్‌కు చెందిన సత్యనారాయణ ఇంటిలో సోమవారం గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అతని ఇంటినుంచి 25 తులాల బంగారం, రెండు కిలోల వెండిని దొంగలు అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతిని వేధించిన కానిస్టేబుల్ రిమాండ్
హైదరాబాద్: యువతిని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు. వివరాలివీ..అమీర్‌పేట్ గురుద్వారా ప్రాంతంలో నివాసం ఉండే ఓ యువతిని 13వ బెటాలియన్‌లో పనిచేసే కానిస్టేబుల్ శ్రీనివాస్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనిపై బాధితురాలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. -
వాట్సాప్ కంటే మెరుగైన యాప్ తయారు చేయాలనుకుని..
ప్రాజెక్టు విఫలమవడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్: వాట్సాప్ కంటే మెరుగైన యాప్‌ను తయారు చేయాలనుకుని విఫలమైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలను హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ ఎస్సై అజయ్‌కుమార్ వెల్లడించారు. అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో నివాసం ఉంటు న్న అశోక్ అగర్వాల్‌కు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు. బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు లక్కీ అగర్వాల్(35) తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. సమాచార రంగంలో మెరుగైన యాప్‌ను తయారు చేయాలని భావించిన లక్కీ ఓ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. అది అనుకున్నంత విజయం సాధించకపోగా ఆర్థికంగా నష్టాలు తెచ్చిపెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెల రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ల డంలేదు. చివరకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా మంగళవారంరాత్రి నైట్రో గ్యాస్ సిలిండర్‌ను కొనుక్కుని తన గది లో పెట్టుకున్నాడు. ఓ పాలిథిన్ కవర్లోకి ఆ గ్యాస్ ఎక్కించుకుని మెడ నిండా దాన్ని చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా గదిలో విగతజీవుడిగా కనిపించాడు. అనంత రం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెయిన్లెస్గా ఉంటుందని గ్యాస్ సిలిండర్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందరూ బాగుండాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్ఆర్ నగర్లో నకిలీ పోలీస్ అరెస్టు
హైదరాబాద్: విద్యార్థులు, మహిళలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును ఎస్సార్ నగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసునంటూ గత కొన్ని రోజులుగా ప్రేమ జంటలను, హోటళ్ల నిర్వాహకులను బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతడిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు అప్పలనాయుడు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
దాసారం బస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ దాసారంలో బస్తీలో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో బస్తీని జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో నలుగురు నిందితులు సహా 76 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 బైకులు, రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. -
పేకాట శిబిరాలపై దాడులు
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని పేకాట శిబిరాలపై మంగళవారం వేకువజామున పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ తనఖీల్లి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యమకారుల తిరుగుబాటు
రోడ్డుపై బైఠాయింపు టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం సొమ్మసిల్లిన శేర్ మణెమ్మ కంటతడి పెట్టిన కాసం ఏఎస్‌రావునగర్: తెలంగాణ ఉద్యమకారులు తిరగబడ్డారు. ఏఎస్రావు నగర్ జనరల్ మహిళ స్థానానికి ఇటీవల పార్టీలో చేరిన పజ్జూరి పావనీ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి కాప్రా సర్కిల్ అధ్యక్షుడు భేతాళ బాలరాజు ఇంటి ఎదుట బైఠాయిం చారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్‌లోని బాలరాజు ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు వేణుగోపాలాచారి ఉన్న విష యం తెలుసుకున్న ఆశావహులు అనుచరులతో కలసి ఇంటి ఎదుట బైఠాయించారు. రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసలు పావనీరెడ్డి ఎవరంటూ ఆందోళనకారులు ఆయనను నిలదీశారు. పార్టీ సర్కిల్ అధ్యక్షుడు బాలరాజు, డివిజన్ అధ్యక్షుడు పులి చెరాల తీరుపై విరుచుకుపడ్డారు. ఉద్యమకారులను విస్మరించి టిక్కెట్లు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఉప్పల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బేతి సుభాష్‌రెడ్డి అమ్ముడుపోయారని విమర్శించారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తీవ్ర వాదోపవాదాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు శేర్ మణెమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కొద్దిసేపు బాలరాజు ఇంటి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. పావనీరెడ్డికి టిక్కెట్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల్లో ఎవరికి టిక్కెట్ కేటాయించినా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వేణుగోపాలాచారి ఫోన్లో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు గొడవ విషయా న్ని తెలియజేశారు. శనివారం ఉదయం తన వద్దకు రావాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొత్త రామారావు, కాసం మహిపాల్‌రెడ్డి, శేర్ మణెమ్మ, తాడురి భాగ్య, ఏనుగు సీతారాంరెడ్డి, కందాడి సుదర్శన్‌రెడ్డి, అర్చన, రాజేశ్వరి పాల్గొన్నారు. కాసం కంట తడి ఏఎస్‌రావునగర్ డివిజన్ జనరల్ మహిళ స్థానంలో తన సతీమణి కాసం పద్మను పోటీకి నిలపాలని ఆశించిన టీఆర్ఎస్ కాప్రా సర్కిల్ ప్రధాన కార్యదర్శి కాసం మహిపాల్‌రెడ్డి టికెట్‌ను పావనీరెడ్డికి కేటాయించిన విషయం తెలుసుకుని బోరున విలపించారు. గత 12 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక కేసుల్లో ఇరుక్కున్న తనను అధిష్టానం గుర్తించలేదని వాపోయారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓదార్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. -
‘డబుల్’ పనులు షురూ..
అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు రూ.92.50 కోట్లతో 1384 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు అంబేద్కర్‌నగర్‌లో పనులు ప్రారంభం ఇళ్లు ఖాళీ చేస్తే ఎస్ఆర్ నగర్లోనూ నిర్మాణం వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించారు. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్ఆర్ నగర్లో ఉన్న ఇళ్ల స్థానంలో జీ ప్లస్-1, జీ ప్లస్-3 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఫ్లాట్లు నిర్మించాలని జిల్లా యంత్రాం గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ ప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతలను కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్అం డ్బీ శాఖ చేపట్టింది. హైదరాబాద్‌కు చెం దిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహా యంతో డీపీఆర్‌ను రూపకల్పన చేశారు. డీపీఆర్‌లో కొన్ని తేడాలు ఉండడంతో మొదటిసారి నిర్వహించిన టెండర్లు రద్దయ్యాయి. పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధమయ్యాక టెండర్లు నిర్వహించడంతో ఖరారు అయ్యాయి. అంబేద్కర్ నగర్లో జీప్లస్-3 నిర్మాణం హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని సుమారు ఏడు ఎకరాల స్థలంలో జీ ప్లస్-3 పద్ధతిలో అర్హులుగా గుర్తించిన 592 మందికి రూ.39 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో డ బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ఎంజెఆర్ సంస్థ 4.58 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కించుకుంది. అగ్రిమెంటు పూర్తికావడంతో ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్లో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం వరంగల్‌లోని ఎస్ఆర్ నగర్లో 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3 పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేం దుకు ప్రయత్నించగా స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హులుగా గుర్తించిన 792 మందికి రూ.53.50 కోట్ల వ్యయంతో జీప్లస్-1 పద్ధతిలో గ్రేడ్లుగా విభజించి ఇళ్లు నిర్మించనున్నారు. ‘ఎ’ గ్రేడ్‌లో 4+4, బి గ్రేడ్‌లో 2+2, సీ గ్రేడ్‌లో 1+1, డీ గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూ పొందించారు. ఇందులో సి, డి గ్రేడ్ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఏ, బీ గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేం దుకు నిర్ణయించారు. జిల్లాకు చెందిన మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ కంపెనీ 1.96 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కిం చుకుంది. లబ్ధిదారులు వారు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసిన వెంటనే ఎస్ఆర్నగర్లో పనులు ప్రారంభిస్తామని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. -
ఎస్ఆర్ నగర్లో కలకలం
-
హోటల్ లో వ్యక్తి అనుమానాస్పదమృతి
హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ ఆదిత్యా పార్క్ హోటల్లోని రూం. నెంబర్ 310లో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తిర్జీత్ చౌదరి(42)గా గుర్తించారు. కలకత్తాలోని కోలోప్లాస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ మీటింగ్ నిమిత్తం నగరానికి వచ్చినట్లు సమాచారం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేసిన తాళం వేసినట్టే.. ఇల్లు మాత్రం గుల్ల
ఎస్ఆర్ నగర్: హైదరాబార్ ఎస్ఆర్నగర్లో ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే ఉంటున్నాయి. కానీ, ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు మాత్రం మాయమవుతున్నాయి. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా... చోరీకి పాల్పడుతున్న బీటెక్ విద్యార్థి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్‌లో నివసించే రాహుల్ బీటెక్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన రాహుల్... తాను నివసించే ప్రాంతంలో ఓ ఇంటి యజమానులు బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసి కీని చెప్పుల స్టాండ్ పక్కన పెట్టి వెళుతుండటాన్ని గమనించాడు. గతేడాది డిసెంబర్లో ఆ ఇంట్లోకి ప్రవేశించి 30 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. తిరిగి వారం రోజుల క్రితం మళ్లీ అదే ఇంటి లోపలికి ప్రవేశించి 15 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీ చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. స్థానిక వ్యక్తుల పనిగా అనుమానించిన పోలీసులు నిఘా పెట్టి రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో రెండు చోరీలు తానే చేసినట్టు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ జేసే 45 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో భారీ అగ్నిప్రమాదం
ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో ఘటన హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ ఎస్బీఐ కస్టమర్ వెయిటింగ్ హాల్లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంక్ నుంచి భారీగా పొగలు రావడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎస్బీఐ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. వెంటనే అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. సంఘటనా స్థలాన్ని డీఐజీ మురళీ కృష్ణ, ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు ఇప్పుడే చెప్పలేమని వారు తెలిపారు. -
గోనె సంచిలో బాలుడి మృతదేహం
అమీర్‌పేట: అభం... శుభం తెలియని ఐదేళ్ల బాలుడిని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఈఎస్ఐ మెట్రోరైలు బ్రిడ్జికింద పాడేసిపోయారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. మృతుడి ఒంటిపై పసుపు, కుంకుమ పూసి ఉండటంతో బలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ జీవీ రమణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఈఎస్ఐ ఆసుపత్రి మెట్రోరైలు స్టేషన్ పిల్లర్ వద్ద ఓ మూట ఉండగా స్థానికులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి మూటను విప్పి చూడగా అందులో బాలుడి మృతదేహం కనిపించింది. మృదేహం కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి రెండు రోజుల క్రితం చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాలుడి ఒంటిపై ఎర్రటి లంగా చుట్టి, పసుపూ, కుంకుమ పూసి ఉండటాన్ని బట్టి బలి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దుండగులు బాలుడి గొంతు నులిమి హత్య చేసి ఉంటారని, వయసు సుమారు ఐదేళ్లు ఉంటుందని, అతడికి సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదని పోలీసులు తెలిపారు. డాగ్ స్వ్కాడ్‌ను రప్పించి స్థానికంగా పరిశీలించినా నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం బాలుడి మిస్సింగ్‌కు సంబంధించి ఏవైనా కేసులు నమోదయ్యాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లోని బాయ్స్ హాస్టళ్లలో కార్డన్‌సెర్చ్
-
యూనియన్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
ఎస్సార్‌నగర్ (హైదరాబాద్): నగరంలోని ఎస్సార్‌నగర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం బ్యాంక్‌లో అగ్నిప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బ్యాంక్ సిబ్బంది అగ్నిమాపకశాఖ వారికి సమాచారం అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
సైకో వీరంగం.. యువతికి తీవ్రగాయాలు
-
సైకో వీరంగం.. యువతికి తీవ్రగాయాలు
ఉమ్మడి రాజధాని నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఏకంగా హాస్టల్లో ఉన్న అమ్మాయిపై ఓ సైకో దాడి చేశాడు. ఈ ఘటన సంజీవరెడ్డి నగర్లో చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న సాయి లేడీస్ హాస్టల్లోకి సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ యువకుడు కత్తితో ప్రవేశించాడు. తిరుపతికి చెందిన మమత(21) ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఆమెపై అతడు దాడి చేయడంతో ఆమెకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా సైకో తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనది ఉప్పల్ అని ఓసారి, వరంగల్ అని మరోసారి చెబుతున్నాడు. పేరు అడిగితే చైతన్య అని ఓసారి, కరణ్ అని ఇంకోసారి చెప్పాడు. తాను తన అన్న బిడ్డను కలిసేందుకు వస్తే.. తనపైనే దాడి చేశారని అన్నాడు. అయితే, అతడు ఎవరో ఒక అమ్మాయిని చంపాలనే లక్ష్యంతో వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమీర్‌పేట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో ఎక్కడా అసలు సెక్యూరిటీ అన్నది ఉండట్లేదు. ఈ విషయంలో పోలీసులు గతంలో జారీచేసిన నోటీసులను హాస్టళ్ల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. -
ఆర్టీసీ బస్సులో భారీ చోరి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగలు అపహరించుకుపోయారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాలు.. చాంద్రాయణగుట్టకు చెందిన అనీస్ఫాతిమా ఆర్టీసీ బస్సులో ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా ఈ చోరి జరిగింది. ఆమె బ్యాగ్‌లో ఉన్న 30 తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. బస్సు దిగిన తర్వాత చూసుకున్న ఫాతిమా నగలు కనిపించక పోవడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన నగల విలువు సుమారు రూ. 8 లక్షల విలువ ఉంటుందని ఫాతిమా తెలిపారు -
ఇద్దరు యువతుల అదృశ్యం
హైదరాబాద్ క్రైం: నగరంలో గురువారం ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. వివరాలు..బోరబండకు చెందిన జరీనాబేగం(18), బోరబండ పెద్దమ్మ నగర్‌కు చెందిన సోనీ(17)లు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
యువతి పై కత్తితో దాడి
-
యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. దివ్య అనే యువతిపై అంకిత్ అనే యువకుడు కత్తితో పొడిచి దాడి చేశాడు. ఈ సంఘటనను అడ్డుకోబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి. -
వీబీఆర్ అంత్యక్రియలు పూర్తి
అశ్రునయనాల మధ్య సాగిన రాజేంద్రప్రసాద్ అంతిమయాత్ర హైదరాబాద్: ప్రముఖ దర్శక, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. పెద్ద సంఖ్యలో అభిమాను లు, సినీ ప్రముఖులు వెంటరాగా వీబీ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య కొనసాగింది. కడసారిగా వీబీ భౌతికకాయాన్ని చూసేందుకు ఆయన అభిమానులు, జగపతిబాబు అభిమానులు శ్మశానవాటికకు చేరుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు రామ్‌ప్రసాద్ తండ్రి చితికి నిప్పంటించారు. రాజేంద్రప్రసాద్ రెండో కుమారుడు యుగంధర్‌కుమార్, మూడో కుమారుడు, సినీ హీరో జగపతిబాబు హిందూ సంప్రదా యం ప్రకారం తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు అభిమానులు, చిత్ర ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. ఆ తర్వాత ఫిలింఛాంబర్‌కు తరలిం చారు. సినీ ప్రముఖులు చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, జయసుధ, మా అధ్యక్షుడు మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, మోహన్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ, వీవీ వినాయక్, అశ్వనీదత్, కాదంబరీ కిరణ్, ఆర్.నారాయణమూర్తి, డి.రామానాయుడు, సురేశ్ బాబు, బోయపాటి శ్రీను, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, సి.కల్యాణ్, అశోక్‌కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు తేజ, హీరో అర్జున్, రమేశ్ ప్రసాద్, హీరో సుమంత్, వెంకటేశ్, సందీప్‌కిషన్, జీవిత రాజశేఖర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు వీబీ భౌతికకాయానికి నివాళులర్పించారు. -
అమ్మాయిలకు వల వేసి దోచేస్తాడు!
-
24 లక్షల కంటే అమ్మ మాటే గొప్పగా అనిపించింది!
24 లక్షలు రూపాయల కంటే కూడా తల్లితండ్రుల మాటలే గొప్పగా అనిపించాయి. సన్మార్గంలో నడవాలని చెప్పిన తల్లితండ్రుల మాటలే ఆ హరిప్రసాద్ కు వేదవాక్కయ్యాయి. చెడు మార్గంలో సంపాదించే సొమ్ము, తేరగా లభించే డబ్బు మన వెంట ఉండదు అని చెప్పిన మాటలే బ్యాంకు పరువును నిలబెట్టాయి. ఏటీఎం నుంచి కుప్పలుకుప్పలుగా వచ్చిపడిన డబ్బు కోసం ఆశపడకుండా బ్యాంక్ అధికారులకు అప్పగించిన హరిప్రసాద్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. నాపై మా అమ్మ ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. నా చిన్నతనం నుంచి మా అమ్మ ఎప్పుడు చెబుతున్న మాటలు ఎప్పుడు గుర్తుకు వస్తాయి. కష్టపడని సొమ్ము ఎప్పటికి మనది కాదు అని అమ్మ చెబుతూ ఉండేది. సరియైన మార్గంలోనే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బే జీవితాంతం తోడుగా ఉంటుంది అని చెప్పిన మాటలు మనసులో నాటుకుపోయాయి అని హరిప్రసాద్ చెప్పారు. బ్యాంకు అకౌంట్లో ఉన్న 500 రూపాయల్లో 200 రూపాయలు డ్రా చేసుకుందామనుకున్న హరిప్రసాద్, అతడి స్నేహితులు లతీఫ్ ఆలీ, దుర్గా ప్రసాద్ లకు కళ్లెదుటే కుప్పులుగా పడి ఉన్న డబ్బు కనిపించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులుగా ఉన్న వీరు ముగ్గురు తమదికాని డబ్బు కోసం ఆశపడకుండా పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం అందించి తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ ఘటన తర్వాత ఈ ముగ్గురు యువకులు హీరోలుగా మారారు. అయితే తన తల్లితండ్రులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి తెలుసుకుని గొప్పగా ఫీలయ్యారు. అయితే తండ్రి మాత్రం ఏమైనా ఉద్యోగం లభించిందా అని మాత్రం అడిగారని హరిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత తన నిజాయితీ కారణంగా తండ్రికి ఆయన పనిచేసే స్కూల్లో అధికారులు సన్మానించడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని హరిప్రసాద్ తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు అద్దంగా నిలిచిన నిరుద్యోగ ఇంజినీర్లు, చార్టెడ్ అకౌంటెన్సీ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న హరిప్రసాద్, లతీఫ్ ఆలీ, హరి ప్రసాద్ ఉద్యోగంతోపాటు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుందాం. చూద్దామంటే కనిపించని ఈ సమాజంలో నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యువకులకు సెల్యూట్ చేద్దాం! -
200 డ్రా చేస్తే 24 లక్షలు వచ్చాయి
హైదరాబాద్: లక్షల రూపాయిలు చేతి దాకా వచ్చినా ఆ డబ్బు తమది కాదంటూ పోలీసులకు అప్పగించారు ముగ్గురు యువకులు. ఉద్యోగ వేటలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా నిజాయితీతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఎస్ఆర్నగర్లో ఓ హాస్టల్లో ఉంటున్న లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్‌లు శుక్రవారం రాత్రి డబ్బులు డ్రా చేసేందుకు సమీపంలోని ఎస్బీహెచ్ ఏటీఎంకు వెళ్లారు. లతీఫ్ తన కార్డు నుంచి రూ. 200 డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా డబ్బుల ప్రవాహం పోటెత్తింది. క్యాష్డోర్ ఆటోమెటిక్‌గా తెరుచుకొని రూ. 24 లక్షలు బయటకొచ్చాయి. ఇది చూసి అవాక్కైన ఆ ముగ్గురూ వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేంత వరకు ఏటీఎం వద్దే డబ్బులకు కాపలా ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఏటీఎంలో డబ్బులు పెట్టిన అధికారులు క్యాష్ డోర్‌కు లాక్ వేయడం మరిచిపోయినట్లు గుర్తించారు. యువకులు సమాచారం ఇవ్వడం వల్లే లక్షల రూపాయలు కాపాడగలిగామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు అవార్డులు ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగంలోనూ నిజాయితీగా .. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడే నికి చెందిన లతీఫ్ (22), మహబూబ్‌నగర్‌కు చెందిన హరిప్రసాద్ బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇక శివ దుర్గాప్రసాద్ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ముగ్గురూ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడే స్నేహితులయ్యారు. లతీఫ్, హరిప్రసాద్‌ల తండ్రులిద్దరూ టీచర్లు. శివ దుర్గాప్రసాద్ కుటుంబం మహబూబ్‌నగర్‌లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాలనే తపనతో ఈ ముగ్గురు చదువుకుంటూనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్లో లక్షల రూపాయలు కనిపించి, తీసుకునేందుకు అవకాశాలున్నా నిజాయతీతో మెలిగారు. తాము చేసిన పనికి పోలీసులు, స్థానికులు అభినందిస్తుంటే అదే కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. -
గబ్బర్‌సింగ్ టీం సందడి...
ఎస్ఆర్నగర్, నల్లగండ్లలో ఆదివారం కొత్తగా ప్రారంభమైన కాఫీ మహల్స్‌లో గబ్బర్‌సింగ్ టీం సందడి చేసింది. సరదాగా అంత్యాక్షరి ఆటతో అభివూనులను అలరించింది. ఓపెనింగ్‌కు సినీతారలు షామిలి(చందమామ కథలు ఫేమ్), సందీప్తి(రాజ్‌మహల్ ఫేమ్) హాజరై అభివూనులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు చంద్రకాంత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో 30 మెట్రో రైల్వే స్టేషన్లలో కాఫీ మహ ల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎస్ఆర్నగర్ హెచ్డీఎస్సీ బ్యాంక్ వద్ద చోరీ
ఓ వ్యక్తి దృష్టి మరల్చి అతడి వద్ద ఉన్న భారీ నగదుతో ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరంలో బుధవారం చోటు చేసుకుంది. దాంతో బాధితుడు ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.... ఎస్ ఆర్ నగర్‌లోని హెచ్డీఎస్ఎఫ్ బ్యాంక్ నుంచి బాధితుడు రూ.7.40 లక్షలు డ్రా చేసుకుని వెళ్తున్నాడు. ఆ క్రమంలో కొందరు వ్యక్తులు అతడి దృష్టి మరల్చి అతడి వద్ద ఉన్న నగదుతో ఉడాయించారు. దాంతో అతడు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దొంగలు అతడిపై దాడి చేయడంతో అతడు పడిపోయాడు. దీంతో దొంగలు పరారైయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనను వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఆర్ నగర్లో దొంగలు బీభత్సం
నగరంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు గత అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని మూడు షాపులలో వరుస చోరీలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం షాపు యజమానులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీకి గురైన షాపులకు చేరుకుని, దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. చోరీకి గురైన వివరాలను పోలీసులు షాపు యజమానుల నుంచి సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఆర్ నగర్లో దారుణ హత్య
హైదారాబాద్: ఎస్ఆర్ నగర్లో నగదు కోసం దారుణ హత్య జరిగింది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో కొందరు దుండగులు ఒక వృద్ధుడిని హత్య చేసి నగదును దోచుకెళ్లారు. ప్రసాదరావు(65) అనే వృద్ధుడు కమల అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కొందరు దుండగులు వచ్చి, ఆయనను హత్య చేసి లక్ష రూపాయల నగదు దోచుకువెళ్లారు. -
ఎస్సార్ నగర్ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో దారుణం