నగరంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు గత అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని మూడు షాపులలో వరుస చోరీలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం షాపు యజమానులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు చోరీకి గురైన షాపులకు చేరుకుని, దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. చోరీకి గురైన వివరాలను పోలీసులు షాపు యజమానుల నుంచి సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.