ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కన్న కూతురిపై అత్యాచారం అమీర్‌పేట: కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాడు కన్న కూతురిపై లైంగికదాడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అగాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కాలనీలో నివసించే 17 ఏళ్ల మైనర్ బాలిక ఇంటర్ పూర్తి కావడంతో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. డ్రైవర్‌గా పనిచేసే తండ్రి గురువారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదును చూసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక బయటకు పరుగెత్తి పక్కింటి మహిళలకు విషయం తెలిపింది. స్థానికులు ఆ మృగాడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
చదవండి: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం
మదనపల్లి ప్రైవేట్ లాడ్జిలో యువతి ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment