ఎస్సార్‌నగర్ (హైదరాబాద్): నగరంలోని ఎస్సార్‌నగర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం బ్యాంక్‌లో అగ్నిప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బ్యాంక్ సిబ్బంది అగ్నిమాపకశాఖ వారికి సమాచారం అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.