హైదరాబాద్: సినీ నటి అపూర్వను కొందరు దుండగులు బెదిరించి వెళ్లారు. సోమవారం ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని సిద్ధార్ధనగర్‌లో నివాసముంటున్న నటి అపూర్వ ఇంటికి నలుగురు దుండగులు వచ్చి ఆమెను బెదిరించారు. అయితే మూడు రోజుల క్రితం తన కారుకు జరిగిన యాక్సిడెంట్‌కు సంబంధించి మాట్లాడతామని తన ఇంటికి వచ్చి బెదిరించినట్టు పోలీసులకు చెప్పింది.
తనను దుండగులు బెదిరించినట్టు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నటి అపూర్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.