కీలక దశకు చేరుకున్న శ్రావణి కేసు | Sravani Family And Sai Face Police Investigation On Sunday | Sakshi
Sakshi News home page

విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి

Published Sat, Sep 12 2020 5:14 PM | Last Updated on Sat, Sep 12 2020 6:46 PM

Sravani Family And Sai Face Police Investigation On Sunday - Sakshi

తూర్పు గోదావరి : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవరాజ్‌ను ఇప్పటికే విచారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించిందుకు ఆమె కుటుంబ సభ్యులను విచారించనున్నారు. పోలీసుల పిలుపు మేరకు శ్రావణి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి శనివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో రేపు ఉదయం (ఆదివారం) శ్రావణీ తల్లిదండ్రులు, సోదరుడుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా హాజరు కానున్నారు. (శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్‌)

శ్రావణీ కుటుంబ సభ్యులను సాయి తన కారులో ఎక్కించుకుని హైదరబాద్‌కు ప్రయనమైయ్యాడు. కాగా దేవరాజ్‌, సాయి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సాయి, ఆమె కుటుంబ సభ్యలను విచారించిన తరువాతనే కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సాయి, శ్రావణికి సంబంధించిన ఓ వీడియో సైతం తాజాగా వెలుగులోకి రావడంతో అతని పాత్రపై మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం నాటి విచారణ కేసు దర్యాప్తులో కీలకం కానుంది. (ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement