![HYD: Degree Student Suicide Over Mother Scolded For Poor Marks - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/28/student.gif.webp?itok=2-nApMTE)
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్ ఇన్స్‌పెక్టర్ సైదులు తెలిపిన మేరకు..వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అసిత్ కుమార్ డెరియ భార్య, పిల్లలతో కలిసి సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లో డెక్కన్ సెరాయి హోటల్‌లో పనిచేసే కుమార్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు బోనాశ్రీ డెరియ (19) గురువారం ఉదయం కేఎల్‌ఎన్‌వై పార్కులో వాకింగ్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చింది.
మార్కులు తక్కువగా ఎందుకు వచ్చాయని తల్లి మందలించి ఆమె కూడా వాకింగ్‌కు వెళ్లి పోయింది. తిరిగి తల్లి ఇంటికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. తలుపులు ఎంత సేపు తట్టినా లోపల నుండి సమాధానం రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా బోనాశ్రీ సీలింగ్ వ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
చదవండి: బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్‌దే
Comments
Please login to add a commentAdd a comment