Mother scolds
-
మార్కులు తక్కువొచ్చాయని తల్లి మందలింపు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు..వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అసిత్ కుమార్ డెరియ భార్య, పిల్లలతో కలిసి సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లో డెక్కన్ సెరాయి హోటల్లో పనిచేసే కుమార్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు బోనాశ్రీ డెరియ (19) గురువారం ఉదయం కేఎల్ఎన్వై పార్కులో వాకింగ్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. మార్కులు తక్కువగా ఎందుకు వచ్చాయని తల్లి మందలించి ఆమె కూడా వాకింగ్‌కు వెళ్లి పోయింది. తిరిగి తల్లి ఇంటికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. తలుపులు ఎంత సేపు తట్టినా లోపల నుండి సమాధానం రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా బోనాశ్రీ సీలింగ్ వ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్‌దే -
రూ.40 వేలు మాయం: బాలుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమింగ్
భోపాల్: ఎప్పుడూ ఫోన్లో ఆటలు ఆడుతూ ఉండడంతో తల్లి మందలించింది. పైగా ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టడంతో తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తిట్టడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ చత్తార్పూర్ జిల్లాలో జరిగింది. శాంతినగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్‌కు బానిసగా మారాడు. ఈ గేమ్ తరచూ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ ఆటలో రూ.40 వేలు ఖర్చు చేశాడు. ఇంట్లో సోదరితో ఉండి కుమారుడు గేమ్ ఆడుతూ ఉంది. పొలం పనులకు వెళ్లిన తల్లికి ఓ మెసేజ్ వచ్చింది. బ్యాంక్ ఖాతాలో రూ.1,500 మాత్రమే ఉందని ఆ సందేశంలో ఉంది. ఇది చూసిన తల్లి వెంటనే కుమారుడిని తన వద్దకు పిలిపించింది. డబ్బులు ఏం చేశావని కుమారుడిని అడిగింది. తల్లి కోపంతో అడగడంతో కుమారుడు తడబడ్డాడు. మెల్లగా అడగడంతో డబ్బులు ఆన్లైన్ గేమ్ కోసం ఆడినట్లు తెలిపాడు. రూ.40 వేలు ఆన్లైన్ గేమ్‌తో వృథా చేశాడని తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో కుమారుడు మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తల్లి మందలించిందనే కోపంతో ఇంటికొచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉన్న సోదరి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు కుమారుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుస్తకాలు, పెన్సిల్స్ దొంగిలిస్తున్నాడని..
అల్లిపురం (విశాఖ దక్షిణం): పిల్లలు తప్పు చేస్తే నయానో, భయానో దారికి తెచ్చుకోవాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించి వాతలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి విషయం తెలియటంతో తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి, ప్లిలలకు వైద్యం అందజేస్తున్నారు. వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం చినముషిడివాడ హైస్కూలులో గాయత్రి 4వ తరగతి, వరుణ్‌కుమార్ 3వ తరగతి చదువుతున్నారు. వరుణ్‌కుమార్ తోటి పిల్లల పుస్తకాలు, పెన్సిల్స్ దొంగిలిస్తున్నాడని పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో అతని తల్లి అట్లకాడతో వాతలు పెట్టింది. తమ్ముడు తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావని గాయత్రికి కూడా కాళ్లపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పిల్లలను పరామర్శించేందుకు బుధవారం స్కూల్‌కు వెళ్లారు. వారు స్కూలుకు రాలేదని టీచర్ చెప్పడంతో ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి తల్లిని, పిల్లలను కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలిద్దరికీ పారా మెడికల్ వార్డులో వైద్యం అందించారు. స్కిన్ డాక్టర్ సూచన మేరకు పిల్లల వార్డులో చేర్పించి వైద్యం అందజేస్తున్నారు. -
తల్లి మందలించిందని ఉరేసుకున్నాడు!
కోల్‌సిటీ (కరీంనగర్) : తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని వినోభానగర్‌లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని మానకొండూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన ప్రశాంత్ ఇటీవలే 9వ తరగతి పూర్తిచేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో వారం రోజులు గోదావరిఖనిలోని పెద్దనాన్న ఇంట్లో గడిపి వస్తానని వెళ్లాడు. అయితే వారం రోజులు దాటినా రాకపోయే సరికి ప్రశాంత్ తల్లి సరోజ శనివారం ఉదయం గోదావరిఖనికి వచ్చింది. పదో తరగతికి ముందస్తు శిక్షణ ప్రారంభం కాగా.. తోటి విద్యార్థులందరూ వెళుతున్నారు, నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోయావంటూ కుమారుడిని మందలించింది. దీంతో ప్రశాంత్ మనస్తాపం చెందాడు. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న అతడు ఆయింట్మెంట్ రాసుకుంటానని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని చీరతో ఉరేసుకున్నాడు. ఎంతసేపటికీ ప్రశాంత్ బయటకు రాకపోవడంతో తల్లి కిటీకీలోంచి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో సరోజ లబోదిబోమంటూ కన్నీరుపెట్టింది. స్థానికులు వచ్చి ప్రశాంత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.